విశాఖ బీచ్‌లో నలుగురు గల్లంతు | 4students drown in visakapatnam beach | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌లో నలుగురు గల్లంతు

Oct 11 2015 5:34 PM | Updated on Sep 3 2017 10:47 AM

విశాఖపట్నంలోని ఏయూ ఉమెన్స్ హాస్టల్ బీచ్ వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.

డాబాగార్డెన్స్: విశాఖపట్నంలోని ఏయూ ఉమెన్స్ హాస్టల్ బీచ్ వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు... సెలవు దినం కావడంతో ఆదివారం నేలమ్మవేపచెట్టు ప్రాంతంలోని ప్రియాంక విద్యోదయ స్కూల్‌కు చెందిన ఏడుగురు పదో తరగతి విద్యార్థులు బీచ్‌కు వెళ్లారు. వారిలో ఆరుగురు సముద్రంలోకి వెళ్లగా గణేశ్, కె.రోహిత్, అబ్దుల్ జబార్ గల్లంతయ్యారు.

వీరి కోసం గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ఏడుగురు సభ్యుల బృందం కూడా సముద్రంలోకి దిగగా, ఢిల్లీకి చెందిన షరీఫ్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్వల్ప వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement