శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆముదాలవలస మార్కెట్‌లో వ్యాపార సముదాయాలను తొలగించేందుకు అధికారులు వెళ్లారు. జేసీబీలతో తొలగించేందుకు ప్రయత్నించగా కూరగాయల వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారం వ్యాపారస్తులకు మద్దతు తెలియజేశారు. వ్యాపారస్తులు ఆందోళనకు దిగడంతో ఆముదాలవలసలో 144 సెక్షన్ విధించారు. అంతేగాక, విద్యుత్ సరఫరాను ఆపివేశారు.