వాహనం డ్రైవర్, కొనుగోలు దారులను విచారించిన తరువాత కలిబండరేషన్‌షాపు డీ లర్ పెద్దిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నమండెం: మండలంలోని కలిబండ రేషన్ షాపు(షాపు నెం:3) నుంచి అక్రమంగా చిత్తూరు జిల్లా తుమ్మలగొందికి ఐచర్ వాహనంలో తరలిస్తున్న 123 బస్తాల చౌకబియ్యాన్ని పెద్దమండెం పోలీసులు పట్టుకున్నారు. వాహనం డ్రైవర్, కొనుగోలు దారులను విచారించిన తరువాత కలిబండ రేషన్‌షాపు డీ లర్ పెద్దిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నమండెం మండలంలోని అన్ని రేషన్ షాపుల నుంచి బియ్యం కొనుగోలు చేసి, మొత్తం ఒక్కసారిగా అమ్ముతున్నట్లు పెద్దిరెడ్డి తెలిపినట్లు సమాచారం షాపు పరిధిలోని పల్లెల్లో పోలీసులు విచారించగా నిత్యావసర వస్తువుల పంపిణీ సరిగ్గా చేయనట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేశారు. కాగా మూడు రోజుల వ్యవధిలో రెండుమార్లు కలిబండ షాపునకు బియ్యం సరఫరా చేయడంపై స్థానికులు అధికారులను విమర్శిస్తున్నారు. చాలా మంది రేషన్‌డీలర్లు బస్తా చౌకబియ్యం బ్లాక్ మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.1000లకు అమ్ముతున్నట్లు తెలిసింది.