శ్రీకాకుళం జిల్లాలో భారత అభిమానుల సంబరాలు విషాదం నింపాయి.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భారత అభిమానుల సంబరాలు విషాదం నింపాయి. బాణాసంచా పేలడంతో ఇద్దరు మృతిచెందడంతో పాటు మరో ఐదుగురు గాయపడ్డ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి... దాయాది పాకిస్థాన్ తో తలపడిన మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించడంతో అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే వంగర మండలం కొత్తమయవాడలో బాణాసంచా పేల్చిన ఘటనలో ప్రమాదవశాత్తూ ఇద్దరు మృతిచెందడంతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.