65 కేజీల గంజాయి స్వాధీనం - నలుగురి అరెస్ట్ | 65 kg cannabis seized - four arrested | Sakshi
Sakshi News home page

65 కేజీల గంజాయి స్వాధీనం - నలుగురి అరెస్ట్

Dec 14 2015 11:47 AM | Updated on Sep 3 2017 1:59 PM

తూర్పుగోదావరి జిల్లా వైరావరం సమీపంలో సోమవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 65 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా వైరావరం సమీపంలో సోమవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 65 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మోటార్‌బైక్‌పై వెళుతున్న వ్యక్తులను ఆపి.. సోదాలు నిర్వహించగా.. వారి వద్ద గంజాయి దొరికింది.

దొరికిన గంజాయి విలువ రూ.2.60లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారు.. నిజామాబాద్‌కు చెందిన రాజ్‌పుత్‌సింగ్, గోపవరం కొత్తపల్లెకు చెందిన శివరామకృష్ణ, వైరావరం పాత కాలనీకి చెందిన ప్రేమ్‌చంద్, విశాఖ జిల్లా మాధవరంపాడు గ్రామానికి చెందిన రాజు లుగా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement