బరిలో నుంచి తప్పుకున్న ఆదాల | Adala prabhakar reddy withdrawal his Rajya Sabha poll | Sakshi
Sakshi News home page

బరిలో నుంచి తప్పుకున్న ఆదాల

Feb 6 2014 2:19 PM | Updated on Jul 29 2019 5:31 PM

బరిలో నుంచి తప్పుకున్న ఆదాల - Sakshi

బరిలో నుంచి తప్పుకున్న ఆదాల

అధిష్టానం ఒత్తిడి నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ బరి నుంచి తప్పుకున్నారు.

హైదరాబాద్ : అధిష్టానం ఒత్తిడి నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ బరి నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన చివరి నిమిషంలో ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారనే విషయంపై సరైన జవాబు చెప్పకుండా కుంటి సాకులు చెప్పటడం విశేషం.

కాగా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఆదాలను కోరారు. అయితే తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్న ఆయన... తాజాగా పోటీ నుంచి తప్పకుంటున్నట్లు వెల్లడించారు.
 గతంలో తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకొచ్చిన  ఆదాల ... ఇప్పుడు తప్పుకోవటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement