ప్రైవేటు బస్సు బోల్తా | 3 injured as Bus overturns | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు బోల్తా

Aug 2 2015 10:08 AM | Updated on Sep 3 2017 6:39 AM

వేగంగా వెళ్తున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది.

తూర్పుగోదావరి : వేగంగా వెళ్తున్న బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది.

వివరాల ప్రకారం.. రవళి స్పిన్నింగ్ మిల్‌కు చెందిన బస్సు కార్మికులను ఎక్కించుకొని కొత్తపేట నుంచి వానపల్లికి వస్తున్న క్రమంలో వానపల్లి శివారులకు వచ్చేసరికి ముందు వెళ్తున్న స్కూల్ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement