ఏపీ రాష్ట్ర రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామాన్ని డెంగీ పట్టిపీడిస్తోంది.
తాడేపల్లి: ఏపీ రాష్ట్ర రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామాన్ని డెంగీ పట్టిపీడిస్తోంది. డెంగీ బారిన పడి ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు డెంగీ జ్వరంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులలో ఉండవల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందగా.. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ(52) చికిత్స పొందుతూ మృతి చెందింది. నలుగురు మహిళలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.