లారీ బోల్తా..ఇద్దరు మృత్యువాత | 2 killed in lorry accident at west godavari district | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా..ఇద్దరు మృత్యువాత

Jun 29 2016 11:59 AM | Updated on Sep 4 2017 3:43 AM

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చేపలలోడుతో తల్లాపురం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోగా మరో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement