లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు | 2 injured in lorry accident at east godavari | Sakshi
Sakshi News home page

లారీ బోల్తా: ఇద్దరికి గాయాలు

Jan 26 2016 10:34 AM | Updated on Sep 3 2017 4:21 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయాల పాలయ్యారు.

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయాల పాలయ్యారు. పోర్టు రోడ్డులోని గామన్ వంతెన లారీ బోల్తా పడగా డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. క్రేన్‌ను తెప్పించి డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement