అవినీతి రహిత పాలనను అందిస్తాం: డిప్యూటి సీఎం | 30 Crores Released For Repairing Of Mosques In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మసీదులు, చర్చిల మరమత్తులకు 3 కోట్ల 36 లక్షలు మంజూరు.

Jun 17 2019 6:42 PM | Updated on Jun 17 2019 6:44 PM

30 Crores Released For Repairing Of  Mosques In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి :  మైనార్టీ శాఖా మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అంజాద్‌ బాషా..  వైఎస్సార్ కడప జిల్లాలోని  మసీదులు, చర్చిల మరమ్మత్తుల నిమిత్తం 3 కోట్ల 36 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తనను  డిప్యూటీ సీఎం చేసినందుకు సీఏం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

వక్స్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం  కాకుండా చూస్తామని, వక్స్ బోర్డు ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సోదరులు వినియోగిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లో వైఎస్సార్సీపీ అవినీతి రహిత పాలననే అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారని, తాము కూడా అదే బాటలో ముందుకు వెళడానికి కృషి చేస్తామని పేర్కోన్నారు. జగన్‌ పాలన,  తన తండ్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి పాలనను మించేలా ఉండబోతుందని పేర్కోన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement