పుట్టపర్తి నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే ప్రమాదం | 10 minutes from the risk of puttaparthi | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే ప్రమాదం

Dec 29 2013 4:20 AM | Updated on Jun 1 2018 8:47 PM

శనివారం తెల్లవారు జామున 3.20 నిమిషాలకు పుట్టపర్తి రైల్వే స్టేషన్‌ను దాటిన రైలు 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైందని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్ శారదా అవధాని బృందం ప్రాథమికంగా అంచనా వేసింది.

అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : శనివారం తెల్లవారు జామున 3.20 నిమిషాలకు పుట్టపర్తి రైల్వే స్టేషన్‌ను దాటిన రైలు 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైందని నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ డెరైక్టర్ శారదా అవధాని బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఈ బృందం ఉదయమే ఘటన స్థలానికి చేరుకుని రీజనల్, జిల్లా బృందాలతో కలసి ప్రమాదానికి దారి తీసిన కారణాలపై పరిశీలన జరిపింది. బీ1 బోగీలో కొన్ని ఆధారాలను సేకరించిన బృందం.. పుట్టపర్తి నుంచి బయలుదేరిన 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైనట్లు గుర్తించింది.
 
  రైలు ప్రమాదం సమాచారం అందగానే కొత్తచెరువు పోలీసులు హైదారాబాద్ డీజీ కంట్రోల్ రూమ్‌కు విషయాన్ని చేరవేశారని ఎస్పీ సెంథిల్ కుమార్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల సమాచారంతో పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, అనంతపురం పోలీసు అధికారులు, ఆయా స్టేషన్ల పరిధిలోని సుమారు 500 మంది స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. స్పెషల్ పార్టీ బృందాలు క్షతగాత్రులతో పాటు మృతదేహాలను వెలికి తీయడంలో సేవలందించారని ఎస్పీ తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ఓ వైపు భద్రత కల్పిస్తూనే, మరో వైపు సేవా కార్యక్రమాల్లో పోలీసులు నిమగ్నమయ్యారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement