23 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతి | 23 sand Reich environmental permit | Sakshi
Sakshi News home page

23 ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతి

Oct 30 2014 12:18 AM | Updated on Aug 28 2018 8:41 PM

జిల్లాలో 27 ఇసుక రీచ్‌లు గుర్తించగా, 23 రీచ్‌లకు ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చిందని, మిగిలిన నాలుగింటికి త్వరలో అనుమతి రానుందని జాయింట్ కలెక్టర్

 కాకినాడ సిటీ : జిల్లాలో 27 ఇసుక రీచ్‌లు గుర్తించగా, 23 రీచ్‌లకు ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చిందని, మిగిలిన నాలుగింటికి త్వరలో అనుమతి రానుందని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ విధానగౌతమి సమావేశహాలులో డీఆర్‌డీఏ, ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఇసుక అమ్మకాలపై ఆయన సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి రాజమండ్రి, ధవళేశ్వరం వద్ద ఇసుక డీసిల్టేషన్ ప్రారంభించామన్నారు. ఏడు రీచ్‌లలో ఇసుక అమ్మకాలు ప్రారంభించామని, గ్రూప్ ఫెడరేషన్ ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహిస్తామన్నారు. 23 రీచ్‌లలో మిషన్ ద్వారా ఇసుక తవ్వకాలు చేసి, ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా అమ్మకాలు చేస్తారన్నారు. ఇంకా 13 కొత్త రీచ్‌ల అనుమతి రావాల్సి ఉందని, నాలుగు రీచ్‌లను పరిశీలించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement