డీసీసీ అధ్యక్షుడు మాకం రాజీనామాను పీసీసీ ఆమోదించింది. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స రాజీనామాలు చేసిన అధ్యక్షుల జాబితాను ప్రకటిస్తూ వాటిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : డీసీసీ అధ్యక్షుడు మాకం రాజీనామాను పీసీసీ ఆమోదించింది. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స రాజీనామాలు చేసిన అధ్యక్షుల జాబితాను ప్రకటిస్తూ వాటిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మాకం పేరును రాజీనామా జాబితాలో ధృవీకరించారు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా అప్పటి డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు కూడా పార్టీని వీడారు. ఆ స్థానాన్ని మాకంతో భర్తీ చేశారు.
కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ మాకం ఆరు నెలల కిందట తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను అంగీకరించబోమని ప్రభుత్వ చీఫ్ విప్ శివరామిరెడ్డి, జిల్లాకు వచ్చిన పరిశీలకులు ఇటీవల వెల్లడించారు. అయితే శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల అధ్యక్షుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది.