60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | 60 redwood staves capture iin nellore distirict | Sakshi
Sakshi News home page

60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 14 2015 9:40 AM | Updated on Sep 26 2018 6:01 PM

ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరు : ఎర్రచందనాన్నిఅక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం తేనుగుంట గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు..నెల్లూరు నుంచి చెన్నైకు విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి తేనుగుంట వద్ద ఒక స్కార్పియో, లారీలను స్వాధీనం చేసుకున్నారు.

లారీలో 60 ఎర్రచందనం దుంగలను ఉన్నట్లు గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(తడ)

Advertisement
 
Advertisement
Advertisement