గోనెసంచిలో 3నెలల చిన్నారి.. | 3 months baby girl found alive in gunny bag | Sakshi
Sakshi News home page

గోనెసంచిలో 3నెలల చిన్నారి..

Apr 30 2015 8:36 AM | Updated on Aug 21 2018 9:20 PM

నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ కూడలిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మూడు నెలల చిన్నారిని ...

నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ కూడలిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మూడు నెలల చిన్నారిని గోనెసంచెలో వదిలి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  ఎక్కడి నుంచో ఏడుపు వినిపించటంతో స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు...గోనెసంచిను విప్పి చూడగా అందులో పసిపాపను చూసి అవాక్కు అయ్యారు. అనంతరం పాపను పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement