పెట్రోలింగ్ జీప్ బోల్తా.. ముగ్గురికి గాయాలు | 3 injures as patroling zeep turns turtle in guntur | Sakshi
Sakshi News home page

పెట్రోలింగ్ జీప్ బోల్తా.. ముగ్గురికి గాయాలు

Aug 4 2015 7:31 AM | Updated on Sep 3 2017 6:46 AM

వేగంగా వెళ్తున్న పోలీస్ జీప్ అదుపుతప్పి బోల్తా కొట్టింది.

గుంటూరు: వేగంగా వెళ్తున్న పోలీస్ జీప్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్సై సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. దాచేపల్లి నుంచి రామాపురం వెళ్తున్న పెట్రోలింగ్‌జీప్ క్రాస్‌రోడ్డు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జీపులో ముందు కూర్చున్న ఏఎస్సై సాంబశివరావుకు తీవ్ర గాయాలవ్వగా.. మరో కానిస్టేబుల్, హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న స్థానికులు 108 సాయంతో వారిని గుంటూరులోని లలిత ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement