రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో ఉపాధి కష్టమవుతుందని ఆందోళన చెందిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని దేవరాయపురం కాలనీకి చెందిన నాగశేషుడు(36) దినసరి కూలీ
ఆళ్లగడ్డటౌన్, న్యూస్‌లైన్ :
రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో ఉపాధి కష్టమవుతుందని ఆందోళన చెందిన ఓ కూలీ గుండెపోటుతో మృతి చెందాడు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని దేవరాయపురం కాలనీకి చెందిన నాగశేషుడు(36) దినసరి కూలీ. స్థానికంగా ఉపాధి లేని సమయంలో హైదరాబాద్ వెళ్లి ప్యాక్టరీలో పనులు చేసుకునేవాడు. రాష్ట్రం విడిపోతుందని టీవీల్లో, పత్రికల్లో వార్తలు వచ్చినప్పుటి నుంచి కలత చెందాడు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో పనులు చేసుకునే వారికి ఇబ్బందులు ఉంటాయని రోజూ మి త్రుల వద్ద వాపోయేవాడు. వారం రోజుల నుంచి టీవీల్లో ఎప్పుడు రాష్ట్ర విభజనపై చర్చలు జరుగుతున్నా తప్పనిసరిగా చూసేవాడు. శనివారం రాత్రి కూడా వివిధ ఛానళ్లలో వచ్చే వార్తలు, విశ్లేషణలను చూ స్తూ ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించగా అ ప్పటికే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ మాలకొండయ్య, గ్రామ రెవెన్యూ అధికారి బారెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ వరప్రసాదరెడ్డి, నాయకులు దస్తగిరిరెడ్డి, శ్రీనివాసులు తది తరులు మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. మృతునికి భార్య లక్ష్మీదేవి 9 నెలల బాబు ఉన్నారు. బాధిత కుటుం బాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉద్యమకారులు పేర్కొన్నారు.