240 కిలోల గంజాయి స్వాధీనం

240 kg Of Marijuana Possession - Sakshi

సాక్షి, మాడుగుల : మండలంలో విశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం దాడులు  నిర్వహించారు.   పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రెండు కార్లలో తరలిస్తున్న  240 కిలోల  గంజాయిని పట్టుకున్నారు.  విశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సీహెచ్‌.వి.ప్రసాద్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు తాటిపర్తి చెక్‌ పోస్టు వద్దకు వెళుతుండగా తమను గమనించిన నిందితులు కార్లు, గంజాయి మూటలను వదిలి పరారయ్యారన్నారు. గంజాయి, కార్లను స్థానిక ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించామని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఎస్‌.ఐ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్నముగ్గురు మహిళల అరెస్ట్‌
ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ) : గిరిజన ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు.  సర్కిల్‌ – 4 ఎక్సైజ్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన కొంతమంది ఢిల్లీలో నివసిస్తున్నారు. వీరిలో ఐదుగురు విశాఖలోని గిరిజన ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఢిల్లీ తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ సిబ్బందితో ఎన్‌ఏడీ కూడలిలో మాటువేసి పట్టుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు చిక్కగా, ఇద్దరు తప్పించుకున్నారు. 18 కిలోల గంజాయి, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని చెబుతున్నారు. మహిళలతోపాటు బైక్, గంజా యిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సర్కిల్‌ – 4 ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు. దీనిపై ఎక్సైజ్‌ సీఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top