ఏసీబీకి చిక్కిన వీఆర్వో | acb caught vro in guntur distirict | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Apr 21 2015 12:27 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ నడింపల్లి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు.

గుంటూరు : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ నడింపల్లి వీఆర్వో ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా లోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన రైతు సురేష్‌కు పట్టా పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు రూ.4 వేలు ఇవ్వాలని రెండు నెలలుగా వీఆర్వో వర్ధ వెంకటేశ్వర ప్రసాద్ డిమాండ్ చేస్తున్నాడు. దీంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా వీఆర్వో ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చెరుకుపల్లి)
 

Advertisement
 
Advertisement
Advertisement