లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ | ACB Caught Revenue inspector | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

Mar 28 2016 6:10 PM | Updated on Sep 3 2017 8:44 PM

లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం చోటుచేసుకుంది.

పార్వతీపురం (విజయనగరం) : లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కిరీటి మండలానికి చెందిన దొరన్న అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లీగల్ హైర్ సర్టిఫికెట్ కోసం దొరన్న అనే వ్యక్తి గత కొంత కాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతుండగా.. పని త్వరగా జరగాలంటే రూ. 4 వేలు ఇవ్వాలని ఆర్‌ఐ కిరీటి డిమాండ్ చేశాడు. దీంతో దొరన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement