కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించారు.
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహించారు. మచిలీపట్నం పరిధిలోని రాజుపేట, గంగులతోట, పావురాలగుట్ట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. స్థానికుల ధృవపత్రాలను పరిశీలించారు. అనుమానితుల కదలికలపై ఆరా తీశారు. నేర చరిత్ర కలిగిన 15మందిని అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్స్‌లేని 15 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వంద మంది పోలీసులు కార్డ్ ఆన్ సెర్చ్‌లో పాల్గొన్నారు.