సంచలనాత్మక రుషికేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టును డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆందోళన బాటపట్టింది.
- వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్
- వైఎస్సార్ జిల్లాలో భారీ ఆందోళన
వైఎస్ఆర్ కడప జిల్లా: సంచలనాత్మక రుషికేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టును డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆందోళన బాటపట్టింది.
రుషితేశ్వరి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు అధ్యాపకులు, సీనియర్ల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని, నిదితులను అరెస్టు చేయాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందని ఆరోపించింది.ఇప్పటికైనా నిందితులను అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కడప నగరంలో భారీ ర్యాలీతోపాటు, మానవహారాం నిర్వహించారు.