లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ అధికారుల పట్టివేత | ACB Caught Irrigation officers in Ysr District | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ అధికారుల పట్టివేత

Oct 3 2017 5:46 PM | Updated on Aug 17 2018 12:56 PM

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా:  చిన్ననీటి పారుదల శాఖ కార్యాలయంలో అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాజీపేటకు చెందిన బదిరుల్లా నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా పనులు చేయించాడు. అందుకు సంబంధించిన బిల్లు మంజూరు కోసం ఏఈ వరప్రసాద్‌, డీఈ రమణారెడ్డి రూ.80వేలు డిమాండ్‌ చేయగా ఏసీబీకి సమాచారం ఇచ్చాడు.

 వారి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం వారికి కార్యాలయంలోనే రూ.80 వేలు లంచం ఇచ్చాడు. అదే సమయంలో అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు తీసుకున్న ఇద్దరినీ  పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement