breaking news
-
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!
పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్‌ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
బాబుగారూ.. ‘టెన్త్’లో మీరు, మీ కొడుకు ఫెయిల్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్(Nara Lokesh) టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్ ఫలితాలు సరైనవేనా? -
ఏడాది పాలన.. ప్రజలకు బాబు సర్కార్ వెన్నుపోటు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు ఏడాది పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధింపుతోనే గడిచిపోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యకర్మం పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబు తీరును నిరసిస్తూ వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు... ఇష్టారీతిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు నట్టేట ముంచుతున్నారన్నారు.తిరుపతి: ఎన్నికల హామీలపై కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని వైస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమం పోస్టర్‌ను భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష విడుదల చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అరాచకాలు, హత్యలు, అన్యాయాలు చేస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 800 మందిపై హత్య రాజకీయాలు చేశారు. 370 మంది పైగా చనిపోయారు. కూటమి నేతలు ప్రతి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పడు కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్ కేసు ద్వారా తప్పుడు కేసులు పెట్టి, నెలలు తరబడి జైల్లో పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అనాగరిక, అరాచక పాలన సాగిస్తోంది..ఏడాది కాలంగా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. గత మూడు నెలలు కాలంలో మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీపీ ఎన్నికలు ద్వారా బల ప్రయోగం ద్వారా లాక్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అంతా అసంతృప్తితో ఉన్నారు. జూన్ 4 వ తేదీ వెన్నుపోటు దినgగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీ చేపడతాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరసన ర్యాలీలో ప్రజలు అందరూ స్వచ్చందంగా పాల్గొంటారు. కూటమి పాలనపై ప్రజలు అందరూ ఆగ్రహంతో ఉన్నారు’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. -
బదిలీల పేరిట ఉద్యోగులకు వేధింపులు.. లంచాల డిమాండ్: ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి
గుంటూరు, సాక్షి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని.. ఇప్పుడు బదిలీల పేరుతో వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి(N Chandrashekar Reddy) అన్నారు. ఏపీలో ఉద్యోగుల బదిలీల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల బదిలీల్లో భారీగా అక్రమాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల(Kutami MLAs) నుండి సిఫార్సు లేఖలు తెమ్మని కొందరు అధికారులు చెప్తున్నారు. ఆ సిఫార్సు లేఖలు కావాలంటే అదే విషయాన్ని కూడా జీవోలో ప్రస్తావించాల్సి ఉంది. అయినా.. ఉద్యోగుల బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సులతో పనేంటి?.. .. కొంతమంది టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి బదిలీల వ్యవహారం నడిపిస్తున్నారు. లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు. లంచాలు పూర్తిగా అందలేదని బదిలీల సమయాన్ని కూడా పెంచటం అన్యాయం. రాజకీయ బదిలీలు కరెక్టు కాదు. లంచాలు లేకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలి. అలా జరిగినప్పుడే ఉద్యోగులు సరిగా పని చేయగలుగుతారు. రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టులకు వేలం వేయటం దుర్మార్గమైన చర్య. అనంతపురంలో సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేత అశ్వథ్‌రెడ్డి దూషణలకు దిగారు. ఉద్యోగులను తిడితే ప్రభుత్వాన్ని తిట్టినట్టే. టీడీపీ నేత అశ్వథ్‌రెడ్డి(Ashwath Reddy)పై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రశేఖర్ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: బాబు మారకపోతే.. భవిష్యత్తు ఘోరంగా ఉంటుంది -
‘లోకేశ్.. పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా.. విద్యార్థికి ఏదైనా జరిగితే?’
విశాఖపట్నం: కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్లా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను, ఏడాది పాలన తరువాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏ చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబుపత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్ళిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్దులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే....కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా ప్రదర్శించింది. కొత్త టెక్నిక్‌లతో లేనివి ఉన్నట్లుగా చూపించారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెట్టేందుకు మూడు రోజుల పాటు చాలా తాపత్రేయ పడ్డారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినం సందర్భంగా కార్యక్రమాలు చేసుకోవడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ తాను చేసిన పనులను చెప్పుకుంటుంది. కానీ టీడీపీ మాత్రం అధికారంలో ఉండి, ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్సీపీని ఆడిపోసుకుని ఆత్మస్తుతి-పరనిందకే పరిమితమయ్యారు. స్థాయిలేని వ్యక్తులతో సభ్యత లేకుండా మాట్లాడిన భాషను మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు.మహానాడు సాక్షిగా పథకాలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేం ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలం. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ ప్రాంతంలో కొత్త జిల్లాను అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మరి ఎన్టీఆర్ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా కూటమి ప్రభుత్వం మారుస్తుందా? ఈ రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత సంకుచితంగా సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నారు?పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంపై సమీక్ష ఏదీ?పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశామా? 16వేల మంది తమ పేపర్లను కరెక్షన్ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలింది. గతంలో ఏ నాడైనా అయిదు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులకి కరెక్షన్లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా? మొదట ఇరవై మార్కులు వచ్చి, తరువాత రీవాల్యుయేషన్ తరువాత తొంబై మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు. దీనిని బట్టి చాలా దారుణంగా పదోతరగతి విద్యార్ధుల జవాబుపత్రాలను దిద్దారనేది అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా? గతంలో రోజుకు నలబై జవాబుపత్రాలను ఒకొక్కరికి ఇచ్చేవారు. కానీ తాజాగా వాల్యుయేషన్ చేసిన వారికి రోజుకు ఎన్ని జవాబుపత్రాలను దిద్దాలని ఇచ్చారో బయటపెట్టాలి. విద్యాశాఖ అసమర్థత కారణంగా విద్యార్ధులు ఎంత క్షోభకు గురయ్యారో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలి. ఈనాడు వంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఈ వ్యవహారాన్ని వక్రీకరించేలా ఎందుకు కథనాలు రాయిస్తున్నారో చెప్పాలి.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ఉర్సాకు ఎంతకు భూములు ఇచ్చారో బయటపెట్టాలి. కారుచౌకగా కట్టబెడుతున్నారన్న మా ఆరోపణలను వాస్తవం కాదని దమ్ముంటే నిరూపించాలి.ఈ రోజు ఈనాడు పత్రికలో ఇరవై శాతం ఇలాగే రీవాల్యుయేషన్లో మార్కుల్లో తేడాలు రావడం సహజమన్నట్లుగా వచ్చిన కథనం పూర్తి అవాస్తవం. ఏ ఏడాది అయినా అయిదు వేల మంది కంటే ఎక్కువ విద్యార్ధులకు రీవాల్యుయేషన్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు రాలేదు. ప్రతిఏటా కనీసం పద్నాలుగు రోజులు జవాబు పత్రాలను దిద్దేవారు. కానీ తాజాగా మాత్రం తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జవాబు పత్రాలను దిద్దేవారిపై పనిఒత్తిడిని పెంచారు. వాల్యుయేషన్ సెంటర్లు, టీచర్లను పెంచకుండా ఎక్కువ జవాబుపత్రాలను దిద్దాలని ఇవ్వడం వల్లే ఇటువంటి ఫలితాలు వెలువడ్డాయి.మహానాడులో రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వంలోని వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు ప్రకటించలేదు? అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తేదీలతో సహా ఎందుకు సంబంధిత మంత్రులు ఎందుకు వెల్లడించలేదు?ఏడాది కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మోసాన్ని ఎత్తి చూపుతూ జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలను కలుపుకుని ఆరోజు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నాం’ బొత్స తెలిపారు. -
బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు. వైఎస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు(Chandrababu) దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం.రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. పబ్లిక్‌గానే బట్టల్లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు.. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారాయన. గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారాయన. ఇదీ చదవండి: కూటమివారి నవమోసాలు -
బాబు కవరింగ్ భలే!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరంతా అదోటైపు!. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో.. దూషణలకు దిగుతారో ఆయనకే తెలియనట్లు ఉంటుంది వ్యవహారం. కావాలంటే తాజా మహానాడును ఉదాహరణగా తీసుకోండి. ‘ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తా’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏంటో.. దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి!. రాసిచ్చిన స్క్రిప్ట్లేమైనా చదువుతారేమో తెలియదు కానీ.. బాబు గారి ప్రసంగాలు వినేవారికి బీపీ పెరిగిపోవడమైతే గ్యారెంటీ!.2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదలుకుని ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న రోజులవి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదన్న గట్టి నమ్మకంతో చెలరేగి పోయారు బాబుగారు!. దేశ ప్రధానిని పట్టుకుని ఉగ్రవాది అన్నారు. ముస్లింలను బతకనివ్వడన్నారు.. అవినీతిపరుడన్నాడు.. ఇంకా ఏమేమో అనేశాడు! భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఏమి ఏలుతాడని ప్రశ్నించారు. ప్రధానిని ఉగ్రవాది అనడమేమిటా? అని అప్పట్లో అందరం బాధపడ్డాం. ఆ మాటకొస్తే మోదీ కూడా బాబు మాటలకు ధీటైన సమాధానమే ఇచ్చారు. అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ ఇక అస్సలు కలవలేవని అందరూ అనుకున్నారు. కానీ, ఐదేళ్లు గడిచేసరికి ఆ దూషణలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలూ మళ్లీ కలిసిపోయాయి. రాజకీయమంటే ఇంత నిస్సిగ్గుగా చేస్తారా? అని అందరూ అనుకునేలా చేశాయి. అప్పటిదాకా తిట్టిన బాబు నోరే పొత్తు కుదిరాక ఇంద్రుడు, చంద్రుడని ప్రశంసల రాగం ఎత్తుకుంది. మోదీ కూడా తన వంతుగా చంద్రబాబును భుజానికైతే ఎత్తుకున్నాడు!.ఈ సంగతి అలా ఉంచితే, చంద్రబాబు ఇప్పుడు ఉగ్రభాష వాడుతున్నారు. కాకపోతే ఈ సారి ఆయన గళమెత్తింది.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పైనే. పోటీదారు కనుక ఏవైనా విమర్శలు చేయవచ్చు. అందులోనూ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయం ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు లేదంటే.. ప్రజల అసంతృప్తి పెరిగి పరిస్థితులు జగన్‌కు అనుకూలంగా మారుతున్నాయన్న కోపమూ కారణం కావచ్చు. అయితే మాట్లాడే మాటలకు కొంత విచక్షణ ఉండాలి. జగన్ ఆర్థిక ఉగ్రవాది అనేందుకు ఆయనకున్న ఆధారమేమిటి?.2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పుల గురించి చంద్రబాబు ఎన్ని మాటలు మార్చారు?. ఒకసారేమో రూ.14 లక్షల కోట్లని.. ఇంకోసారి రూ.పది లక్షలు అని ఊరూరా అబద్ధాలు ప్రచారం చేసింది ఈయనే. కానీ, తాజా బడ్జెట్లో ఈ లెక్క కేవలం రూ.ఆరు లక్షల కోట్లేనని స్పష్టమైంది కదా?. ఈ మొత్తంలోనూ తాను గతంలో చేసిన అప్పులూ ఉన్నాయన్న విషయం కూడా చెప్పకపోవడం మోసం చేసినట్టే కదా?. జగన్ ముఖ్యమంత్రిగా సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. చంద్రబాబు ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేశారు కదా?. దీన్ని కదా అనాల్సింది ఆర్థిక ఉగ్రవాదం అని?. జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ఉగ్రవాదం అవుతుందా?. ఒకటి అర మాత్రమే అమలు చేసి అడిగిన వారిపై నోరేసుకోవడం ఉగ్రవాదం అవుతుందా?.చంద్రబాబు తన ప్రసంగంలో ఇంకో మాటా అన్నారు.. ఒకసారి గెలవడం.. ఒకసారి ఓడటం ఉండకూడదట. అలా అయితే అభివృద్ది జరగదట.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కూడా వక్కాణించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి.. ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయాలి.. ప్రజలను రెచ్చగొట్టాలి. హింసను సైతం ప్రేరేపించాలి.. అభాండాలు వేయాలి.. కార్యకర్తలను కేసులు పెట్టించుకోవాలని కూడా అంటారు. అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం వద్దు.. నియంతృత్వం కావాలి. తనను వ్యతిరేకించే పార్టీలను, మీడియాను అణచివేయాలి. ఏం చేసినా, చేయకపోయినా అంతా అభివృద్ది చేసేసినట్లు బాజా వాయించుకోవాలి. గతంలో ‘జయము, జయము చంద్రన్న’ అంటూ, లేక ఇప్పుడు ‘చంద్రబాబూ నువ్వే కావాలి’ అంటూ సినీ ఫక్కీలో పాటలు పాడించుకోవాలి. ఒక పార్టీనే అధికారంలో ఉండాలంటే ఆ స్థాయిలో పని కూడా చేయాలి కదా?.వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేస్తున్నారని గమనించి, అంతకు మూడురెట్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన సంక్షేమం ఇస్తానని, అసత్య వాగ్ధానాలు చేసి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా ఇచ్చేసినట్లు దబాయించినా జనం ఓట్లు వేయాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ను తోసేసి గద్దెనెక్కిన తరువాత ఎన్ని సార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు పాలనే సక్రమంగా ఉండి ఉంటే ఇన్ని రకాల పొత్తులు అవసరమై ఉండేవా? అన్నది ఆయన ఆలోచించుకోవాలి.అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. కానీ, తాను లేకపోతే అభివృద్ది ఉండదని ప్రజలకు చెప్పడం అంటే అతిశయోక్తులు చెప్పడమే. హైదరాబాద్ తానే అభివృద్ది చేశానని ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయిన 21 ఏళ్ల తర్వాత కూడా చెబుతున్నారంటే ఏమనాలి!. హైటెక్ సిటీ భవనం ఒక్క దానిని కట్టి ఆ ప్రాంతం అంతా తానే కట్టేశానని చెప్పగలిగిన సమర్థత ఆయనది. నిజానికి హైదరాబాద్ పడమటి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వమే. అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో మెహిదీపట్నం మీదుగా బీహెచ్ఈఎల్ వరకు హైదరాబాద్ రింగ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు పక్కన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. అయినా అంతా తన ఘనతని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైనవి వచ్చాయి. కేసీఆర్ పాలన సమయంలో పలు వంతెనలు, కొత్త ఐటి కంపెనీలు వచ్చాయి.ఏపీలో టీడీపీ పాలనకు, వైఎస్సార్సీపీ పాలనకు ఉన్న తేడాను కేస్ స్టడీ చేయాలని చంద్రబాబు అనడం బాగానే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోతో పోల్చుతారా? లేక చంద్రబాబు, జగన్ టైమ్లలో తెచ్చిన అప్పులతో పోల్చుతారా?. జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పోల్చుతారా?. జగన్ తెచ్చిన ఓడరేవులు, గ్రామ, గ్రామానా జగన్ నిర్మించిన భవనాలు, చంద్రబాబు టైమ్‌తో పోల్చుతారా?. విద్య, వైద్య రంగాలు ఎవరి కాలంలో ఎలా ఉన్నాయో పోల్చుతారా?. ప్రజల ఇళ్ల వద్దకు సేవలు అందించడంలో కూడా పోల్చవచ్చు!. సెకీతో చౌకగా రూ.2.49లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న జగన్ పాలనను, అధిక ధరకు రూ.4.60లకు కొనుగోలు చేసిన చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చుతారా?. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యయాన్ని కూడా కేస్ స్టడీగా తీసుకుంటే బాగానే ఉంటుంది.నీటిపారుదల రంగంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ హయంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా కేస్ స్టడీ చేయవచ్చు. ఇక్కడ ఒక్క సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి సుమారు 15 ఏళ్లు పాలన పూర్తి చేశారు. కానీ, వైఎస్సార్ ఐదేళ్లు, జగన్ మరో ఐదేళ్లు పాలన చేశారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేస్ స్టడీ చేస్తే నిజంగానే మంచి పరిశోధనే అవుతుంది. చంద్రబాబు వాదనలలోని డొల్లతనం, ఎన్ని రకాలుగా ఆయన మాటలు మార్చింది. ఆయన టైమ్‌లో జరిగిన అవినీతి, స్కామ్‌లు అన్ని విషయాలు బయటకు వస్తే ఆయనకే అప్రతిష్ట అవుతుంది.జనం ఎవరూ అడగరు కనుక మహానాడులో ఏవో ఉపన్యాసాలు చెప్పి, అవే నిజాలని ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాధ్యం కాకపోవచ్చు. చివరిగా ఒక మాట. ఈ మహానాడు జరిగిన తీరు ఎలా ఉన్నా ఎల్లో మీడియా మహానాడులో నాలుగు లక్షల మందికి మహా భోజనం అని ప్రచారం చేసింది. అది కూడా సరిగా జరగలేదని, చాలామంది భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారన్న మాట. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉక్కు ఉద్యమంపై కూటమి ఉక్కు పాదం
సాక్షి, విశాఖపట్నం: ఉక్కు ఉద్యమంపై(Vizag Steel Plant Movement) కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగా.. సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా.. యూనియన్ నేతలపై కేసులు బనాయించడంతో కార్మికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్(VSP) అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి ప్రయత్నించారంటూ 8 మంది కార్మిక నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో.. వైఎస్సార్సీపీ హయాంలోనూ యూనియన్లు ఉద్యమాలు, రాస్తారోకోలు చేశాయి. కానీ, ఆ టైంలో ఏ ఒక్కరి మీదా కేసులు పెట్టలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam)లో ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టడం గురించి కార్మికులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి: ఈ రిమార్క్ ఎవరిది లోకేశా? -
‘టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో చంద్రబాబు సర్కార్ విఫలం’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియను సైతం సమర్థంగా నిర్వర్తించలేని దుస్థితిలో విద్యాశాఖ ఉందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ కాలేజీల్లో అడ్మీషన్లు పెంచేందుకు మొక్కుబడిగా మూల్యాంకనం నిర్వహించి, ప్రతిభగల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసమర్థతతో తన శాఖను నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది. హాఫ్ ఇయర్లీ పరీక్షల నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీకేజీ జరగకుండా పటిష్టంగా పరీక్షల ప్రక్రియ నిర్వహించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇటీవల నిర్వహించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లోనూ పేపర్ లీక్‌లతో ప్రభుత్వం అభాసుపాలైంది. ఇదిలా ఉంటే చివరికి పేపర్ మూల్యాంకనంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మార్చి 2025లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 1,15,874 మంది ఫెయిలయ్యారు.వారిలో రిలో 66,363 మంది విద్యార్థులు రీకౌంటింగ్, రీ వేల్యూషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. ఫెయిలైన వారిలో దాదాపు 60 శాతం మంది మా జవాబు పత్రాలను తప్పుల తడకగా మూల్యాంకనం చేశారని దరఖాస్తు చేసుకోవడం ఎస్సెస్సీ బోర్డు చరిత్రలో ఇదే ప్రథమం. రీవేల్యూషన్, రీకౌంటింగ్ తర్వాత దాదాపు 11 వేల మంది ఉత్తీర్ణులైనట్టు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే మూల్యాంకన విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మోక్షిత అనే విద్యార్థినికి సాంఘిక శాస్త్రంలో 21 మార్కులేశారు. రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులొచ్చాయి. బాపట్లలో మరో విద్యార్థికి సాంఘిక శాస్త్రంలోనే 26 మార్కులొస్తే రీవెరిఫికేషన్ తర్వాత 96 మార్కులొచ్చాయి. ఏలూరులో ఒక విద్యార్ధి రాసిన జవాబు పత్రాలన్నీ మూల్యాంకనం చేయకుండా 14 మార్కులే వేశారు. రీ వేల్యూషన్‌లో ఆ విద్యార్ధినికి 86 మార్కులొచ్చినట్టు అధికారులు ప్రకటించారు.లోకేష్ అసమర్థతకు టీచర్లు బలిరాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే పేపర్ మూల్యాంకనం పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. తీరా ఫలితాలు చూశాక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. తప్పుడు తడకలుగా మూల్యాంకనం చేసి 1,15,874 మంది విద్యార్థులు ఫెయిలైనట్లు ఫలితాలు ప్రకటించారు. రీవేల్యూషన్ లో 66వేల మందికిపైగా విద్యార్థులు పాసవ్వడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. మూల్యాంకనంలో టీచర్లకు టార్గెట్లు పెట్టి వేధించి విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చింది.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీచర్లను దోషులుగా చూపించి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకోవడం దుర్మార్గం. నారాయణ కాలేజీలో అడ్మిషన్లు పెంచుకునే వ్యూహంలో భాగంగానే హడావుడిగా మూల్యాంకనం చేయించినట్టుగా తెలుస్తోంది. చివరికి మూల్యాంకనంలో లోపాలు తలెత్తడంతో టీచర్లను బలిచేశారు. విద్యావ్యవస్థపై కనీస అవగాహన లేకుండా, పర్యవేక్షణ చేయకుండా విద్యార్థుల జీవితాలతో లోకేష్ ఆడుకుంటున్నాడు. మూల్యాంకనంలో జరిగిన తప్పులకు, లోపాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. -
ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్‌ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది...అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్‌కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇంత జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?: YSRCP
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది... పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైఎస్సార్సీపీ(YSRCP) ప్రశ్నించింది. .. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్ రీవాల్యూషన్(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.Unprecedented chaos in 10th class exam evaluation! Thousands of students’ futures at stake as 60% have applied for revaluation — a first in AP history. Shocking errors by the board failed even those who passed. Due to Nara Lokesh’s pressure, marks were tampered with. 66,363… pic.twitter.com/q34Gm46Yj1— YSR Congress Party (@YSRCParty) May 30, 2025 -
‘మహానాడులో ఏఐ ఎన్టీఆర్‌తో పొగిడించుకుంటారా.. నిజంగా ఆయన బతికే ఉంటే..’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సంక్షేమ పథకాల అమలను అమలు చేయమంటే.. సినిమా డేట్స్ మార్చినట్లు మారుస్తున్నారంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఒక్కమాట మీద చంద్రబాబు ఏనాడూ నిలపడలేదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని ఎవరు నడపబోతున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేశారని.. కేవలం మాటలు చెప్పి సీమ ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సీమ గడ్డకు మీరు చేసిన అన్యాయాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని కానీ, హైకోర్టు కానీ ఉండాలి. కానీ ఏదీ చేయకుండా మా ప్రాంత ప్రజలను మోసం చేశారు. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియో ద్వారా పొగిడించుకున్నారు. నిజంగా ఎన్టీఆర్ బతికి ఉంటే మీ గురించి ఏం మాట్లాడే వారో మీకు తెలియదా..?. సీమకు వచ్చిన అనేక ప్రాజెక్టులను కూడా చంద్రబాబు తరలించారు. మహానాడు సాక్షిగా రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి మీరు చెప్పిన హామీలు మర్చిపోయారా..?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘మీరు రాయలసీమ అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలి. హంద్రీనీవాను కూడా సకాలంలో పూర్తి చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం తలపెట్టారు. రాయలసీమ మీద చిత్తశుద్ధి ఉంటే కనీసం మా హైకోర్టును మాకివ్వాలి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తిరిగి మాకే ఇవ్వాలి. అన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ అవసరాలు తీర్చాలి. 50 లక్షల చదరపు అడుగులతో రాజధాని అంటున్నారు. అమరావతి కోసం చేసే అప్పులు అందరూ తీర్చాలా?. మా సంపద తీసుకువచ్చి అమరావతిలో ఖర్చు చేయటం భావ్యమా..?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నలు గుప్పించారు. -
ఆలయ భూముల హస్తగతానికి కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దేవాదాయశాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయ స్థానాలు నిర్ధేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన వారికి కారు చౌకగా దేవుడి భూములు కట్టబెట్టేందుకు సిద్దమైంది. దాతలు స్వామివారి నైవేద్యం కోసం ఆలయాలకు విరాళంగా ఇచ్చిన భూములను క్యాబినెట్ ఆమోదం లేకుండా, వేలం నిర్వహించకుండా కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సేవా సంస్థల ముసుగులో నచ్చిన వారికి, తోచిన ధరకు ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు అప్పగించేందుకు ఈ నెల 2న ప్రభుత్వం జీవో నంబర్ 139 విడుదల చేసింది.అంతేకాకుండా ప్రస్తుత లీజు దారులకు మరో 33 ఏళ్లు లీజు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం న్యాయస్థానాల ఆదేశాలను లెక్కచేయకపోవడమే. దేవాదాయ శాఖ భూములను లీజుకు ఇవ్వాలంటే టెండర్ విధానం ద్వారా బహిరంగ వేలం నిర్వహించి ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వారికివ్వాలి. వ్యవసాయేతర భూములను 33 ఏళ్లకు మించి లీజుకు ఇవ్వకూడదని కోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేవాదాయ శాఖ భూములను తన వారికి అప్పనంగా కట్టబెట్టేందుకు న్యాయస్థానాల ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు.ధార్మిక సంఘాలను సంప్రదించలేదురాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన 4,244 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. రూ. 5 లక్షల విలువ దాటిన పనులను నామినేషన్ పద్దతిన ఇవ్వకుండా గత వైయస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోంది. దేవుడి భూములు లీజుకు ఇవ్వాలంటే వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వేలం లేకుండా రూ. వేల కోట్ల విలువైన భూములను అప్పగించడానికి చట్ట సవరణ చేయడం దుర్మార్గం.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఆలయాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. హిందూ సమాజం, ధార్మిక సంఘాలను కనీసం సంప్రదించాలన్న స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా చట్టసవరణ చేసేందుకు జీవో ఇస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ కుట్రను వైయస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మఠాలు, సత్రాల పేరిట ఉన్న విలువైన భూములను సేవా సంస్థల ముసుగులో ఎలాంటి వేలం లేకుండా ఇచ్చేందుకు జారీ చేసిన జీవో 139ని తక్షణం రద్దు చేయాలి. హిందూ సమాజానికి బ్రాండ్ అంబాసిడర్లంటే దేవాలయాల ఆస్తులను దోచుకోవడమేనా? ఒకవైపు ఆలయాల్లో వరుస అపచారాలు జరుగుతుంటే పట్టించుకోకపోగా మరో వైపు ఆలయాల ఆస్తులనే కాజేసే కుట్రలు చేస్తున్నారు. -
వెన్నుపోటు దినంగా జూన్ 4.. పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జూన్ 4న పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌ది. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవిచూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైఎస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు.రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం ర్యాలీలుచంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు మామాకు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్సీపీ వెన్నుపోటుదినంను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న అధికారులకు మెమోరాండంలు సమర్పిస్తాయి. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, సాకె శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, కుంభా రవి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నాయకులు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, కొమ్మూరి కనకారావు, చల్లా మధుసూధన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. -
నాతో గడుపు.. సర్టిఫికెట్ ఇప్పిస్తా!
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: అధికార మదంతో ఊగిపోతున్న కూటమి నేతలు(Kutami Leaders).. ఇప్పుడు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. తన భర్త డెత్ సర్టిఫికెట్ కోసం అర్జి పెట్టుకున్న ఓ మహిళను బీజేపీ నేత ఒకరు లైంగికంగా వేధిస్తున్న ఉదంతం విసన్నపేటలో వెలుగు చూసింది. విసన్నపేట(Vissannapeta) పట్టణంలో టీ దుకాణంలో పని చేసే ఆదిలక్ష్మీ.. బీజేపీ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అబ్బినేని బాబుపై సంచలన ఆరోపణలకు దిగింది. ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ వీడియో ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు .బాధితురాలి భర్త కొద్ది రోజుల మరణించాడు. అయితే డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అబ్బినేని బాబు ఆమె వద్దకు వచ్చి ఆరా తీశాడు. తనతో కొంత టైం గడిపితే డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆమె గట్టిగా తిట్టి పంపించేసింది. ఆటైంలో అబ్బినేని బాబు తాను చెప్పినట్లు వినకపోతే డెత్ సర్టిఫికెట్ ఎలా వస్తుందో చూస్తానంటూ బెదిరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసి అబ్బినేని తప్పతాగి వచ్చి ఆమెపై బెదిరింపులకు దిగారు. ‘‘నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటోడిని అని, ఎవరికీ భయపడను’’ అని మళ్లీ బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె తనకు న్యాయం జరగాలంటూ వీడియో ద్వారా అభ్యర్థించారు.ఇదీ చదవండి; చంద్రబాబు కోవర్టు రాజకీయం -
మహానాడులో తెలంగాణ ముచ్చట ఎందుకు?: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనడం హాస్యాస్పదం అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం. టీడీపీ మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు?. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26వేలలోపే ఉంది. 2014 నుంచి ఆంధ్రలో చంద్రబాబు ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయం ఉంటే.. కేసీఆర్ పాలనలో 3.70 లక్షలకు వచ్చింది. చంద్రబాబు.. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే.. ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదు?. ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదా?. ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. ఎప్పటికైనా హైదరాబాద్‌కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా?. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో చంద్రబాబు పాలన అగమ్యగోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమని అన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారు. చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌నే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని చంద్రబాబు.. బనకచర్ల డ్యాం అంటూ ఊదరగొడుతున్నారు. కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు కాదు.. టీడీపీ నేతలు అవినీతి నిధులు పారిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి. ప్రజలను వంచించే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరు. నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
మహానాడులో ఘోరం.. ఎన్టీఆర్‌కు తీవ్ర అవమానం
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడులో ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘోర అవమానం జరిగింది. కార్యకర్తలను ఆకర్షించేందుకు మొక్కుబడిగా ఎన్టీఆర్ జపం చేసే చంద్రబాబు నాయుడు.. మహానాడులో ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు!. ఆయన మనవడు చనిపోతే.. కనీసం వేదికపై సంతాపం కూడా వ్యక్తం చేయలేదు!!. కడప వేదికగా జరిగిన మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చంద్రబాబు చేయలేదు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఎన్టీఆర్ ఏఐ వీడియోను తయారు చేశారు. ఇందులో ఎన్టీఆర్ మనసుకు, ఆయన ఉన్నప్పటి స్టేట్మెంట్లకు విరుద్ధంగా చంద్రబాబు పొడిగించుకున్నారు. భళా మనవడా.. అంటూ ఎన్టీఆర్ వారసుడు లోకేష్ అంటూ ఏఐ వీడియోలో చెప్పించుకుని ఆనంద పడ్డారు. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమై.. ట్రోలింగ్‌కూ దారి తీసింది. రాజకీయావసరం పడినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటారనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసు. పలు సందర్భాల్లో కంటి తుడుపు చర్యగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పైకి మాట్లాడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో టీడీపీ భాగమైనప్పటికీ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక, ఈ మహానాడుకు నందమూరి కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మహానాడుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా హాజరుకాలేదు(సినిమాలే ముఖ్యం అనుకున్నారేమో). అలాగే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా నందమూరి తారకరత్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. తారకరత్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. -
ఒకే కొడుకు కాబట్టి చంద్రబాబు బతికిపోయాడు: సీపీఐ నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) స్పందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపైనా ఆసక్తికర కామెంట్ చేశారాయన. ‘‘కవిత అసలు ఎందుకు బయటకు వస్తోంది?. బీఆర్ఎస్లో డెమోక్రసీ లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ప్రమాదమే. చంద్రబాబుకు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయాడు. ప్రాంతీయ పార్టీల్లో ప్రాపర్టీ, పలుకుబడి అంతా కుటుంబం కోసమే. పదవులు, ప్రాపర్టీల గొడవగా కవిత ఎపిసోడ్(Kavitha Episode) చూస్తున్నాం’’ అని అన్నారాయన. ప్రాంతీయ పార్టీల్లో డెమోక్రసీ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో అతి డెమోక్రసీ ఉంది. ఆ పార్టీ పదే ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిపించుకుంటుంది. ఇది పరిపాలనపై ప్రభావం చూపెడుతుంది. ఎన్నికైన సీఎంకు స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేగానీ పదే పదే పగ్గాలు పెట్టి లాగొద్దు’’ అని సూచించారు.ఆపరేషన్ కగార్పైనా స్పందిస్తూ.. చంపినంత మాత్రాన నక్సలిజం పోదు. ఇంకా పెరుగుద్ది. మనుషులను చంపగలరు గాని సిద్ధాంతాన్ని చంపగలరా?. ఇది అడవులను ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం’’ అని నారాయణ ఆరోపించారు. ఇదీ చదవండి: తప్పుడు కేసా? కాదా? అనేది మేం తేలుస్తాం -
కోవర్టులంటూ కొత్త కుట్ర రాజకీయం!
ప్రతిపక్ష పార్టీలపై కొత్త కొత్త ఆరోపణలు చేయడం.. ప్రతి చెడు ఘటనను కూడా వారికి ఆపాదించేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది కాబట్టి ఆయనకు ఈ పని మరింత సులువు అవుతుంది. తాజాగా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని కోవర్టులంటూ వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఇటీవలి మహానాడు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు తన పార్టీ అంతర్గత వ్యవహారాలనూ వైసీపీకి పులిమే ప్రయత్నం చేయడం ఆయన వక్రబుద్ధిని చెబుతోంది. ఈ మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కాస్తా హత్యలకూ దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, హత్యలకు పాల్పడ్డా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందంటూ ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను తమవారే హత్య చేస్తున్నారన్నది వారు కూడా ఊహించి ఉండరు.కొంతకాలం క్రితం ఒంగోలు ప్రాంతం మద్యం సిండికేట్, ఇతర దందాల్లో తలెత్తిన గొడవల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో స్థానిక టీడీపీ నేత చౌదరి హత్యకు గురయ్యారు. వెనుక ఉన్నది టీడీపీ వారేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ.. చంద్రబాబు స్వయంగా ఆయన అంతిమక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్బంలోనూ వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అప్పటికే టీడీపీ నేతల పాత్రను తేల్చేశారు. అయితే చంద్రబాబు అప్పుడైనా ఇలాంటి పనులకు పాల్పడరాదన్న హితవు పలకడానికి బదులు వారికి దన్నుగా నిలిచినట్లు వ్యవహరించారు. మాచర్ల వద్ద జరిగిన ఇంకో ఘటనలోనూ ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సరే పనికట్టుకుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై అసహ్యం కలిగే పరిస్థితి కల్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేబీఆర్ పేరు కూడా ఉన్నా పోలీసులు ఇంత అధ్వాన్నంగా వైసీపీ వారిపై కేసులు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ టీడీపీ వర్గాలలోని వారు గతంలో కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టీడీపీలో చేరారట.ఇంకో సంఘటనలో కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కోవర్టులంటూ ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ.. ఇది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలందరికి ముల్లులా గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నూజివీడు నుంచి గెలిచి మంత్రి అయిన కొలుసు పార్ధసారధి, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రభృతులు వైసీపీ నుంచి వెళ్లినవారే. వీరిలో కొంతమందికి చంద్రబాబు,లోకేశ్‌లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సహజంగానే కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది.అంతేకాదు..ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు రకరకాలుగా ప్రలోభ పెట్టో, లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో, ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా?అంటే అదేమీ లేదు. 2014-19 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ఇప్పుడు కూడా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తనపార్టీలో చేరిన వారంతా మంచి వారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. గతంలో తాను ఎవరినైతే తిట్టి ఉంటారో, వారు పార్టీలోకి రాగానే పవిత్రులైనట్లుగా ప్రసంగాలు కూడా చేస్తుంటారు.కోటంరెడ్డి ,గుమ్మనూరు, కొలుసు వంటి వారిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో తెలుసు. కాని వారిని టీడీపీలోకి తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అలా వచ్చిన వారిని కోవర్టులు అని అంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అరాచక శక్తులు ఏ స్థాయిలో ఉంది కూడా తెలియ చేసినట్లయింది. పైగా చంద్రబాబు తాను ఎవరిని నమ్మనని చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనను అంతగా నమ్మరు. కాని పరస్పర అవసరాల కోసం కలిసి ప్రయాణం చేస్తుంటారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ ఎప్పటి నుంచో ఉంది.గత చరిత్ర చూస్తే కోవర్టుల రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్దహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్ధులు తరచు వ్యాఖ్యానిస్తుండే వారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపే వారు.అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం ఉండేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే తనకు రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారని అంటారు.ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారని అంటారు. పార్టీ టిక్కెట్ల సమయంలో తన వర్గం వారిని వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి వద్దకు పంపించి ఆమెతో కూడా సిఫారసులు చేయిస్తుండేవారట. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కైవశం చేసుకున్న తర్వాత విపక్ష కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునే వారు. వైఎస్ జగన్ పై కాంగ్రెస్‌తో కలిసి సీబీఐ కేసు వచ్చేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అందరికి తెలిసిందే. మరి ఇవన్ని కోవర్టు రాజకీయాలో, కాదో చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి, రహస్య సమాచారం సేకరించే వారని, స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాలలో వాపోయారు. 2019లో ఓటమి తర్వాత తెలివిగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగానే ఆ నలుగురు పేరుకు బీజేపీ. సేవ చేసేదంతా చంద్రబాబు కోసమేనన్నది బహిరంగ రహస్యమే. తదుపరి పవన్ కళ్యాణ్ తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తిరిగి పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే కదా! ఇలా కోవర్టు రాజకీయం చేయడంలో చంద్రబాబు ఘనాపాటి. మరో సంగతి చెప్పాలి. ఎన్టీ రామారావు ఆత్మో, లేక మరొక పేరో తెలియదు కాని ఏఐ ఉపయోగించి చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్.ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారు. చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని, ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. తనను ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసినా, చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? అన్న విమర్శను వైసీపీ చేస్తోంది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పని చేశారని చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఎఎస్‌లు చెబుతున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందని చెబుతుంటే దానికి భజంత్రి చేసిందే! ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు, లోకేశ్ లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘అప్పుడు చెంబెడు నీళ్లు.. మట్టి తెచ్చారు..ఈసారి అదీ లేదు’
నంద్యాల జిల్లా: టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించిన భజనకీర్తనలే చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదంటూ సీపీఎం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు విమర్శించారు. ఈరోజు(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ టీడీపీ మహానాడు మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని భజన కీర్తనలకే పరిమితమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడులకు లొంగిపోయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పజెప్పకుండా, ఏ విషయం తేలకుండా మిగిలిపోయిన ఆపరేషన్ సిందూర్ ను మహానాడు వేదికగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను, ఎన్టీఆర్ ను పొగిడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే చర్యలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ సమయంలో గతంలో నరేంద్ర మోదీ చెంబెడు నీళ్లు, మట్టి తెచ్చారు.ఈసారి అది కూడా తేలేదు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు లేవు. రూ. 1500 కోట్ల నిధులు లేవు. అలాగే వాగ్దానాలు నెరవేర్చలేదు.రాజధాని పేరుతో కార్పొరేట్ రాజధాని చేస్తున్నారు తప్ప.. ప్రజల రాజధాని కాదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మోదీని విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు మారిపోయింది. పవన్ ది నాలుక లేక తాటిమట్ట నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.. ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేశారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లొంగుబాటు రాష్ట్రానికి తీరని లోటు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని గాలికి వదిలేసి 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పడం ఏంటి?, టీడీపీ మహానాడు వైఫల్యాల పుట్ట. మహానాడులో ఇరగదీసింది ఏమీలేదు. మహానాడు ప్రజలపై భారం మోపేందుకు , పచ్చి అవకాశవాదంగా మార్చుకునేందుకు పెట్టారే తప్ప మహానాడుతో ఒరిగేదేమీ లేదు. అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదు’ అని హెచ్చరించారు. -
‘టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్’
తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్‌దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారుమహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైఎస్ జగన్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.వైఎస్ జగన్ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబేతాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్‌లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్సార్ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్‌లో వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైఎస్ జగన్ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్‌మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుపులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్‌లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలోవైఎస్సార్‌సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్‌ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు.గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబుహైదరాబాద్ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైఎస్సార్‌జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్సార్ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైఎస్సార్ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైఎస్ జగన్ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు’ అని గడికోట స్పష్టం చేశారు. -
మహానాడు కాదు.. అది ‘వెన్నుపోటు’ నాడు: లక్ష్మీపార్వతి
వికారాబాద్: కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రస్తుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్‌ను తిట్టడానికే సరిపోయింది’’ అంటూ లక్ష్మీపార్వతీ దుయ్యబట్టారు.‘‘టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే.. మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారు. పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్‌కి వారసుడు అవుతారు’’ అంటూ లక్షీపార్వతి ప్రశ్నించారు.‘‘వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్లారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు.. జగన్‌ను ప్రపంచమే మెచ్చుకుంది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన పీడ. మహానాడు కాదు అది.. వెన్నుపోటు నాడు. మహానాడు అట్టర్ ఫ్లాప్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారు. జిందాల్ కంపెనీ రాకుండా చేశారు. అవకాశం కోసం చంద్రబాబు, లోకేష్ పని చేస్తారు. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్‌ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు...అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
పులివెందుల: కొనసాగుతున్న ‘కూటమి’ వేధింపులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ నేతలపై కూటమి సర్కార్ వేధింపులు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ సహా 13 మందిని పోలీసులు ఇంకా కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్సీపీ నేతల్ని స్టేషన్లు మార్చి తిప్పుతున్నారు. పులివెందుల నుంచి వేముల, వేముల నుంచి కడపకు తరలించారు. పులివెందులలో వైఎస్సార్ విగ్రహానికి పచ్చ తోరణాలు కట్టి టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. తిరిగి ఎదురు కేసు పెట్టి వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.నిన్న(బుధవారం) సాయంత్రం అరెస్ట్ చేసి ఇంతవరకు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టలేదు. వేముల పోలీస్ స్టేషన్ నుంచి 8 మందిని విడదీసి అకస్మాత్తుగా కడప తరలించారు. కోర్టుకు పెట్టకుండా మళ్లీ కడపకు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏ తప్పూ చేయని వారిపై చేయిచేసుకున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 13 మంది వైఎస్సార్సీపీ నాయకులను రెండు గ్రూపులుగా చేసిన పోలీసులు.. 8 మందిని కడపకు తరలించారు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తో పాటు మరో నలుగురిని వేముల స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. -
మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఖాకీల ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తుళ్లూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీ ఎంపీపై అమానవీయ చర్యకు పోలీసులు దిగారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ఆయనను పోలీసులు హింసిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో మాజీ ఎంపీని విచారించాలన్ని హైకోర్టు చెప్పింది. అయితే, ఆ మేరకు విచారణ కొనసాగడం లేదు.జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయనను పోలీసులు లాకప్‌లోనే ఉంచుతున్నారు. ఇది హైకోర్టు ధిక్కరణే అని న్యాయవాదులు అంటున్నారు. నందిగం సురేష్‌కు ఖాకీలు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదు. తుళ్లూరు పోలీసుల తీరుపై మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.