23 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ | 23 Paliset counseling | Sakshi
Sakshi News home page

23 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

May 19 2016 6:13 AM | Updated on Sep 18 2018 7:45 PM

పాలిసెట్ - 2016లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి 29 వరకు......

నెల్లూరు (టౌన్): పాలిసెట్ - 2016లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి 29 వరకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. నెల్లూరులోని ప్రభుత్వ బాలుర (వెంకటేశ్వరపురం), ప్రభుత్వ ఉమెన్స్ (దర్గామిట్ట) పాలి టెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరగనుంది. ఉదయం తొమ్మిది గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఎస్టీ విద్యార్థులు ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది.


 తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు
కౌన్సెలింగ్‌కు ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, పదో తరగతి మార్క్‌లిస్ట్, టీసీ, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అవసరం ఉన్న వారికి సర్టిఫికెట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల జిరాక్స్‌లను రెండు సెట్లు తీసుకురావాల్సి ఉంది. క్యాప్, ఎన్‌సీసీ, హ్యాండీక్యాప్డ్, ఆంగ్లో ఇండియన్ విద్యార్థులు విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement