కలుషితాహారం.. 30 మందికి అస్వస్థత | 30 injuresd in welfare hostel | Sakshi
Sakshi News home page

కలుషితాహారం.. 30 మందికి అస్వస్థత

Mar 6 2015 12:09 AM | Updated on Sep 2 2017 10:21 PM

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడి హాస్టల్‌లో ఉన్న 60 మంది విద్యార్థులు గురువారం పప్పు, క్యాబేజి , కోడిగుడ్డులతో భోజనం చేశాక కొందరు కడుపునొప్పితో బాధపడగా, మరికొందరు కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం 28 మందిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాడైన కోడిగుడ్లు వండడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ విద్యార్థులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement