
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ శ్రేణులు బరితెగిస్తున్నారు. అధిష్టానం అనుమతిస్తే వైఎస్సార్‌సీపీ నేతల అంతు చూస్తామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తాజాగా,నందిగామలో టీడీపీ కార్యకర్త బెదిరింపులకు దిగాడు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకుల్ని చంపేస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. టీడీపీ అధిష్టానం అనుమతిస్తే 24 గంటల్లోనే వైఎస్సార్‌సీపీ నేతలను రప్పా రప్పా రంపంతో కోసేస్తాని కంచికచర్ల టీడీపీ కార్యకర్త అజయ్ వీడియోలు పోస్టు చేశాడు. ఆ వీడియోలపై వైఎస్సార్‌సీపీ నేతలు కంచికచర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. టీడీపీ కార్యకర్త అజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.