
రోడ్ టెర్రర్
రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య మాత్రం ఏకంగా 31,228 గా ఉంది.
ఏడాదిలో 31,228 మంది యాక్సిడెంట్ల మృతులు
2,484 మంది హత్యలకు గుైరె నవారు..
రాష్ట్రంలో నిరుడు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది వివిధ కారణాల నేపథ్యంలో జరిగిన హత్యల్లో 2,484 మంది చనిపోగా.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య మాత్రం ఏకంగా 31,228 గా ఉంది. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ మరణాల్లో దేశంలో ఉమ్మడి ఏపీ వరుసగా రెండో ఏడాది ఐదో స్థానాన్ని ఆక్రమించింది. కొరవడిన మౌలిక వసతులు, వాహనచోదకుల నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపటం, పరిమితికి మించిన వేగం.. ఇలా అనేక కారణాలతో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. 2012 సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది (2013లో) ప్రమాదాల సంఖ్య 1,376 పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ హైదరాబాద్ (సైబరాబాద్‌తో కలిపి) తొలి స్థానంలో ఉంది. మృతుల సంఖ్య 2012 కంటే గత ఏడాది విజయవాడలో తగ్గగా.. విశాఖపట్నంలో మాత్రం పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో.. ఆకతాయితనం, వేగం ఎక్కువగా ఉండే యువకుల కంటే మధ్య వయస్కులే ఎక్కువగా మృతులుగా ఉండటం మరో ఆందోళనకర అంశం. గత ఏడాది 14-29 ఏళ్ల మధ్య వయస్కులు 9,619 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా.. 30-44 ఏళ్ల మధ్య వారు 11,533 మంది అశువులుబాశారు. మొత్తం మృతుల్లో 25,091 మంది పురుషులు, 6,137 మంది మహిళలు ఉన్నారు.