
సాక్షి, గుంటూరు: గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు.. సినిమా డైలాగులు, పాటలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు. సినిమా డైలాగులు కొట్టినా.. పోస్టర్లు పెట్టినా కేసులు పెడుతున్నారు. సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? అలాంటప్పడు సినిమాలు తీయడం ఎందుకు?. అసలు సినిమా డైలాగులతో చంద్రబాబుకి వచ్చే నష్టం ఏంటి?. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో అంతకంటే దారుణమైన డైలాగులు ఉంటున్నాయి. మరి వాటి సంగతి ఏంటి?. ఇదేనా ప్రజాస్వామ్యం?..
ఏపీలో సినిమా డైలాగులను ప్రదర్శించారని.. ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. మరో 131 మందికి నోటీసులు ఇచ్చారు. రోజంతా పోలీస్ స్టేషన్‌లలో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఛార్జ్‌షీట్‌లో అదర్స్ అని పెట్టి.. వాళ్లకు కావాల్సిన వాళ్లను అందులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో మంచి చేసి మనసులు గెలుచుకుని తగ్గేదే లే(మేనరిజం ప్రదర్శించారు) అను. అది సత్తా. అంతేతప్ప అన్యాయమైన పాలన చేస్తూ .. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు.
