68 కిలోల గంజాయి పట్టివేత | 68 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

68 కిలోల గంజాయి పట్టివేత

Dec 11 2015 6:26 PM | Updated on Sep 3 2017 1:50 PM

ఏజెన్సీ ఏరియా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఎమ్‌వీపీ కాలనీ (విశాఖపట్నం) : ఏజెన్సీ ఏరియా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుగా గంజాయి వ్యాపారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

విద్యార్థి దశ నుంచే గంజాయికి బానిసైన శ్యాంకుమార్(21), రామకృష్ణ(27)లు పాడేరు నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా ఒక అద్దె ఇంటిలో ఉంచి విక్రయిస్తున్నారు. ఇది గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 68 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement