ఘంటసాల మండలంలో ఉద్రిక్తత | 144 section in srikakulam village due to villegers fight on sand mafia | Sakshi
Sakshi News home page

ఘంటసాల మండలంలో ఉద్రిక్తత

Feb 25 2015 12:18 PM | Updated on Sep 2 2017 9:54 PM

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ఇసుక అడ్డగోలు తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది.

అవనిగడ్డ: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ఇసుక అడ్డగోలు తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన ఉధృతరూపం దాలుస్తోంది. దీంతో అక్కడ పోలీసులు బుధవారం ఉదయం నుంచి 144 సెక్షన్‌ను విధించారు. 150 మంది పోలీసులు గ్రామంలో మోహరించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కాగా, సాయంత్రం 6 గంటల తర్వాత అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేసి, ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై చర్యలు తీసుకునే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. మరో వైపు గ్రామంలోని ఇసుకరీచ్ వద్ద పోలీసు పహారా నడుమ అధికారులు ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement