అత్యాచారం చేస్తూ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ యువకుడు | 14 year old girl raped by youth at Anantapur district | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేస్తూ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ యువకుడు

Apr 12 2014 5:25 PM | Updated on Jul 28 2018 8:44 PM

అత్యాచారం చేస్తూ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ యువకుడు - Sakshi

అత్యాచారం చేస్తూ రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డ యువకుడు

అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై స్థానిక కానిస్టేబుల్ ఇంట్లో పనిచేసే మురళి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతూ రెడ్ హండెడ్గా పట్టుబడ్డాడు.

అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై స్థానిక కానిస్టేబుల్ ఇంట్లో పనిచేసే మురళి అనే వ్యక్తి  అత్యాచారానికి పాల్పడుతూ రెడ్ హండెడ్గా పట్టుబడ్డాడు. దాంతో స్థానికులు, బాలిక బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మురళిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అత్యాచారానికి గరైన బాలికను పెళ్లి చేసుకోవాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు. అతడు పెళ్లి చేసుకునేందుకు ఒప్పకోకుంటే కేసు నమోదు చేయాలని వారు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

అయితే గత కొంత కాలంగా కానిస్టేబుల్ ఇంట్లో పని చేసే మురళి 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు... ఆమెను తన మాటలతో వంచించి... అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ క్రమంలో అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. కాగా అత్యాచారం చేస్తూ స్థానికులకు పట్టుబడి పోయాడు. అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడ మీద ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement