150 కిలోల గంజాయి పట్టివేత | 150 kgs cannabis seized in vishaka | Sakshi
Sakshi News home page

150 కిలోల గంజాయి పట్టివేత

Jul 22 2015 1:02 PM | Updated on Sep 19 2019 2:50 PM

అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని అటవీ అధికారులు పట్టుకున్నారు.

విశాఖపట్నం: అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని అటవీ అధికారులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడేపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు 150 కిలోల గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దాని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని అధికారులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement