breaking news
-
‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు.గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారుసుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు తీస్తా.. నీ అవినీతి బయటకు కక్కిస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు కు భయపడం. మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. లక్ష 86 వేల కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేశారు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. -
ఇమేజీ బాగా డ్యామేజీ అవుతోంది బాబూ!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నా.. పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయానికి ‘‘బాబు ష్యూరిటీ- గుండాయిజం గ్యారంటీ..’’ శీర్షికతో సాక్షి ప్రచురించిన ఒక కథనం అద్దం పడుతోంది.కొద్ది రోజుల క్రితం ఒక స్వతంత్ర సంస్థ జరిపిన సర్వే కూడా ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అత్యధిక శాతం ప్రజలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను కోరుకున్నా అది ఆశించినంతమేర సాగడం లేదని సమాచారం. ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తమవుతూండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు పట్టుపడుతూండటంతో ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ‘‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ అంటూ జనంలోకి వెళుతోంది. అన్ని నియోజక వర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలకు చేసిన మోసాలను అంకెలతో వివరిస్తున్నారు. ఇది కాస్తా ప్రభుత్వానికి చికాకుగా మారింది. దీన్ని అడ్డుకునేందుకా అన్నట్టు టీడీపీ, జనసేనలు రెండూ వైసీపీ సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.గుడివాడలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని టీడీపీ వారు అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి? పోలీసులు నిలువరించలేకపోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడం ఏమిటి? వాహనం అద్దాలు పగులగొట్టి మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడడం ఏమిటి?వైఎస్సార్సీపీ వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి తామే మహిళోద్దారకులం అని చెప్పుకునే కూటమి పెద్దలు ఈ అంశంపై నోరు తెరవకపోవడం ఏమిటి? పైగా వాహనంలో ప్రయాణిస్తున్న హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారట. దాడి ఘటనపై కేసు పెట్టకపోవడంపై గట్టి హెచ్చరిక చేయడంతో టీడీపీ వారిపై కేసులు నమోదు చేసినా కీలకమైన వ్యక్తిపై మాత్రం పెట్టలేదట. అసలు అల్లరికి కారణమైన వ్యక్తిని వదలి వేస్తే ఏమిటి అర్థం? ఇదేనా పోలీసు వ్యవస్థ పనితీరు!నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి చేసిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వేగంగా స్పందించారు. ఎవరి తప్పు ఉన్నా కేసు పెట్టవచ్చు. కాని పోలీస్ యంత్రాంగం ఒక వైపే చూడడం ఏపీ స్పెషాలిటీగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా, పోలీసులు ఏదో రకంగా అడ్డం తగలడం, ఆ పార్టీ వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. జగన్ సత్తెనపల్లి టూర్‌కు సంబంధించి సుమారు 150 మందికి పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు.అనంతపురం వద్ద లింగమయ్య అనే వైఎస్సార్సీపీ నేత హత్యకు గురైతే అక్కడకు జగన్ వెళ్లినప్పుడు కూడా ఇలాగే చేశారు. జగన్ హెలికాఫ్టర్ వద్ద సరైన సెక్యూరిటీ పెట్టకుండా, దాని విండ్ షీల్డ్ దెబ్బతింటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఇతర కార్యకర్తలపై కేసులు పెట్టారు. జగన్ మామిడి రైతుల పరామర్శకు బంగారుపాళ్యం వెళితే అక్కడా అదే తంతు. అసలు జగన్ పర్యటనలో 500 మించి పాల్గొనరాదని ఆంక్ష పెట్టి ఏమి సాధించదలిచారు.అయినా జనం వేలాదిగా తరలివచ్చారు అంటే అది జగన్ మీద అభిమానంతోనే కదా? దానిని తట్టుకోలేక ఇక్కడ కూడా ఏదో కారణం చూపి కొందరిని అరెస్టు చేశారు. పైగా చిన్న కేసులు పెట్టవలసిన చోట ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యపై పొదిలి వెళితే అక్కడకు టీడీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతించారు?వైఎస్సార్సీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడం అధికార పార్టీ కూటమికి కంటగింపుగా మారింది. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారే అల్లర్లు సృష్టిస్తున్నారు. దీంతో ఏపీలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంటోంది. రాజకీయపరమైన వేధింపులే కాదు.. ఇతరత్రా కూడా అనేక సంఘటనలు ఏపీలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటన కలకలం రేపింది.మహిళలపై అత్యాచారాల ఘటనలు రిపోర్టు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి కోట వినూత దంపతులు తమ వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులును హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనమైంది. వినూతకు, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఉన్న విబేధాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక మహిళా నేతను బెదిరించడానికి బొజ్జల అనుసరించారని వస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగిస్తాయి.అవి నిజమైతే అయితే ఈయనపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్‌కు తెలిసినా ఆయన పట్టించుకోలేదని వినూత దంపతులు చెబుతున్నారు. చెన్నై పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు కాబట్టి ఈ మాత్రం అయినా వెలుగులోకి వచ్చింది. లేకుంటే హత్య ఘటనే ఎవరికి తెలియకుండా పోయేదేమోనన్న సందేహాలు వస్తున్నాయి. వినూతను ఎవరు, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు, మొదలైన అంశాలు పూర్తిగా వెలుగులోకి రావల్సి ఉంది. ఈ హత్యపై వస్తున్న వార్తల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వంటివారు నోరువిప్పడం లేదు. ఇంకో వైపు కరేడు వద్ద భూ సేకరణ వివాదం, ఇండోసోల్‌కు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని కరేడు వద్ద వివాదం సృష్టించడం అంటే ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టడమే కదా! రాజధాని అదనపు భూముల పూలింగ్ గొడవ, గతంలో ఒఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, ఆ సందర్భంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని జైలులో పెట్టడం, గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను ఏదో ఒక కేసులో ఇరికిస్తుండడం, పలువురికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, కొంతమంది డీజీ స్థాయి అధికారులు పరిపాలన తీరుతెన్నులపై అసంతృప్తితో ఉండడం, చివరికి తమకు ఉద్యోగం వద్దని చెప్పి రాజీనామా చేసే వరకు వెళ్లడం వంటివి చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వేధిస్తున్నారన్న సమాచారం సహజంగానే దేశమంతటా తెలుస్తుంది. దాని వల్ల ఏపీ ఇమేజీ తీవ్రంగా డామేజి అవుతోంది. అయినా ఫర్వాలేదు.. తమకు రెడ్ బుక్కే ప్రధానమని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు భావిస్తే అది ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ!.. టీడీపీకి బిగ్ షాక్?
సాక్షి, చీరాల: ‘తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలువునా మోసం చేసి చంపేశారు. మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది. చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏదైనా విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ..!’ బాపట్ల జిల్లా, చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య ఆవేదనా పూరిత వ్యాఖ్యలివి.వివరాల్లోకి వెళితే, మే 14న చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం, బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ స్థానానికి పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా, ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్‌గా ఎంపీ ప్రతిపాదించగా, ఆయన ఎన్నికయ్యారు.అప్పటి వరకు తనకే ఆ అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్ హాలు నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి 16 వేల ఓట్లు ఉన్నాయని, 83 శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలోనూ రెండు సార్లు తనకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. అమ్ముకోవడానికి ఇక మిగిలింది కిడ్నీలు, లివర్ మాత్రమేనని వాపోయారు. వైఎస్సార్సీపీని కాదనుకొని వస్తే.. ఇంత అన్యాయమా? వైఎస్సార్సీపీని కాదనుకొని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తూరి వాపోయారు. తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. -
బాబైనా.. ట్రెండ్ సెట్టర్లను అనుసరించాల్సిందే!
ఫాలో ద లీడర్ అంటూ ఉంటారు చూడండి అదిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. పదవిలో ఎంత కాలం ఉన్నామన్నది కాదు.. ఉన్నది కొద్దికాలమైనా ఆ పదవిలోకి వచ్చే ఇతరులకు ఎంత ఆదర్శంగా నిలిచామన్నది ముఖ్యమంటారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్ రాజకీయాలిప్పుడు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేకించి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన హయాంలో తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, మార్పులు, స్కీములు, ప్రాజెక్టులను ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు.విభజిత ఏపీలో 2019-2024 టర్మ్‌లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థలు, తెచ్చిన పథకాలను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాను కూడా జగన్ తెచ్చిన వ్యవస్థలను కొనసాగిస్తానని, స్కీములను అమలు చేస్తామని, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేవారు. ఇది ఒక రకంగా నాయకుడిని అనుసరించడమే!కూటమి సర్కారు కూడా కొన్నింటిని మినహాయించి మిగిలిన వాటి విషయంలో జగన్ విధానాలనే అనుసరిస్తోంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కడప నగరంలో వెలిసిన ఒక ఫ్లెక్సీ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందడం వల్ల! అది అత్యంత ఆసక్తికరంగా ఉంది. జగన్‌కు ప్రజలలో వస్తున్న ఆదరణను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతడిని ఎలా అనుసరిస్తున్నాడో వివరించారీ ఫ్లెక్సీలో! ఫ్లెక్సీలోని కొన్నింటి గురించి చూద్దాం..‘‘సంక్షేమం అంటే అంత ఇష్టం ఉండని ఆయనకు సంక్షేమం అంటే నేర్పించావు" అని ఒక కామెంట్ ఉంది దాంట్లో. నిజంగానే సంక్షేమ రంగంపై చంద్రబాబుది భిన్నాభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. ఎన్నికల సమయంలో మాత్రం జగన్ ఇచ్చేదానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఇస్తానని హామీ ఇచ్చినా, జగన్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి మేనిఫెస్టోల్లో ఊదరగొట్టినా... గెలిచిన తరువాత మాత్రం సంపద సృష్టించే సంక్షేమం అమలు చేయాలని, సంక్షేమంతోనే అన్నీ జరిగిపోవని మాట్లాడిన విషయం ప్రజల దృష్టిలోనే ఉంది.పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం మినహా ఏడాది పాటు మిగిలిన అన్ని పథకాలనూ కూటమి సర్కారు ఎగవేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న ఎన్నికల హామీ గెలుపు తరువాత ఒక్క సిలిండర్‌కే పరిమితమైంది. ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను గుర్తించి ఏడాది తరువాత తల్లికి వందనం స్కీమును కొంత అమలు చేయక తప్పలేదు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ కారణంగా చంద్రబాబు సంక్షేమ రంగం వైపు చూడక తప్పలేదని చెప్పాలి.'ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేచి పొద్దు, పొద్దునే బ్యాగు తగిలించుకుని అవ్వ,తాతలకు ఫించన్ డబ్బులు ఇచ్చేటట్లు చేశావు" అన్నది కడపలో వెలిసిన ఫ్లెక్సీలోని మరో వ్యాఖ్య. ఇది కూడా వాస్తవమే. 14 ఏళ్లు సీఎంగా ఉండగా ఏ రోజూ చంద్రబాబు ప్రతి నెల ఉదయాన్నే వెళ్లి ఫించన్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వృద్ధులే నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. జగన్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకే చేర్చేశారు. అధికారంలోకి వస్తే తానూ వలంటీర్లను కొనసాగిస్తానని ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పిన చంద్రబాబు ఆ తరువాత దానికి మంగళం పాడారు. కాని జగన్ పెట్టిన పద్దతి మాత్రం పాటించక తప్పలేదు. ఆయన స్వయంగా కొందరు వృద్ధుల వద్దకు వెళ్లి ఫించన్ అందచేస్తున్నారు. ఇందుకు అనవసరంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగు చేసిన బడులకు వెళ్లి, ప్రభుత్వ స్కూళ్ల గురించి చంద్రబాబు మాట్లాడేలా చేశారన్నది మరో కామెంట్. నిజమే. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఎంతో ఘనంగా చెప్పిన ఘనత చంద్రబాబుది మరి. అలాంటి వ్యక్తి ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను స్వయంగా గమనించారు. ఆ క్రమంలో అక్కడ ఒక చోట రాసి ఉన్న నాడు-నేడు పదాలను చెరపడానికి స్కూల్ సిబ్బంది నానా పాట్లు పడాల్సి రావడం విశేషం. ఇష్టం ఉన్నా, లేకపోయినా, తండ్రి, కొడుకులు కుటుంబంలోని పిల్లలందరికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వక తప్పలేదని అది కూడా జగన్ ఎఫెక్టే అన్నది ఆ ఫ్లెక్సీలోని మరో అంశం.కూటమి సర్కార్ జగన్ హయాంలో చేపట్టి ఓడరేవులు, వైద్య కళాశాలలు మొదలైన వాటిని ప్రామాణికంగా చూపి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నది కడపలో వెలసిన ఫ్లెక్సీలోని మరో కామెంట్. పెట్టుబడిదారుల సదస్సులలో ఏపీలో కొత్తగా వస్తున్న పోర్టుల గురించి చంద్రబాబు ప్రచారం చేశారు. అవన్ని జగన్ శ్రీకారం చుట్టినవే. గతంలో జగన్ ‘‘గడప గడపకు...’’ పేరుతో పార్టీ నేతలందరిని ప్రజల ఇంటింటికి పంపిస్తే ప్రస్తుతం చంద్రబాబు కూడా అదే తరహాలో కూటమి ఎమ్మెల్యేలు, కేడర్‌ను ‘‘తొలి అడుగు’’ పేరుతో ప్రజల వద్దకు పంపుతున్నారు.'నీ పర్యటనలు ఆపడానికి అష్టకష్టాలు పడి ఏమి చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రులపై తిట్ల దండకం అయ్యేలా చేశావ్’’ అన్నది ఇంకో కామెంట్. జగన్ టూర్లు, ఆయనకు ప్రజలలో వస్తున్న మద్దతు మొదలైనవాటిని గమనించిన చంద్రబాబు గత మంత్రివర్గ సమావేశంలో మంత్రులు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు గట్టిగా జవాబు ఇవ్వలేకపోతున్నారని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. జగన్ పర్యటనల ఫలితంగా కూటమి సర్కార్ ఆయా సమస్యలపై స్పందించక తప్పడం లేదు. మిర్చి ,పొగాకు, మామిడి రైతుల వద్దకు జగన్ వెళ్లి పరామర్శ చేయడంతో ప్రభుత్వం హడావుడి పడి కొంత నిధులు ఇవ్వడం, కేంద్రానికి లేఖలు రాయడం వంటివి చేసింది. 'నీకు 11 సీట్లే వచ్చినా పాలన అంతా నీ కనుసన్నలలోనే జరుగుతా ఉన్నట్లు ఉంది జగనూ" అన్న వ్యాఖ్య ఈ ఫ్లెక్సీలో కొసమెరుపు. ఈ ఫ్లెక్సీపై ఎవరి పేరైనా ఉంటే ఈపాటికి రెడ్ బుక్ ప్రయోగం జరిగేదేమో! గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాని వైఎస్సార్ ముఖ్యమంత్రై రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు తాను ఇంకా ఎక్కువ సమయం ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.గత టరమ్‌లో కాని, ఇప్పుడు కాని అది కొనసాగుతూనే ఉంది. వైఎస్ తీసుకు వచ్చిన ఆరోగ్యశ్రీని తొలుత టీడీపీ వ్యతిరేకించింది. కాని తదుపరి అది కూడా అమలు చేయక తప్పలేదు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీముల విషయం కూడా అంతే. వైఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాని, హైదరాబాద్ చుట్టూరా జరిగిన అభివృద్ది కాని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసే ప్రసంగాలు కూడా వైఎస్ పాలనను గుర్తు చేస్తాయి. అలాగే గత టరమ్‌లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, భూముల రీసర్వే తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది.ఎన్టీఆర్ కాలంలో పరిపాలనను మండల స్థాయికి తీసుకు వెళితే, జగన్ ప్రజల వద్దకు పాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి ఎంతో సదుపాయం కలిగించారు. కాకపోతే జగన్ తెచ్చిన స్కీములను కాదనలేక కొన్నిటిని నీరు కార్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయినా సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడేలా తేగలిగారన్నది చర్చనీయాంశం. ఆయన గతంలో ఇంకుడు గుంతలు, జన్మభూమి వంటివాటిని ప్రవేశపెట్టారు. కాని వాటిని ఆయనే కొనసాగించలేకపోయారు.ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల వ్యయం చేయాలని చంద్రబాబు తలపెట్టారు. దాని ప్రభావం ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌లతో పోల్చితే చంద్రబాబుకు విశేషమైన అవకాశాలు వచ్చినా వాటిని సామాన్య ప్రజల కోసం కాకుండా ధనవంతుల ప్రయోజనాల కోసం చేశారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన జగన్ ప్రభుత్వంలో అమలు అయినవాటిని చంద్రబాబు అనుసరించవలసి రావడం చారిత్రక సత్యం అని ఒప్పుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వ శ్రేణుల బరితెగింపు.. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ శ్రేణులు బరితెగిస్తున్నారు. అధిష్టానం అనుమతిస్తే వైఎస్సార్సీపీ నేతల అంతు చూస్తామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా,నందిగామలో టీడీపీ కార్యకర్త బెదిరింపులకు దిగాడు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల్ని చంపేస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. టీడీపీ అధిష్టానం అనుమతిస్తే 24 గంటల్లోనే వైఎస్సార్సీపీ నేతలను రప్పా రప్పా రంపంతో కోసేస్తాని కంచికచర్ల టీడీపీ కార్యకర్త అజయ్ వీడియోలు పోస్టు చేశాడు. ఆ వీడియోలపై వైఎస్సార్సీపీ నేతలు కంచికచర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. టీడీపీ కార్యకర్త అజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
దెబ్బ తిన్న వాళ్లు రేపు నా మాట కూడా వినరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్‌ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు. -
బాలకృష్ణ, పవన్ సినిమాల్లో దారుణమైన డైలాగులే ఉంటున్నాయ్: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు.. సినిమా డైలాగులు, పాటలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రెస్మీట్లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు. సినిమా డైలాగులు కొట్టినా.. పోస్టర్లు పెట్టినా కేసులు పెడుతున్నారు. సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? అలాంటప్పడు సినిమాలు తీయడం ఎందుకు?. అసలు సినిమా డైలాగులతో చంద్రబాబుకి వచ్చే నష్టం ఏంటి?. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో అంతకంటే దారుణమైన డైలాగులు ఉంటున్నాయి. మరి వాటి సంగతి ఏంటి?. ఇదేనా ప్రజాస్వామ్యం?.. ఏపీలో సినిమా డైలాగులను ప్రదర్శించారని.. ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. మరో 131 మందికి నోటీసులు ఇచ్చారు. రోజంతా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఛార్జ్‌షీట్‌లో అదర్స్ అని పెట్టి.. వాళ్లకు కావాల్సిన వాళ్లను అందులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు.ప్రజాస్వామ్యంలో మంచి చేసి మనసులు గెలుచుకుని తగ్గేదే లే(మేనరిజం ప్రదర్శించారు) అను. అది సత్తా. అంతేతప్ప అన్యాయమైన పాలన చేస్తూ .. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. -
హారికను అనకూడని మాటలు అన్నారు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులపై నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి అవగాహన లేదా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో.. గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక దాడి ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్‌లు పెట్టుకోవడం.. ఇవన్నీ హక్కులే కదా. మరి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలీదా? అని జగన్ ప్రశ్నించారు.గుడివాడలో దాడిని రాష్ట్రం మొత్తం చూసింది. మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి చేశారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం. నా సోదరి హారిక మీద టీడీపీ సైకోలు దాడి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటే.. పోలీసుల సమక్షంలో ఇది జరిగింది. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక బీసీ మహిళకు ఆత్మగౌరవం లేదా?.. ఇంతమంది సైకోలుగా, శాడిస్టులుగా ప్రవర్తిస్తారా?.. పథకం పన్ని నా చెల్లి హారికపై చేసిన దాడి దుర్మార్గం.హరికను అనకూడని మాటలు అన్నారు. మళ్లీ మహానటి అంటూ ఆమెనే ఎద్దేవా చేస్తున్నారు. దానవీరశూరకర్ణ కంటే గొప్పగా నటించేంది చంద్రబాబే. స్పష్టంగా ఆధారాలు ఉంటే ఎంత మంది మీద కేసు పెట్టారు?. తిరిగి హారిక భర్త రాము మీదే తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబు ఈ విషయమై అడుగుతున్నా.. పెడనలో సభ పెట్టిన వైఎస్సార్సీపీ నేతలందరిపై కేసు పెట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకా ఎక్కడైనా ఉన్నామా?. చంద్రబాబు చేసే ప్రతిపనిలో డైవర్షన్ పాలిటిక్సే అని జగన్ అన్నారు. -
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పూర్తి హైలైట్స్
సాక్షి, గుంటూరు: ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొడుతున్న తీరును.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన పరిస్థితులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుల పర్వం, అక్రమ కేసులు.. అరెస్టులపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ఇటీవల చంద్రబాబు కుట్రల నేపథ్యం. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న వైఖరి. పొలిటికల్ గవర్నెన్స్ నడిపిస్తున్న తీరు.. ఇవన్నీ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి, చట్టం కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, పలుకుతోంది వైయస్సార్సీపీ మాత్రమే. ఎవరికి ఏ కష్టం వచ్చినా.. రైతులు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. చివరకు ఉద్యోగులకు కష్టం వచ్చినా కూడా వైయస్సార్సీపీనే ప్రశ్నిస్తోంది. ఇంకా అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన అడ్డగోలు హామీలు. మోసం చేసిన విధానం. వాటిని ఆ మోసాలు ఎండగడుతూ ప్రశ్నిస్తున్న పార్టీ కూడా ఒక్క వైయస్సార్సీపీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు, ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలు సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం, వారికి తోడుగా నిలబడడం ధర్మం కూడా ప్రతిపక్షానిదే.అందుకే వరసగా కార్యక్రమాలు:ఏడాది నుంచి చంద్రబాబుగారు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కోసం, వారికి పెట్టుబడి సాయం అందకపోవడం, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరస్థితి, లేని ఇన్పుట్ సబ్సిడీ అన్నింటిపై 2024, డిసెంబరు 13న వైయస్సార్సీపీ రాష్ట్రంలో ధర్నా కార్యక్రమం చేశాం.కరెంటు ఛార్జీల బాదుడుపై గత డిసెంబరు 24న రాష్ట్రంలో నిరసన కార్యక్రమం. ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా బాదుడుపై నిరసన కార్యక్రమం. పోరుబాట నిర్వహించాం. పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం. విద్యాదీవెన, వసతిదీవెన ఎగ్గొట్టిన వైనం. వాటన్నింటిపై మార్చి 12, యువతపోరు నిర్వహించాం. నిరుద్యోగ భృతి గురించి కూడా ప్రశ్నించాం.జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు మోసాలు వివరిస్తూ, వెన్నుపోటు దినం నిర్వహించాం. చంద్రబాబుగారు ఎగ్గొట్టిన బాకీలు అడిగాం. ఆరోజు రాష్ట్రమంతా కార్యక్రమం.ఇప్పుడు కూడా బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ అన్న నినాదంతో, ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ పేరుతో చంద్రబాబు మోసాలు ఎత్తి చూపుతూ, ప్రజలను చైతన్యులను చేస్తూ.. నాడు చంద్రబాబు ఇచ్చిన బాండ్లు టీడీపీ నాయకులకు చూపిస్తూ, ప్రభుత్వం పడిన బకాయిలు అడుగుతూ రాష్ట్రమంతా కార్యక్రమం కొనసాగుతోంది.జూలై (ఈనెల) 21 నుంచి గ్రామస్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అందరినీ చైతన్యులను చేసే దిశగా కార్యక్రమం నిర్వహిస్తాం.తట్టుకోలేక వేధింపుల పర్వం:చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఆయన ఏదీ చేయడని చెప్పి, వైయస్సార్సీపీ తలుపు తడుతున్నారు. ఎందుకంటే, వచ్చేది మన ప్రభుత్వమే అని అందరికీ తెలుసు. దీన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పోలీసులుగా, పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండే వారు. స్పందన కార్యక్రమంలో మా పార్టీ వారి కంటే ఎక్కువగా టీడీపీ వారి సమస్యలు పరిష్కరించేవారు. అదే ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటంటే.. చంద్రబాబుగారి మాట ఏ పోలీసు అధికారి అయినా వినకపోతే.. డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇంకా మరో డీజీపీ స్థాయ అధికారి సునీల్‌కుమార్, మరో అధికారులు సంజయ్, కాంతిలాల్రాణ టాటా, విశాల్‌గున్నీ.. అందరిపై తప్పుడు కేసులు వేధింపులు. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతి రాణా టాటా తదితరులను తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వీరు కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, మూడు అడిషినల్ కమాండెంట్లు, రెండు అసిస్టెంట్ కమాండెంట్లను కూడా హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు మాట వినని పోలీసుల పరిస్థితి. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తోందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారులను మాత్రమే పెట్టుకుని వారిని అవినీతిలో భాగస్వాములను చేసుకుంటున్నారు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్కొందరు అధికారుల అధికార దుర్వినియోగం:ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే డీఐజీలు కేంద్రంగా కొందరు అధికారులు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల కొందరు ఆ జోన్‌కి మాఫియా డాన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కింద సీఐలు, ఒక డీఎస్పీ ఆయన ఆర్మీ. నియోజకవర్గంలో జరిగే ఇసుక, మద్యం బెల్టు షాపులు, వాటికిచ్చే పర్మిషన్, పేకాట క్లబ్బులు, నడిచే పరిశ్రమల నుంచి డీఐజీల ఆధ్వర్యంలో సీఐలు కప్పం వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. సగం వీళ్లు తీసుకుని మరోసగం చినబాబు, పెదబాబుకి పంపుతారు. ఇవన్నీ తట్టుకోలేక సిద్దార్థ కౌశల్ వంటి యంగస్టర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్లిపోయాడు. కేంద్రానికి వెళ్లడానికి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో పడలేక రాజీనామా చేసి వెళ్లిపోయాడు. – ఏ ప్రభుత్వంలో అయినా పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉంటే, నేరస్తులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మంచి పోలీసులు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. యథేచ్ఛగా దాడుల పర్వం:కృష్ణా జిల్లా గుడివాడలో జడ్పీ ఛైర్మన్. బీసీ. నా సోదరి హారిక. టీడీపీ సైకోలు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసలు ఆమె చేసిన తప్పేమిటి? ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు?. చంద్రబాబు చేసిన మోసాలు నిలదీయడం తప్పా? రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’ కార్యక్రమానికి ఆమె వెళ్తుంటే దాడి చేశారు. సా.5 గం.కు దాడి మొదలై, 6.30 వరకు కొనసాగింది. ఆమెను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ, కొడుతూ, కారు అద్దాలు ««ధ్వంసం చేశారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా, వారు ప్రేక్షకపాత్ర పోషించారు.చంద్రబాబుగారిని అడుగుతున్నా.. ఆమె బీసీ మహిళ. ఆమెను తిడుతూ, అనరాని మాటలు అనాల్సిన అవసరం ఏముంది? దారి కాచి దాడి చేయడం సబబేనా? ఇది శాడిజమ్ కాకపోతే మరేమిటి?. ఇంత హేయమైన దాడి చేసి, సిగ్గు లేకుండా దుర్భాషలాడి, ఒక బీసీ మహిళ, నా చెల్లి హారికను టీడీపీ వారు మహానటి అంటున్నారు. కనీసం సిగ్గుందా? అన్నీ చేసిన మీరు ఆమెను మహానటి అంటారా? (అంటూ.. ఆ వీడియో ప్రదర్శించి చూపారు. హారికపై టీడీపీ మూకల దాడి దృశ్యాలు).పోలీసులు దగ్గరుండి, వారి సమక్షంలో జడ్పీ ఛైర్మన్‌పై దాడి. మహిళ. ఆమెను మహానటి అని రివర్స్ విమర్శ చేస్తున్నారు. అసలు ఎవరు మహానటులు. దాన వీర శూర కర్ణ కన్నా గొప్ప నటన ఆయన చేస్తున్నాడు. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు. ఇంత స్పష్టంగా ఘటన జరిగితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కారణం ఆ దాడి చేయించింది వారే కాబట్టి. పై నుంచి ఫోన్లు చేసి మరీ ఈ దాడి చేయించారు.ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. కళ్ల ముందు కనిపిస్తున్న వీడియో పక్కనపెట్టి, హారిక భర్త రాముపై కేసు పెట్టారు. ఆయన తన కారుతో ఢీ కొట్టాడని. అది గవర్నమెంట్ కారు. నడిపేది గవర్నమెంట్ డ్రైవర్. ఆ కారులో రాము వెనక సీట్లో కూర్చున్నాడు. ఆయన ఢీ కొట్టాడని కేసు పెట్టారు. వారు బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటు.ఆ మర్నాడు పెడనలో సమావేశం నిర్వహిస్తే.. పేర్ని నాని, జోగి రమేష్ తదితరులపై కేసు పెట్టారు. పార్టీ ఒక క్యాడర్ మీటింగ్ పెట్టుకోకూడదా?. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?. పోలీసులు రక్షణ కల్పించడం లేదు సరికదా? వారి సమక్షంలోనే దాడులు జరుగుతున్నా, బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా?జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్చంద్రబాబు ప్రతి పనిలోనూ టాపిక్ డైవర్షన్:నా ప్రతి పర్యటనలో ఆయన చేస్తోంది అదే. దాడులు చేసే ప్రయత్నం. తప్పుడు కేసులు పెట్టించడం. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చియార్డుకు వెళ్లాను. గత ఏడాది మిర్చి క్వింటా ధర రూ.27 వేలు పలికితే, చంద్రబాబు ప్రభుత్వంలో అది రూ.8 వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, వారికి మద్దతు ఇస్తూ, మిర్చియార్డుకు పోయింది జగన్ మాత్రమే. అది తప్పేనా?. ఆరోజు నా పర్యటనకు నా సెక్యూరిటీ తగ్గించాడు. ఆయనకు మూడ్ వస్తే ఇస్తాడు. లేకపోతే జడ్ ప్లస్ కేటగిరీ తీసేస్తాడు. మళ్లీ మాపైనే కేసు పెట్టారు.ఆ తర్వాత ఏప్రిల్‌లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో పర్యటన. మా పార్టీ బీసీ నాయకుడు కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేస్తే పరామర్శకు వెళ్లాను. సెక్యూరిటీ ఇవ్వలేదు. దీంతో జనం పోటెత్తి, హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతింది. అక్కడా పైలట్లను వేధించారు. మాపైనా కేసులు పెట్టారు. జూన్ 12. పొదిలిలో పర్యటన. పొగాకు ధర దారుణంగా పడిపోయింది. మరోవైపు కొనేవారు లేరు. రైతులు తల్లడిల్లుతుంటే, వారికి సంఘీభావంగా నేను పర్యటించాను. 40 వేలకుపైగా తరలి వచ్చారు. అప్పుడు ఒక 40 మందిని సిద్ధం చేసి దాడులకు వ్యూహరచన చేశారు. వారికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. అయినా రైతులు సంయమనం పాటించారు. వారు ఎదురుదాడి చేయలేదు. అయినా 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైలుకు పంపారు. మేము రైతులకు అండగా నిలబడితే, నీకొచ్చిన కష్టం ఏమిటి?చంద్రబాబు చేయాల్సింది చేయడు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు. కేసులు. అరెస్టులు. జూన్ 18న, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటన. మా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే నేను వెళ్తే అడ్డుకోవాలని ప్రయత్నం. నా కోసం ప్రజలు వస్తే, చంద్రబాబుకు ఏం ఇబ్బంది? ఆయన కార్యక్రమానికి జనం రాకపోతే, మాకేం సంబంధం? నా కార్యక్రమానికి రావొద్దని, మా పారీ నాయకులకు నోటీసులు. హౌజ్ అరెస్టులు. అలా నా కార్యక్రమానికి జనం రాకుండా కుట్ర. ఇంకా 5 కేసులు నమోదు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా?:సినిమా డైలాగ్‌లో పోస్టర్లుగా ప్రదర్శిస్తే.. ఇద్దరిని అరెస్టు చేశారు. నీకు ఆ డైలాగ్‌లు నచ్చకపోతే, సెన్సార్‌బోర్డుకు చెప్పి, వాటిని తీసేయించొచ్చు కదా?. నిజానికి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్‌లు ఇంకా దారుణం. సినిమా డైలాగ్‌లు ప్రదర్శిస్తే, కేసులు పెట్టడం ఏమిటి? సినిమాలు ఆపేయండి. ఎవరో ఒకరు సినిమా డైలాగ్‌లు ప్రదర్శిస్తే, వారికొచ్చిన నష్టం ఏమిటి?. ఈ వ్యవహారంలో 131 మందికి నోటీసులు. ఇద్దరిని రిమాండ్‌కు పంపారు. చంద్రబాబు ఎవరి పేరు చెబితే, వారిని పిలిపించడం రోజంతా కూర్చోబెట్టడం.. కేసులు పెట్టడం. ప్రతి ఛార్జ్‌షీట్‌లో ఓ ముగ్గురు, నలుగురి పేర్లు రాసి. అండ్ అదర్స్ అని రాస్తున్నారు. ఆ తర్వాత తమ టార్గెట్‌లో ఉన్న వారిని అందులో జోడిస్తున్నారు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్మామిడి రైతుల కష్టాలు. అక్కడా మాకు వేధింపులు:మామిడి రైతుల సమస్యలపై జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మామిడి ధర దారుణంగా పతనం. మే రెండో వారంలో కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా, జూన్ చివరి వరకు పట్టించుకోలేదు. నెల రోజులకు పైగా ఆలస్యం చేశారు. టీడీపీకి సంబంధించిన వారి కంపెనీలు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేశాయి. ఇక్కడ కిలో మామిడి రూ.12 అంటున్నారు. కానీ, ఎంత మందికి ఆ ధర ఇచ్చారు. 6.5 లక్షల టన్నుల పంట. 2.5 లక్షల ఎకరాల్లో సాగు. 76 వేల మంది రైతులకు ఇక్కట్లు. వారికి సంఘీభావంగా నేను అక్కడికి పోవడం తప్పా? ఆ కార్యక్రమంలో రైతులు పాల్గొనడం తప్పా?. 2 వేల మందికి నోటీసులు. వందల మంది అరెస్టు, ముగ్గురు ఎస్పీలు. వందల మంది పోలీసులు. వారంతా నా సెక్యూరిటీ కోసం. ప్రజలు నా కార్యక్రమానికి రాకుండా చూడడం కోసం.చివరకు బైక్‌లకు పెట్రోల్ కూడా పోయొద్దని నోటీసులు ఇచ్చారు. ఇన్ని చేసినా వేలాది రైతులు తరలి వచ్చారు. మామిడిని రోడ్ల మీద వేసి, నిరసన వ్యక్తం చేసి, నన్ను కలిశారు. ఆ కార్యక్రమంపై 5 కేసులు పెట్టారు. రైతులు, ప్రతిపక్షాన్ని పట్టుకుని అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం.అందుకు వారు సిగ్గుపడాలి:ఈనాడు చూస్తే దారుణ రాతలు. అది టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ. టిష్యూ పేపర్‌కు తక్కువ. నాపై రైతులు నిరసన వ్యక్తం చేశారని ఈనాడులో రాశారు. అది ఒక పేపరేనా? మామిడి రోడ్ల మీద వేసిన రైతులపైనా కేసులు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సమస్యలు ప్రస్తావించొద్దని, వారు రొడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్కరికీ ఉండొద్దని, ఎన్నికలప్పుడు ఇచ్చిన 143 హామీలు అన్నీ నెరవేర్చామని ప్రజలంతా భావించాలంట. లేదని ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పుడు కేసులు. వేధింపులు. పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు.. పాత్రికేయం లని చెప్పుకోవడానికి ఎల్లో మీడియాకు సిగ్గుండాలి.ఇది పైశాచికత్వం కాదా?:అనంత జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్మే పెద్దారెడ్డి.. తన సొంత ఇంటికి పోలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు పోవాలని చూసినా, పోలీసులే అడ్డుకుంటున్నారు. ఏకంగా గన్ చూపిస్తున్నారు. (అంటూ ఆ ఫోటో చూపారు).నెల్లూరు జిల్లాలో 6సార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం, వీరి పచ్చ సైకోలు, పచ్చ శాడిస్టులు పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, అప్పుడు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే, చంపేసి ఉండేవాళ్లు. (అంటూ పోలీసుల సమక్షంలోనే దాడి దృశ్యాల ప్రదర్శన). అదృష్టవశాత్తూ ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే.. దాడి చేసిన వారిపైన కానీ, చేయించిన ఎమ్మెల్యేపై కానీ ఏ చర్య లేదు. కేసు లేదు. కానీ, ప్రసన్నపైనే కేసులు నమోదు. అంటే ఇక్కడ బాధితుడే బాధ్యుడన్నట్లు చిత్రీకరణ. ఇది పైశాచికత్వం కాదా? ఒక దుష్ట సంప్రదాయం తీసుకొచ్చాడు చంద్రబాబు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరెండి:ఒక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు.. ప్రసన్న అన్న విషయమే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. వీళ్లే కాక 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి.. లాంటి తమ జీవితంలో మచ్చ లేని రిటైర్డ్ అధికారులు వీరు. వీరు కాక ఇంకా ఎంతో మంది అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్ని కేసులకు ఒకటే మోడస్ ఆపరాండి. తప్పుడు వాంగ్మూలంతో తమ టార్గెట్‌లో ఉన్న వారిపై కేసులు. అరెస్టులు.అప్పుడు వారి పరిస్థితి ఏమిటి?:ఇదే సంప్రదాయాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇప్పుడు దెబ్బ తిన్న వారు ఇలాగే వ్యవహరిస్తే, మీ పరిస్థితి ఏమిటి?. చంద్రబాబుగారు వేసిన విత్తనం రేపు వృక్షమై పోతుంది. రేపు ఇదే కొనసాగితే.. చంద్రబాబు, టీడీపీ వారి పరిస్థితి ఏమిటి? ఈరోజు దెబ్బ తిన్న వారు ఊర్కోరు కదా?. ఈరోజు మీరు చేసే తప్పుడు సంప్రదాయం, రేపు విషవృక్షం అవుతుంది. ఈరోజు దెబ్బ తిన్నవారు, మేము చెప్పినా వినకపోవచ్చు. కాబట్టి చంద్రబాబుగారు ఇకనైనా పద్ధతి మార్చుకో. తప్పుడు సంప్రదాయం వదిలెయ్.ఏదీ లేదు. అయినా ఎవరూ మాట్లాడొద్దు:ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడో అందరికీ తెలుసు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. మ్యానిఫెస్టో హామీల అమలు లేదు. రైతు భరోసా లేదు. తల్లికి వందనం లేదు. వాటి గురించి ఎవరూ మాట్లాడొద్దు. గత ఏడాది ఒక సిలిండర్ కొందరికే ఇచ్చారు. ఈ ఏడాది కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. తల్లికి వందనం లేదు. నిరుద్యోగ భృతి ఏడాదికి రూ.36 వేలు. దీన్ని మొత్తం ఎగ్గొట్టారు.దీన్ని ఎవరూ ప్రశ్నించొద్దు. అడగొద్దు. 50 ఏళ్లకే పెన్షన్ అని దాన్ని ఎగ్గొట్టారు. ఫ్రీ బస్ లేదు. ఏడాది గడిచిపోయింది. పండగల మీద పండగల డేట్లు చెబుతున్నాడు. కానీ, అమలు మాత్రం లేదు.పిల్లలు చదువులు మాని, పనులకు పోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికి 6 క్వార్టర్లు పెండింగ్. అలా రూ.4,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఏటా ఏప్రిల్‌లో రూ.1100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లు గడిచాయి కాబట్టి, రూ.2200 కోట్లు. రెండూ కలిపి రూ.6,600 కోట్లు కావాలి కానీ, ఇచ్చింది మాత్రం రూ.770 కోట్లు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.3600 కోట్లు చొప్పున బకాయి. ఆరోగశ్రీ, ఆరోగ్య ఆసరా కింద రూ.4500 కోట్లు బకాయి.చంద్రబాబు తొలగించిన ఉద్యోగాలు 3 లక్షలకు పైగా. 2.6 లక్షల మంది వలంటీర్లు. ఎండీయూ వాహనాల ద్వారా 20 మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్. అధికారంలోకి వస్తే జీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ తెస్తామన్నారు. అదీ మోసం. ఉద్యోగుల బకాయిలు రూ.20 వేల కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. అక్రమ కేసులు. చివరకు గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఏప్రిల్ నుంచి దాదాపు రూ.1000 కోట్లు బకాయి.అప్పుల కుప్ప. దా ‘రుణ’ స్థితి:చంద్రబాబు 14 నెలల్లోనే తెచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. కానీ, ఒక్క పథకం అమలు లేదు. 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. అప్పుడు రెండేళ్లు కరోనా ఉంది. అయినా అన్ని పథకాలు ఇచ్చాం. అంటే మా 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 52.34 శాతం 14 నెలల్లోనే చేశాడు. మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయింది? ఎవరికి మంచి చేయలేదు. పథకాల అమలు లేదు. అయినా ఎవరూ అడగొద్దు. రూ.18,272 కోట్ల బాదుడు విద్యుత్ ఛార్జీల రూపంలో భారం వేశారు. ఫ్యుయెల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో దోపిడి. చంద్రబాబు పుణ్యమా అని అమూల్ నష్టపోతోంది. మరోవైపు హెరిటేజ్ లాభాల్లో ఉంది. పాల ధరలు పెరిగాయి. పిల్లల ఫీజులు పెరిగాయి. నాడు–నేడు పనులు నిల్చిపోయాయి. అయినా ఎవరూ మాట్లాడొద్దు.ఎవ్వరూ ప్రశ్నించొద్దు:కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అమ్మకం, మట్టి మాఫియా, ఇసుక స్కామ్.. దేని గురించి ఎవరూ మాట్లాడొద్దు. ఇక్కడ నిర్మాణ వ్యయం పెంచారు. ప్రతి అడుగుకు దాదాపు రూ.10 వేలు చెల్లింపు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం కమిషన్ తీసుకుంటున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇస్తున్నారు. అయినా ఎవరూ మాట్లాడొద్దు. ప్రశ్నించొద్దు. ఎక్కువ ధరకు పీపీఏ చేసుకున్నా అడగొద్దు. ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి. అయినా ఎవరూ ప్రశ్నించొద్దు.జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్వడ్డీతో సహా చెల్లిస్తాం:ఒకటే చెబుతున్నా. ప్రజలతో ఉంటాం. వారి కోసం పోరాడుతాం. కేసులకు భయపడం. చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలుకుతున్న వారికి ఒకే హెచ్చరిక. ఎవరినీ వదలం. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. మరో మూడేళ్లు గడిస్తే, మా ప్రభుత్వం వస్తుంది.కరేడు రైతుల సమస్యపై మీడియా ప్రశ్నకు సమాధానంగా.. ఇండోసోల్‌ను తరిమేసే కుట్ర:ప్రకాశం జిల్లాలో ఇండోసోల్‌కు భూమి ఇచ్చాం. వారు రైతులకు డబ్బులిచ్చారు. 8 వేల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. కానీ, వారిని వెళ్లిపొమ్మంటున్నారు. ఆ భూములు వేరే వారికి ఇచ్చేలా, ఇండోసోల్ కంపెనీని కరేడుకు పొమ్మంటున్నారు. అక్కడ రైతులు రెండు పంటలు పండే భూములు ఇవ్వబోమంటున్నారు. ఆ కంపెనీ రూ.42 వేల కోట్లు పెట్టుబడి. మరి మీరు కంపెనీలు రావాలనుకుంటున్నారా?. అదే బీపీసీఎల్‌కు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే, ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఇవ్వొచ్చు కదా? వారికి ఇండోసోల్ కంపెనీ ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది?అదే చంద్రబాబు లక్ష్యం:పరిశ్రమల ఏర్పాటు కాదు చంద్రబాబు లక్ష్యం. వారిని బెదిరించి సొమ్ము చేసుకోవడం. జిందాల్ వాళ్లు వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు దండం పెడుతున్నారు అని జగన్ మీడియా సమావేశం ముగించారు. -
జేసీ డైరెక్షన్లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా
సాక్షి, అనంతపురం: కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా పతనమయ్యిందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. వైఎస్సార్సీపీ సమావేశాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పచ్చి అబద్ధం చెప్పిన విషయం కలెక్టర్ కార్యాలయం స్పష్టత ఇవ్వడంతో బయటపడింది. పైగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి డైరెక్షన్లోనే ఇది జరిగిందని సమాచారం. ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం జరగాల్సి ఉంది. అయితే అదే రోజున మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ పర్యటిస్తున్నారంటూ పోలీసులు వైఎస్సార్సీపీ సమావేశానికి అడ్డుపడ్డారు. పైగా సమావేశం నిర్వహించుకోవడం కుదరదంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాశారు. సాక్షాత్తూ ఐపీఎస్ అధికారి, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పేరుతో లేఖ అందజేశారు. ఈ విజ్ఞప్తితో 18వ తేదీకి సమావేశాన్ని వైఎస్సార్సీపీ వాయిదా వేసింది. తీరా చూస్తే.. తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగింది సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం. పోనీ దానికి మంత్రుల్లో ఒక్కరైనా వచ్చారా? అంటే అదీ లేదు. కేవలం లోకల్ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఈలోపు అసలు 15వ తేదీన మంత్రుల షెడ్యూల్ లేదని కలెక్టరేట్ వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం వైఎస్సార్సీపీ సమావేశం వాయిదా వేయించేందుకు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ చిల్లర డ్రామాకు తెర తీశారు. ఆయన డైరెక్షన్లో తాడిపత్రి పోలీసులు ఈ డ్రామా ఆడినట్లు ఇప్పుడు తేలింది.ఇదీ చదవండి: నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి -
‘1,500 ఎకరాల్లో అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణమా?’
సాక్షి, అమరావతి: అమరావతిలో రైల్వేస్టేషన్‌ను భారతదేశంలోనే అతి గొప్ప రైల్వేస్టేషన్‌గా 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతు నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషనా? ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. ‘అత్యంత పురాతనమైన చెన్నై రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. కేవలం 13 ఎకరాలు, అదే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. 16 ఎకరాలు, బెజవాడ రైల్వేస్టేషన్ విస్తీర్ణం ఎంతో తెలుసా?.. కేవలం 8 ఎకరాల్లో ఉంది. అసలు 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్లను ఏమనాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అదే మాట ఎవరైనా మామూలోడు మాట్లాడితే.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడ్ని చెప్పుతీసి కొట్టాలని అంటాం. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం ఏమనగలం? అది పిచ్చివాడు మాట్లాడినట్టుగా అనుకోవాలే తప్ప అంతకు మించి వేరే భాష ఏం మాట్లాడగలం’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసు
సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం పవన్ కల్యాణ్‌కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్‌కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కల్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్‌ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్‌ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు.పవన్ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్‌మెయిలింగ్.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్ శ్రీనివాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్ మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం (జులై16) మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టులు, తన పర్యటనలపై ఆంక్షలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘ఎమ్మెల్యే ధూళిపాళ్లపై హత్యాయత్నం కేసు పెట్టాలి’
తాడేపల్లి : ‘ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ అంబటి మురళి. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతోనే మన్నవ సర్పంచ్ నాగేమల్లేశ్వరరావుపై హత్యాయత్నం జరిగిందని అంబటి మురళి ఆరోపించారు. అందుకే ఘటన జరిగి 13 రోజులైనా ఇప్పటివరకూ ఆ కేసుకు సంబంధించి అందరినీ అరెస్ట్ చేయలేకపోవడమే కారణమన్నారు. నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం సీసీ పుటేజీని మాయం చేసే ప్రయత్నం చేశారని, కానీ అప్పటికే అది బయటకు రావటంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. ధూళిపాళ్ల నరేంద్రపై ఇప్పటికే అనేక కేసులున్నాయని విమర్శించారు. తాను ధూళిపాళ్ల అక్రమాలను ప్రశ్నిస్తున్నాననే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మురళి తెలిపారు. ‘ఎమ్మెల్యే ధూళిపాళ్ళ మీద A1గా కేసు నమోదు చేయాలి. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ప్రతి గ్రామంలోనూ గొడవలు రేపుతున్నారు. వర్గాలు ఏర్పాటు చేసి రాజకీయాలు చేస్తున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో నాగమల్లేశ్వరరావు కుటుంబం ఎదిగింది. ఆ కుటుంబమే ఎన్నో ఏళ్లుగా గ్రామంలో నాయకత్వం వహిస్తోంది. మన్నవ గ్రామం వైఎస్సార్ సీపీకి ఆయువుపట్టు లాంటిది. అలాంటి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కక్షలకు తెరలేపారు.పొన్నూరు దాటి గుంటూరు వరకు ధూళిపాళ్ళ నరేంద్ర తన సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆయన సెటిల్మెంట్ల వలన అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక హత్య కేసు సహా అనేక కేసుల్లో ధూళిపాళ్ళ నరేంద్ర ఉన్నారు. వెల్లలూరులో ధూళిపాళ్ళ నరేంద్ర వలన 11 హత్యలు జరిగాయి. ఆయన అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నాగమల్లేశ్వరరావు కేసులో A4, A5 నిందితులను ఎందుకు అరెస్టు చేయటం లేదు?, ఆ నిందితులు నరేంద్ర ఆఫీసులో కూర్చుని సవాల్ చేస్తున్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర నా మీద అక్రమంగా కేసు పెట్టించారు. ఇలాంటి అక్రమ కేసులకు నేను భయపడను’ అని అంబటి మురళి స్పష్టం చేశారు. -
చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటుంది
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కరేడు గ్రామ రైతులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందంటూ ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు.మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ మాట్లాడుతూ.. కరేడులో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ ఇండోసోల్‌కు భూములు తీసుకుని మళ్ళీ భూసేకరణ ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘పచ్చని పంటపొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోం. వైఎస్ జగన్‌ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించాం. ఇండోసోల్ కి ఆల్రెడీ భూములు ఎలాట్ చేసి ఇప్పుడు మరోచోట ఇస్తామంటూ భూములు సేకరించటం కరెక్ట్ కాదని మధుసూదన యాదవ్ అన్నారు.కరేడు గ్రామ రైతు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ.. మా రైతుల సమస్యలను వైఎస్ జగన్‌కి వివరించాం. మాకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ మా గ్రామానికి వస్తానన్నారు. మా ప్రాణామైనా ఇస్తాం.. కానీ ప్రభుత్వానికి మా భూములు ఇవ్వం. పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఇండోసోల్ పేరుతో భూ వ్యాపారం చేస్తామంటే సహించం. సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చేదిలేదుఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. ‘‘మా హయాంలో రామాయపట్నం పోర్టు తెచ్చినప్పుడు ఒక్క సమస్య కూడా రాలేదు. బాధితులకు నచ్చచెప్పి పునరావాసం కల్పించాం. ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కావాల్సిన భూములు కూడా ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇండోసోల్‌ను బలవంతంగా మరో చోటకు తరలించాలని చూస్తోంది. కరేడులో అన్ని రకాల పంటలు పండుతాయి...సంవత్సరం పొడవునా పంటలు పండే గ్రామం అది. రెండున్నర వేల మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఎస్టీలంతా గ్రామంలోని పొలాల్లో పనులు చేసుకుని బతుకుతారు. వారిని కూడా వెళ్లగొట్టాలని చూస్తున్నారు. కరేడులో 18 వేల మంది ఉన్నారు. వారందరినీ రోడ్డున పడేయాలని చూడటం కరెక్ట్ కాదు. సముద్రం ఒడ్డున 30కిమీ వరకు భూములు లాక్కునే కుట్రలు జరుగుతున్నాయి. అనేక గ్రామాలను కబళించడానికి ప్రయత్నం చేస్తున్నారు’’ అని మాధవరావు మండిపడ్డారు. -
టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుంది: వరుదు కల్యాణి
సాక్షి, విజయవాడ: జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మహిళపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు. మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజున్న బాబు,పవన్ ఎక్కడ?’’ అంటూ నిలదీశారు.టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా?. కూటమి పాలనలో ప్రజలు విసుగు చెందుతున్నారు. కచ్చితంగా చంద్రబాబు సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ‘‘జడ్పీ చైర్‌పర్సన్‌పై జరిగిన దాడి సిగ్గుచేటు. బీసీ మహిళపై దాడితో సభ్య సమాజం తలదించుకుంటుంది. బీసీలు అంటే బ్యాక్ బోన్స్ అని చెప్పిన చంద్రబాబు.. ఆ బోన్స్ విరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం.. సంక్షేమంలో రికార్డు లేదు కానీ.. దాడుల్లో రికార్డ్ సాధించింది. గంటసేపు మహిళపై నానా బూతులు మాట్లాడారు...దాడి చేయడమే కాకుండా ఉప్పాల రాముపై కేసు నమోదు చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మహిళా సంఘం చైర్మన్ మౌనంగా ఉంది?. చట్టం అందరికీ ఒకటే అనే సంగతి మరిచారా?. తక్షణం హోం మంత్రి, డీజీపీ స్పందించి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలి. దాడి చేయడమే కాకుండా ఉప్పాల హారికని మహానటి అనడం దారుణం’’ అని కల్పలతారెడ్డి మండిపడ్డారు. -
బాబుగారు.. అయ్యే పనులు చెప్పండి సార్!
ముగ్గురు పిల్లల్ని కనే తల్లిదండ్రులు దేశభక్తులట! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కొత్త ఉవాచ ఇది! డైవర్షన్ పాలిటిక్స్‌లో చేయితిరిగిన నేత తాజాగా ఎత్తుకున్న నినాదం ఇది అనుకోవాలి. జనాభాను పెంచాలంటున్నారు ఆయన. కానీ.. ఇదే ప్రామాణికమైతే చంద్రబాబు క్యాబినెట్లో దేశభక్తులు ఎందరని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అందరికంటే ముందు తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కు సలహా ఇచ్చి దేశభక్తుడిని చేయాలి కదా? అని కొందరు చమత్కరిస్తున్నారు.తెలుగుదేశం పార్టీలో కోటి మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. వారిలో పిల్లలను కనే అర్హత ఉన్నవారు ఎందరు..? చంద్రబాబు సూచన పాటించి 2029 నాటికి జనాభాను ఎంతమేరకు పెంచుతారు? మొదలైన వాటి గురించి చెప్పి ఉంటే ప్రజలకు ఆసక్తి ఏర్పడుతుంది కదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ఒక విధాన నిర్ణయం. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే అంశం కాదు. దేశానికి ఒక జనాభా విధానం ఉంటుంది. అయినా రాష్ట్రాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని చంద్రబాబు చెబుతున్నట్లు పిల్లలను కనకపోతేనో, కంటేనో దేశభక్తులు అవడం, అవ్వకపోవడం ఉండదు. ప్రతి కుటుంబం తన స్థోమతను దృష్టిలో ఉంచుకుని పిల్లలను ప్లాన్ చేసుకుంటుంది. ఆ విషయాన్ని విస్మరించరాదు.‘‘అన్నీ వేదాలలో ఉన్నాయష’’ అన్న డైలాగు ఒకటి గురజాడ వారి కన్యాశుల్కం నాటకంలో ఉంటుంది. అలాగే దేశంలో కాని, ప్రపంచంలో కాని ఏది జరిగినా దాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ మధ్యనే ఆయన ఆవుల నుంచి పాల పిండడం తానే నేర్పించానంటున్నట్లుగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. అలాగే ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులలో మెజార్టీ తానే కట్టానని చెప్పుకున్నారు. అసలు భారీ ప్రాజెక్టులపై అంతగా విశ్వాసం లేని వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. నీటి ఎద్దడికి ఇంకుడు గుంతలే పరిష్కారం అని భావించి గతంలో ఆ కార్యక్రమం అమలు చేశారు. తర్వాత కాలంలో వదలివేశారు. అది వేరే విషయం. ఒకప్పుడు జనాభా నియంత్రణను తానే ప్రోత్సహించానని తాజాగా అన్నారు. ఇద్దరు మించి పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులని తానే చట్టం తెచ్చానని కూడా చెప్పేశారు. నిజానికి 1960, 70 దశకాలలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ఒక విధానంగా దేశం అంతటా అమలు చేసింది.ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలన్న పాటలు అప్పట్లో బాగా వినిపించేవి. 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య ఇద్దరు పిల్లలు మించి ఉంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులన్న చట్టాన్ని తీసుకువచ్చారు. ఏ కుటుంబం అయినా స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి ఎక్కువ మంది పిల్లలను కంటుందా? అసలు విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలను ఎక్కువ మందిని కనాలని, అందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు అంటున్నారు. ఈ సమస్య దేశంలో ఎందుకు ప్రధానంగా వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ మంది పిల్లలను కంటుండడం, దక్షిణాది రాష్ట్రాలలో జనాభా నియంత్రణ పద్దతులు పాటిస్తుండడం వల్ల ప్రాంతాల జనాభాలలో బాగా తేడా వచ్చింది.దీని ఫలితంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, నార్త్ రాష్ట్రాలలో గణనీయంగా సీట్లు పెరిగి వారి పెత్తనం మరింత అధికం అవుతుందన్నది ఆందోళన. దీని గురించి కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా, ఏపీలో పిల్లలను అధికంగా కనండని చెబుతున్నారు. జపాన్, చైనా తదితర దేశాలతో పోల్చుకుని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. ఆ దేశాలలో కొంత సమస్య ఉన్నమాట నిజమే కావ,చ్చు. కాని అక్కడి పరిస్థితులు వేరు. ఆ దేశాలు అనుసరిస్తున్న పద్దతులు వేరు. అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన రీతిలో జనాభా వృద్ది రేటు ఉండడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి.ప్రధానంగా నగరీకరణ, జీవన వ్యయం పెరిగిపోవడం, సాంస్కృతిక, సంప్రదాయాలలో మార్పులు రావడం, పిల్లలను పెంచడంలో ఎదురవుతున్న సమస్యలు, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం, మహిళలు అటు కుటుంబ జీవనం, ఇటు కెరీర్ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు వంటివి ఉన్నాయి. జపాన్‌లో ఒకరికి జన్మనిస్తే ఏభైవేల యెన్ లు ఇవ్వాలన్న స్కీమ్ ఉంది. ఇది ఆదాయ పరిమితి లేకుండా అమలు చేస్తున్నారు. పిల్లల పెంపకం, బేబీ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే ఖర్చు భరించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు స్ట్రోలర్లు మొదలు డైపర్ల వరకు ప్రభుత్వమే ఇస్తుందట. అయినా జపాన్ లో జనాభా పెరుగుదల పెద్దగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పెరిగితే ఎకానమీ కొంత పెరగవచ్చు కాని, దాంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయన్నది నిపుణుల అంచనా. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో తక్కువ జనాభాతో మంచి ఆర్థిక ప్రగతిని సాధించాయి.చైనాలో ఒకప్పుడు ఒకరినే కనాలన్న నిబంధన ఉన్నా, దానిని క్రమేపి ముగ్గురికి పెంచారు. అందుకు కారణం వృద్దుల సంఖ్యకు, యువతకు మధ్య సమతుల్యత లేకపోవడమే. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచడం, రిటైరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం, వలసలను ప్రోత్సహించడం, ఇతర ప్రోత్సహాకాలు వంటివి చేస్తున్నాయి. జపాన్ వంటి దేశాలలో వలసలు కూడా ఎక్కువగా ఉండడం లేదు. ఏపీ విషయానికి వస్తే, ఒకవైపు అమరావతి పేరుతో కొత్తగా నగరాన్ని నిర్మిస్తానని చెబుతుంటారు. అంటే అర్బనైజేషన్ పెంచడం అన్నమాట. మరోవైపు అర్బనైజేషన్ వల్ల ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా కేంద్రీకరణ వల్ల ఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాలలో మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెరుగుతోంది. అందరికి సరిపడా నీటిని సరఫరా చేయడం కష్టం అవుతోంది.అయినా ఒక నగరాన్ని సృష్టించడం అంత తేలిక కాదు.దానంతట అది సహజంగా అభివృద్ది చెందాలి తప్ప. పిల్లలను కంటే జపాన్ లో భారీ మొత్తాన్ని ప్రోత్సాకంగా ఇస్తున్నారు. ఆ పని చంద్రబాబు సర్కార్ చేయగలదా? తల్లికి వందనం పేరుతో విద్యార్దులందరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల వాగ్దానాలలో చేశారు. దానిని ఒక ఏడాదంతా ఎగవేశారే! ఈ ఏడాది ఇచ్చినా అదేదో కొత్తగా లోకేశ్ కనిపెట్టినట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. గత ముఖ్యమంత్రి జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద ఈ మొత్తాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. పిల్లలకు అబద్దాలు ఆడరాదని బోధించాల్సి చోటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా సత్యదూరం అయిన విషయాలు చెప్పవచ్చా అన్న చర్చ వచ్చింది.ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని హామీ ఇచ్చారు.దాని సంగతేమిటి? ఇదేదో డబ్బు వస్తుందిలే అని నమ్మి మహిళలు ఎక్కువమంది పిల్లలను కంటే వారికి ఇబ్బందే కదా! నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ప్రామిస్ చేశారు. దాని అతీగతి లేదు. ఇలా హామీలను ఎగవేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సహకాలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? జపాన్‌లో మహిళల కాన్పునకు అయ్యే వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఏపీలో అలా చేయగలుగుతారా? ఆరోగ్యశ్రీని నీరు కార్చుతున్నారన్న విమర్శలు ఉన్నాయి కదా! పిల్లల చదువుకు ఫీజ్ రీయింబర్స్మెంట్ వంటివి ఎంతో ఉపయోగపడుతున్నాయి. దాని బకాయిల మాటేమిటి? ఇవన్ని పెట్టుకుని పిల్లలను ఎక్కువ మందిని కంటే దేశభక్తులని చెబితే ఎవరు నమ్ముతారు.డబ్బు ఉన్నవారు ఒకరు, ఇద్దరు పిల్లలను మాత్రమే కంటున్నారు. పేదలు ఎక్కువ మందికి జన్మనిస్తే, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు. వ్యవసాయ కార్మికులు అవసరమైన మేర లభించకపోవడానికి, ఇతరత్రా పనులు చేసేవారు లేక పోవడానికి ఇతర కారణాలు ఉన్నాయి. వ్యవసాయం అంత గిట్టుబాటు కాదని, ఇతర రంగాలకు మళ్లాలని గతంలో ఒకసారి సీఎం అన్నారు. నిజంగానే కూటమి సర్కార్ వచ్చాక వివిధ పంటలకు సరైన ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు.నష్టాల పాలవుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువమంది పిల్లలను కనండని రైతులకు, వ్యవసాయ కార్మికులకు చెబితే వారు ఏమని జవాబు ఇస్తారు.. ఇలా నేల విడిచి సాము చేసినట్లు చంద్రబాబు నాయుడు ఏదో ఒక కొత్త డైలాగు తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఆచరణాత్మక విధానాలవైపు వెళితే మంచిది కదా! పిల్లలను ఎక్కువ మందిని కనడం అన్నది దేశభక్తికి సంబంధించింది కాదు..ఆయా కుటుంబాల ఆర్థిక శక్తికి సంబంధించిన విషయం. తమ కుటుంబాలలో ఆచరించచని పద్దతులను ప్రజలు పాటించాలని చంద్రబాబు వంటివారు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘రెడ్‌బుక్’తో చట్టాలు అపహాస్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చట్టాలను అపహాస్యం చేస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరాచకం సృష్టిస్తున్న వారు టీడీపీకి చెందిన వాౖరెతే చాలు ఏ చట్టాలూ వారికి వర్తించవన్నట్లుగా అన్ని కేసులను మాఫీ చేస్తున్న దుర్మార్గమైన పాలనను దేశంలోనే తొలిసారి చూస్తున్నామని విరుచుకుపడ్డారు.తమపై దౌర్జన్యం జరిగిందని కేసు పెట్టడానికి వెళ్లిన బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేస్తున్న అరాచకం రాష్ట్రంలో జరుగుతోందన్నారు. ‘ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసుల మీద ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. కీలక నిందితులకు వత్తాసు ‘గుడివాడలో కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త రాము మీద పథకం ప్రకారమే కూటమి గూండాలు దాడిచేశారు. గుడివాడలో కేసు నమోదు చేయమని అడిగితే పోలీసులు చేయలేదు. కోర్టును ఆశ్రయిస్తామనడంతో టీడీపీకి చెందిన కీలక నిందితుడు రామును వదిలేసి కేసు నమోదు చేశారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కేసులోనూ ఐదుగురిని ముద్దాయిలుగా చేర్చి ముగ్గుర్ని రిమాండ్‌కి తరలించారు. దాడిలో కీలక సూత్రధారి, పాత్రధారి బండ్లమూడి చింపిరయ్య, ఆయన అనుచరుడిని కేసు నుంచి తప్పించారు. లిక్కర్ స్కాం కేసులో ఆధారాలతో సహా చంద్రబాబును ముద్దాయిగా చేర్చితే ఆ కేసును నీరుగార్చి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. బంగారుపాళ్యంలోనూ అక్రమ కేసులు ‘మామిడి రైతులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు వెళ్తే.. పచ్చమీడియా ఫొటోగ్రాఫర్‌పై దాడి చేశారంటూ ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టుచేశారు. వారిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలన్న నిబంధనలను పట్టించుకోలేదు. వారి బంధువులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో 12న అరెస్టుచేశామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అరెస్టు చేసినప్పుడు వీరి మీద నమోదైన బెయిలబుల్ సెక్షన్లను రాజకీయ ఒత్తిళ్లతో నాన్‌బెయిలబుల్ సెక్షన్లుగా మార్చారు’ అని దుయ్యబట్టారు. -
‘అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?’
కృష్ణాజిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించిన మార్గాని భరత్.. మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అరాచకాల్ని నిలదీశారు భరత్. ‘ఏపీలో గడచిన ఏడాది కాలంగా ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలి పై దాడి చేయడమేంటి?, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా?, జడ్పీ చైర్ పర్సన్ పై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేసినట్లుగానే మేం భావిస్తున్నాం. టిడిపి గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహించడమేంటి?, గతంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?, టిడిపి బిసిల పార్టీ అని చెప్పుకుంటుంది. ఒక బిసి మహిళ పై దాడి జరిగితే మీరేం చేస్తున్నారు?, దాడి చేసి తిరిగి జడ్పీ చైర్ పర్సన్ భర్త పై కేసు నమోదు చేయడమేంటి?, చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నాం. జడ్పీ చైర్ పర్సన్ పై దాడి చేస్తారని పోలీసులకు ముందే తెలుసు. ఇదంతా స్పాన్సర్డ్ ప్రీ ప్లాన్డ్ దాడిలా కనిపిస్తోంది. ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల పై ఏ రకంగా దాడులు చేస్తున్నారో అంతా గమనిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల పై దాడులు చేస్తే ప్రజలు ఎలాగూ ప్రశ్నించరని ఒక అజెండాగా టిడిపి వ్యవహరిస్తోంది. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందని అనుకోవద్దు. రేపు మా ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఓ సారి ఆలోచన చేయండి. ఏడాది కాలంలోనే మీ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా వస్తాయోలేదో చూసుకోండి. ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. బిసి మహిళ పై జరిగిన దాడికి నిరసనగా బిసి సంఘాలన్నీ బయటికి రావాలి’ అని సూచించారు. -
చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: మా ఓపికను మీరు చేతగానితనంగా తీసుకోవద్దని కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం.వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. తప్పుడు కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారుల్ని సైతం విచారిస్తామని స్పష్టం చేశారు.సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగాన్ని, చట్టాలను చంద్రబాబు ప్రభుత్వం చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తోంది. దీన్ని నియంతృత్వం అనాలా..? ఏమనాలి.?. అన్ని వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీశారు. టీడీపీ చెప్పినట్టు వినకపోతే వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా తప్పుడు కేసులు కోసం వాడుతున్నారు.వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తున్నందుకు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేశారు. టీడీపీ వాళ్ళు గుడివాడలో దారి కాసి గొడవలు చేశారు. పోలీసులు ఉండగానే గంటన్నర సేపు గుండాలు మహిళ జెడ్పి చైర్మన్‌పై దాడికి దిగారు. పోలీసులు రక్షణలో వాళ్ళు దాడులు చేశారు.కారుని పోలీసులు తాళ్ళు కట్టి తీసుకెళ్లాలని యత్నించారు.పోలీసులు దాడి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ నాయకులు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి చేస్తుంటే ఆపే ప్రయత్నం చేయలేదు. దాడులు జరపకుండా నిలువరించలేదు. తాము అధికారంలో ఉన్నామని,మా గురించి ఎవరు గొంతెత్తి మాట్లాడకూడదనిదాడులు చేస్తున్నారు.పోలీసులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పించుకోవచ్చు కానీ అందరూ చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై అక్రమ కేసు పెట్టారు. మాదాల సునీత అనే మహిళతో ఫిర్యాదు చేయించారు. ఆమె ఫ్లెక్సీలు చించారు. గాయం అయితే కారుతో గుద్దినట్టు కేసు పెట్టారు. ఉప్పాల రాము వెనకాల సీట్లు కూర్చొని ఉంటే ఆయన గుద్దించినట్టు కేసు పెట్టారు.ఎలాగైనా కేసులు పెడతాం అన్నట్టు ఇష్టానుసారం కేసులు పెట్టేస్తున్నారు. హైకోర్టు అన్ని కోర్టులకు మెకానికల్‌గా రిమాండుకు పంపొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానాలపై భయం లేకుండా ఇలాంటి కేసులు పెడుతున్నారు. వైఎస్ జగన్ బంగారు పాళ్యం పర్యటనకు వేలాది మంది రైతులు వచ్చారు. దానికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వస్తే దాడి చేశారని కేసు పెట్టారు.ఎఫ్ఐఆర్ని మార్చి మరి తప్పుడు కేసు పెట్టారు.నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారు. పోలీసులు ఉండగానే ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి చేశారు.వాళ్ళ ముందే వస్తువులను కాల్చారు. వారం రోజులైనా ఎవరిపైనా కేసు పెట్టలేదు.ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.తాడిపత్రిలో పెద్దారెడ్డిని హైకోర్టు చెప్పినా నియోజకవర్గంలోకి రానివ్వలేదు. పొదిలి, బంగారు పాళ్యం అన్ని చోట్లా తప్పుడు కేసులు పెట్టారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు అన్నింటినీ మళ్ళీ ఓపెన్ చేస్తాం. తప్పుడు కేసుల్లో ఉన్న అధికారుల పైన కూడా విచారిస్తాం. మా ఓపికను చేతకాని తనంగా తీసుకోవద్దుని సూచించారు. -
వీడియో సహా అన్ని ఆధారాలున్నాయి.. రవీంద్ర పగటి వేషగాడు: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేవలం రెడ్‌బుక్ పాలన మాత్రమే సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. అలా చేసిన వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం అని హెచ్చరించారు. కొల్లు రవీంద్ర ఓ పగటి వేషగాడు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహానటి అంటూ సైటెరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ప్పాల హారికపై దాడి చేసి తిరిగి ఉప్పాల రాముపై కేసు నమోదు చేయడం దారుణందాడి చేసి తిరిగి మా పార్టీ సభ్యులపైనే కేసులు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్త ఏం చేశారో.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. టీడీపీ మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేసింది. ఆమె కొడాలి నాని.. ఫ్లెక్సీని చించేశారు. ఫ్లెక్సీని చించి చేతికి గాయం అయితే కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. వారిని న్యాయస్థానాల్లో నిలబెడతాం.చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోంది. నారా లోకేశ్ డైరెక్షన్‌తో అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు పంపింది టీడీపీ కార్యకర్తలు కాదా?. జెడ్పీ చైర్పర్సన్ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా?. వాళ్లే గొడవలు సృష్టించి తిరిగి కేసులు పెడుతున్నారు. 13 నెలలుగా తప్పుడు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వైఎస్సార్సీపీలో ఎవరు క్రియాశీలకంగా ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. గుడివాడలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించింది టీడీపీ వాళ్ళు కాదా? అని ప్రశ్నించారు. -
టీడీపీ కార్యకర్త డ్రామా.. ఉప్పాల హారిక భర్తపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి సర్కార్ వేధింపుల పర్వం కొనసాగుతోంది. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై గుడివాడ పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ నాయకురాలి ఫిర్యాదుతో ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి తర్వాత కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో, రంగంలోకి కూటమి పెద్దలు.. బాధితులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కొత్త డ్రామాకు, డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు.తాజాగా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి రివర్స్‌లో వారిపైనే కేసు పెట్టారు. పచ్చ బ్యాచ్ ప్లాన్‌లో భాగంగా హారిక భర్త రాము.. తన కాలుపై కారు ఎక్కించాడని టీడీపీ నాయకురాలు మాదాల సునీత ఆరోపించారు. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతల సాయంతో సునీత.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాముతో సహా నందివాడ మండలం వైఎస్సార్సీపీ నేత కందుల నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు. అయితే, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి ఘటనలో మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. -
నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదా జగనూ..!
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు నేర్పించినావు కదా... తండ్రికి మించిన తనయుడువు అయితివి అబ్బా.. ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. అంటూ కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ప్లెక్సీ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తుంది. అక్కడే కాసేపు నిలబడి ఆ ఫ్లెక్సీలోని పాయింట్లన్నీ ఆమూలాగ్రం చదివేలా చేస్తోంది.. ఆ తండ్రీకొడుకులిద్దరూ కళ్లు మూసుకుని నిన్ను ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా!. నిత్యం నిన్ను అవమానించే వాళ్ళు, నీ ఇమేజ్‌కు డామేజ్ చేసే వాళ్లు కూడా.. కిక్కురు మనకుండా నీ అడుగుల్లో నడిచే పరిస్థితి తీసుకొచ్చావ్ కదయ్యా. ఎంత పని చేశావయ్యా జగన్..!! అంటూ అందులో రాసి ఉంది.. .. వాస్తవానికి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్‌కు పేదలంటే ఇష్టం ఉండదు!. అదొక అసహ్యమనే భావనలో ఉంటారు వాళ్లు. సర్కారు బడుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులు, పథకాలు, సంక్షేమం వగైరా అంటే వారికి అసలు గిట్టదు. కానీ ప్రభుత్వం అంటే ప్రజలు అని.. ప్రజలతో మమేకం కాకుండా పరిపాలన చేసిన అది నిజమైన ప్రభుత్వం కాదు అని వైఎస్ జగన్ నిరూపించారు. ఐదేళ్ల పరిపాలనలో నిత్యం ఆయన ధ్యాస తపన ఆలోచన ప్రజల చుట్టూనే ఉండేది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేయాల్సిందే అని పట్టుబట్టిన ఆయన వాటి జాబితాను తన కార్యాలయ గోడలకు అతికించి నిత్యం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటి అమలుకు ముందడుగు వేస్తూ ఉండేవారు. అయితే.. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నేడు చంద్రబాబు కూడా వైయస్ జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు తొలిసారిగా తల్లికి వందనం అంటూ ఓ పథకాన్ని ఇచ్చారు. వాస్తవానికి అది గతంలో జగన్ ‘అమ్మ ఒడి’ పేరిట ఇచ్చిన పథకమే. కానీ దాన్ని తామే కొత్తగా కనిపెట్టినట్లుగా ప్రజలను నమ్మిస్తూ వస్తున్నారు. జగన్ తన పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరిట ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్ మీడియం. సబ్జెక్ట్ టీచర్లు ఇలా రకరకాల కాన్సెప్ట్‌లతో ప్రభుత్వ విద్య విధానంలో నాణ్యత పెంచారు. ఇప్పుడు అదే పాఠశాలల్లో చంద్రబాబు లోకేష్ ఫోటోలు దిగి పిల్లలతో ముచ్చట్లు చెబుతూ అదంతా తమ ఘనతగా పత్రికల్లో రాయించుకుంటున్నారు. ఇలా ఎన్నో అంశాలను సదర్ ఫ్లెక్సీలో పేర్కొన్న రహస్య అభిమాని.. ‘‘ఎంత పని చేసావు జగన్’’ అంటూ జగన్ అభినందిస్తూనే చంద్రబాబు పడుతున్న తిప్పలను హాస్యపూరితంగా వివరించారు.నీ ఒత్తిడి భరించలేక పేద పిల్లలకు చంద్రబాబు తనకి ఇష్టం లేకపోయినా తల్లికి వందనం ఇచ్చాడు. నువ్వు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్న పరిశ్రమలు ప్రాజెక్టులు పథకాలనే చంద్రబాబు లోకేష్ ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. నువ్వు గతంలో ప్రజలతో మమేకం అయినట్లుగానే ఇప్పుడు చంద్రబాబు కోరికన్నా ముందు నిద్రలేచి టీ స్టాళ్ళు.. చేపల బజార్లు.. సందులు.. గొందుల్లో తిరుగుతూ జనంతో కలిసి ఫోటోలు దిగుతున్నారు.. ఇవన్నీ గతంలో నువ్వు చేసినవి కాక మరేమిటి జగనూ!. .. నీ పర్యటనలకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని ఆపలేక చంద్రబాబు ఆఖరుకు తన కడుపు మంటను మంత్రుల మీదకు వెళ్ళగకుతున్నారు.. ఇది కూడా నువ్వే చేశావు జగనూ!. కూటమిలోని మూడు పార్టీలకు ఒకరంటే ఒకరికి పసగకపోయినా నీ భయంతో అందరూ చేతులు పట్టుకొని జట్లు పట్టుకొని ఒకరినొకరు పొగుడుకునేలాగా చేశావు.. విడిపోతే ముగ్గురూ అస్సామే అనే పరిస్థితి తీసుకొచ్చావు జగనూ!. నువ్వు ఏ ఊరికి పర్యటనక పోతే అక్కడ ముందుగానే పరిస్థితులు చక్కపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అక్కడి సమస్యలపై ఉరుకున పరుగున స్పందించే ప్రయత్నమూ చేస్తున్నారు.. ఎంత పని చేసావు జగనూ!.నువ్వు ఓడిపోయినా.. రాష్ట్రంలో మీ పరిపాలనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని ఈ తండ్రి కొడుకులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చావ్.. ఎంత పని చేశావు జగనూ! అంటూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందర్నీ ఆలోచింపజేస్తోంది.::సిమ్మాదిరప్పన్న -
ఏది విధ్వంసం? ఏది ద్రోహం?
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికార తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంధించిన ప్రశ్నలు అర్థవంతంగా ఉన్నాయి. గత ముఖ్యమంత్రి జగన్ పేషీలో పనిచేసిన అధికారులు పలువురిపై రాజకీయ ముద్ర వేసి పోస్టింగ్‌లు కూడా ఇవ్వని టీడీపీ ప్రభుత్వం అప్పటి ప్రముఖ కాంట్రాక్టర్లను మాత్రం ఎలా పక్కన బెట్టుకు తిరుగుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూటమి పెద్దలు జవాబు ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రముఖ కాంట్రాక్టర్ మేఘా సంస్థ అధినేత పి.కృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన హెలికాప్టర్లో తన స్వగ్రామానికి తీసుకెళ్లారని వార్తలొచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగా పోలవరం కాంట్రాక్టును నవయుగ సంస్థ నుంచి తప్పించి మేఘాకు ఇచ్చినప్పుడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. అంతెత్తున విమర్శలు చేసిన వ్యక్తి అధికారం రాగానే ఎలా దగ్గరైపోయాడన్నది బుగ్గన ప్రశ్న!. అందుకే ఆయన దీన్ని ఏ రాజకీయం అంటారో కేశవ్ చెబుతారా? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ నేతృత్వంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇతర ప్రభుత్వ అధికారులు ఏం తప్పు చేశారని ఇప్పుడు వేధిస్తున్నారని నిలదీశారు బుగ్గన. కాంట్రాక్టర్లు.. కొంతమంది పెట్టుబడిదారులతో మాత్రం ఎందుకు అలయ్ బలయ్ నడుపుతున్నారు? ఆర్థిక బంధమే బలమైందన్న విమర్శలకు వీరు ఆస్కారం ఇవ్వడం లేదా! అని మరో విషయాన్ని బుగ్గన ప్రశ్నించారు. ప్రభుత్వ అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే దేశద్రోహం అవుతుందన్న కేశవ్ వ్యాఖ్యలను ప్రస్తావించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులను నిలదీశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కొందరు వైఎస్సార్సీపీ పాలనలో కులాలు, మతాల మధ్య తగాదాలు పెట్టేలా ప్రచారం చేసేవారని, అప్పుడు రాజద్రోహం కేసు పెడితే గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక అక్రమాలపై ప్రశ్నిస్తే దేశద్రోహం అంటున్నారని విమర్శించారు.గత టర్మ్‌లో ఆలయాల వద్ద రచ్చ చేయడం, అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ విషయంలో సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఇవేవీ తప్పు కావని కూటమి నేతలు భావిస్తే భావిస్తుండవచ్చు. కానీ, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వారు చేసిన ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రూ.1.70 లక్షల కోట్ల అప్పులు చేసిందని అంచనా. దారుణమైన షరతులకైనా ఓకే చెప్పేసి అందుకు అనుగుణంగా జీవోలు ఇచ్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ట్రెజరీ ఖాతాను తాకట్టు పెట్టారు. అది ఎంతవరకు సమర్థనీయమని బుగ్గన, తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి కేశవ్‌లు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. కేశవ్ దానికి సమాధానం చెప్పకుండా ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయవద్దని వైఎస్సార్సీపీ మద్దతుదారులో, కొందరు నేతలో పెట్టుబడిదారులకు ఈ-మెయిల్స్ పంపుతున్నారని, ఇది దేశద్రోహమని, వారిపై కేసులు పెట్టాలని అంటున్నారు.కేశవ్ చాలాకాలం విపక్షంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొన్ని హక్కులు ఉంటాయన్న సంగతి కూడా ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. ఫిర్యాదులు చేస్తే రుణాలు ఇవ్వడం ఆగిపోతుందా!. ఆయన చెప్పేదే అభ్యంతరకరమైతే, గత టర్మ్‌లో జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసి, అసత్యాలతో కేంద్రానికి, ఆయా వ్యవస్థలకు ఫిర్యాదు చేసిన వారిపై ముందుగా కేసులు పెట్టాలి కదా అన్న వైఎస్సార్సీపీ నేతల ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై పచ్చి అబద్దాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు ఫిర్యాదు చేసి వచ్చారు కదా?.చంద్రబాబు, పవన్, లోకేశ్ తదితరులు ఏపీ అప్పు రూ.పది లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లంటూ తప్పుడు లెక్కలు ప్రచారం చేశారు కదా? ఆర్థిక విధ్వంసం అని ఊదరగొట్టారు కదా? అవన్నీ ఏపీ ప్రతిష్టను దెబ్బతీసేవి కాదా! ఏపీకి ఎక్కడ రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? అందులో చంద్రబాబు 2014 టర్మ్‌లో చేసిన అప్పు ఎంతో ఎందుకు ఏనాడు చెప్పలేదు? బడ్జెట్లో కేవలం రూ.5.5 లక్షల కోట్ల అప్పేనని కేశవ్ ఎందుకు చదివారు? మళ్లీ బయటకు వచ్చి రూ.పది లక్షల కోట్లు అని ఎలా అంటున్నారు? ఇదంతా రాష్ట్రం బ్రాండ్‌ను చెడగొట్టడం కాదా?. ఈ పని చేసినందుకు ముందుగా కూటమి నేతలపై కదా కేసులు పెట్టాల్సింది?. ఆ పని చేయకుండా వైఎస్సార్సీపీ వారిపై ఆరోపణలు చేస్తే సరిపోతుందా!.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, కరోనా సమయంలో జీతాలు ఆలస్యమైతే కూడా హైకోర్టుకు వెళ్లిందెవరు?. జగన్ ప్రభుత్వం దేనికైనా జీవో ఇచ్చిన మరుసటి రోజే ప్రజా ప్రయోజన వాజ్యం పేరుతో హైకోర్టులో ఎన్ని వందల దావాలు వేశారు?. అదంతా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం కాదా? తమ టైమ్‌లో చేసిన అప్పులను సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించామని, కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూ.1.70 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. దీనిపై శ్వేతపత్రం ఇవ్వడానికి కేశవ్ సిద్దపడతారా? అన్నిటికి మించి ట్రెజరీని తాకట్టు పెట్టిన చరిత్ర గతంలో ఎన్నడైనా ఉందా అని ఆయన అడుగుతున్నారు.ఏపీఎండీసీ ఏడు వేల కోట్ల అప్పు తీసుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే, దానిని ఆర్థిక విధ్వంసం అని ప్రచారం చేసిన టీడీపీ పెద్దలు, ఇప్పుడు ఏకంగా తొమ్మిది వేల కోట్ల అప్పును తీసుకున్నారో లేదో చెప్పాలి కదా! ఇందుకోసం రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టారే. అక్కడితో ఆగకుండా పెట్టుబడిదారులకు సకాలంలో వడ్డీ, వాయిదాలు చెల్లించకపోతే నేరుగా రిజర్వు బ్యాంక్ ఖాతా నుంచి తీసుకోవచ్చని జీవో ఇవ్వడం సరైనదేనా అన్న బుగ్గన ప్రశ్నకు కేశవ్ ఎందుకు జవాబు ఇవ్వలేదు.పైగా ఖనిజాభివృద్ది సంస్థ నుంచి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడు వేల కోట్ల రుణం తీసుకుంటే తాము తొమ్మిది వేల కోట్లు తీసుకున్నామని కేశవ్ గొప్పగా సమర్ధించుకున్నారు. అంటే ఇది ఆర్థిక విధ్వంసం కాదా?. ఏపీలో అక్షరాస్యత పెంచడానికి, చదువులను ప్రోత్సహించడానికి జగన్ అమ్మ ఒడి తదితర స్కీములను పెడితే ఆర్థిక విధ్వంసం అని, శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన కూటమి నేతలు, ఆ తర్వాత అదే స్కీమును మరింత ఎక్కువ మందికి ఇస్తామని వాగ్దానం చేశారు. ఒక ఏడాది ఎగవేసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నారు. మరి ఇది ఆర్థిక విధ్వంసం అవుతుందా? కాదా? అన్నది కేశవ్ చెప్పాలి కదా!.ఒకవైపు జగన్ స్కీములను కొనసాగిస్తూ.. మరో వైపు జగన్ టైమ్‌లో విధ్వంసం అంటూ ప్రచారం చేయడం కూటమి నేతలకే చెల్లింది. సూపర్ సిక్స్ సహ పలు హామీలు అమలు చేయమని అడగడం దేశద్రోహం అవుతుందా?. ఎన్నికల ప్రణాళికలో వందల కొద్ది హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయాలనుకోవడం ప్రజాద్రోహం అవుతుందా? కాదా? అన్నది కూటమి నేతలే తేల్చుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్
సాక్షి,కృష్ణాజిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనొద్దని నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పామర్రు మీటింగ్‌లో చెప్పా.నేను ఎవరినీ నరకమని చెప్పలేదు. 8వ తేదీన మాట్లాడితే 12వ తేదీన టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో నాపై డిబేట్లు పెట్టారు. పచ్చ పార్టీ మహిళలతో నన్ను బూతులు తిట్టించారు.చీకట్లో నేను తలలు నరికేయమన్నానని టీడీపీ ఛానల్స్‌లో ప్రచారం చేశారు. వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. జగన్‌ను భూస్థాపితం చేయడం చంద్రబాబు తరమా...అతని కొడుకు లోకేష్ తరమా?రోజులు లెక్కపెట్టుకో కొల్లు రవీంద్ర. వెనుకబడిన వర్గాలకు చెందిన ఆడబిడ్డ కన్నీరు మీ పచ్చ సైకోలను ఇంటికి పంపించడం ఖాయం.ఓయ్ సొల్లు రవీంద్ర మేం అన్నం తింటున్నాం. నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయి తినడం లేదు. సొంత అన్న కొడుకుల స్థలం కొట్టేసిన నువ్వు అన్నం తినడం లేదు.బందరు బీచ్‌లో ఇసుక తింటున్నావ్..నువ్వు అన్నం తినడం లేదు.తోట్ల వల్లూరులో ఇసుక తింటున్నావ్.. నువ్వు అన్నం తినడం లేదు. 2024 ఎన్నికల అఫిడవిట్ లో నీ ఆదాయం కోటి రూపాయలు లేదు. కానీ ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు.. ఇస్తున్న డొనేషన్లకు కోట్ల రూపాయల డబ్బులెక్కడివి. కొల్లు రవీంద్ర నీ దోపిడీ బందరును దాటి కృత్తివెన్ను వరకూ పాకింది.ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినడం మానేసి ఏం తిన్నాడో ఆధారాలతో చూపించబోతున్నా’అని హెచ్చరించారు.