breaking news
-
వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
పులివెందులలో టీడీపీ రౌడీ రాజకీయాలు.. పోలీసులకు ముందే తెలుసు
పులివెందులలో బీసీ నేత.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ శ్రేణుల దాడికి పాల్పడడంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. జెడ్పీటీసీ ఉపఎన్నికలను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. పోలీసులకు తెలిసే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని అంటోంది.సాక్షి, విజయవాడ: పులివెందులలో టీడీపీ గూండాల దాడి ఘటనపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్సీపీ బుధవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి గాయపడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఓ వినతి పత్రం అందజేసింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.‘‘చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ బుద్ధి సన్నగిల్లుతోంది. పులివెందులకు టీడీపీ గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి చంపాలని చూశారు. అక్కడి పోలీసులకు తెలిసే ఇదంతా జరిగింది. పథకం ప్రకారమే చంపేందుకు ప్రయత్నించారు. ఏదోరకంగా రౌడీయిజం చేసి ఎన్నిక గెలవాలని చూస్తున్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదు. రేపు జగన్ వచ్చాక పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి’’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఏపీలో పోలీస్ యంత్రాంగం ఉందా?. టీడీపీ గుండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. కావాలనే వందల మందిని బైండోవర్ చేస్తున్నారు అని అన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అరాచకం,దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారు. పులివెందులలో టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు, అధికారులను చట్టం ముందు నిలబెడతాం అని అన్నారు.అంతకు ముందు.. పులివెందుల దాడి ఘటనను ఖండిస్తూ ఎన్నికల కమిషనర్ కార్యాలయం బయట వైఎస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పులివెందుల పౌరుషానికి సంబంధించిన ఎన్నిక ఇది: సతీష్‌రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎస్పీని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కలిశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి సంబంధించి కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.అనంతరం సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది పులివెందుల పౌరుషానికి సంబంధించిన ఎన్నిక. టీడీపీ నేతల ఆగడాలను అంతులేకుండా పోతోంది. దాడులకు పాల్పడుతూ మా శ్రేణులను రెచ్చగొడుతున్నారు. టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఏ క్షణంలోనైనా మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. తర్వాత మా కేడర్‌ను అరెస్ట్ చేయొచ్చు. మాపై దాడులు చేసినా.. మా ప్రాణాలు లేకుండా పోయినా.. మా ఆడవాళ్లు ముందరుండి ఎన్నిక నడిపిస్తారు. పులివెందుల మహిళల చేతుల్లో ఎన్నిక బాధ్యత పెడుతున్నాం. గ్రామాల్లో మగాళ్లను తరిమేసినా మా ఆడవాళ్లు ఎన్నికను గెలిపిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సురేష్ కుమార్‌రెడ్డి, అమరేశ్వర రెడ్డిపై దాడి అమానుషమన్నారు. వివాహానికి వెళ్తున్న వీరిపై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని చంపాలని అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులు దాడులు చేశారు. శాంతియుతంగా ఉన్న పులివెందులలో అరాచకాలు సృష్టిస్తున్నారు. పులివెందులలో భయాందోళనలకు గురి చేసేలా అల్లర్లు చేస్తున్నారు. దాడి చేసిన దుండగులపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు.‘‘ఇవాళ మళ్ళీ దాడులు చేసిన వాళ్లే ఉదయం రసూల్ అనే వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడికి ప్రయత్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఎటువంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై బైండోవర్ పెడతామని బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకుల మాట విని దాడులు చేస్తే చూస్తూ ఊరుకుని కూర్చునే వారు లేరు. గత ప్రభుత్వ హయాంలో అన్ని ఎన్నికలు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించారు. అనవసరమైన నిందలు, ఆరోపణలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారు...2019 నుండి 24 వరకు జగన్ సీఎం గా ఉండగా ఎప్పుడూ ఇలా జరగలేదు. టీడీపీ నాయకులు స్వేచ్చగా తిరగలేదా?. రాంగోపాల్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడితే ఎక్కడైనా గొడవలు జరిగాయా?. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మద్యం స్కాం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి అందరితో ఫోటోలు దిగారు. టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులతో అనేక ఫోటోలు ఉన్నాయి. కేవలం జగన్ తో ఫోటో దిగితే తమకు సంబంధించిన వ్యక్తి ఎలా అవుతాడు?. ఎల్లో మీడియా లో విష ప్రచారం తగదు. దుష్ప్రచారం తో ప్రజలను నమ్మించాలని చూస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా జగన్ పర్యటనకు తరలివస్తున్నారు’’ అని సతీష్‌రెడ్డి అన్నారు. -
పులివెందులలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్సార్సీపీ
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల్లో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూటమి సర్కార్ పట్టపగలే ఖూనీ చేసిందన్నారు. నల్లగొండువారిపల్లెలో ప్రభుత్వ అండతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. చివరికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై కూడా దాడికి దిగడం దారుణమని బొత్స అన్నారు.ఒక శాసనమండలి సభ్యుడికి పోలీసులు కనీస భద్రత కల్పించలేరా..?. వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముతో పాటు పలువురిపైన దాడులు చేశారు. వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి నిప్పంటిస్తామంటూ అరాచకం సృష్టించారు. టీడీపీ గూండాల దాడులకు పోలీసులు మద్దతిస్తున్నారా?. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.? నియంత పాలనలో ఉన్నామా.?’’ అంటూ బొత్స నిలదీశారు.‘‘సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహించాలి. పులివెందుల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో మేము ముందుగా చెప్పినట్లే టీడీపీ అరాచకాలు ప్రారంభమయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరుసగా బైండోవర్ కేసులు, కౌన్సిలింగ్ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను స్టేషన్లకు పిలిపిస్తున్నారు. మా వాళ్ళపై ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. పులివెందులలో హింస చెలరేగిపోతోంది’’ అంటూ రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం వైఎస్ జగన్‌ను ఓడించాం అని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న మా వాళ్లు పెళ్లికి వెళ్తే దాడులకు దిగారు. హత్యాయత్నం చేశారు. అందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలని ఓటింగ్‌కి రాకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 16 మందిపై హత్యాయత్నం కేసు పెట్టామన్నారు. వాళ్లను అరెస్ట్ చేశారా..?. దేనికోసం వారు ఈ దాడులకు దిగుతున్నారు అనేది బయటకు చెప్పాలి. వెంటనే వారిని రిమాండ్‌కి పంపండి. ఇవాల మరొక నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు....ప్రజాస్వామ్యంలో ఇది సక్రమమైన పద్ధతేనా..? ప్రజలు దీన్ని హర్షిస్తారా..?.. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి..?. రానున్న రోజుల్లో హత్యలు కూడా చేయడానికి వెనుకాడరు. ఈ హింసను ప్రజలు, పులివెందుల ఓటర్లు గమనించాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. మొత్తం టీడీపీ బ్యాచ్ పులివెందులలోనే ఉంది’
సాక్షి, పులివెందుల: పులివెందులలో ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే టీడీపీ అసహనానికి గురైంది. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసింది. సూపర్ సిక్స్, సెవెన్ పేరుతో ప్రజలకు నిండా ముంచారు. ఉప ఎన్నికల్లో గెలివలేరని కూటమికి అర్థమైంది. అందుకే కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లు, వైఎస్సార్సీపీ కార్యకర్త పెళ్లికి వెళ్తే దాడి చేశారు. వాళ్లపై కేసులు నమోదైనా.. మరోసారి దాడికి యత్నించారు. ఉప ఎన్నిక సజావుగా జరగకుండా చూడాలని కూటమి కుట్ర చేస్తోంది. జిల్లా మొత్తం నుంచి టీడీపీ కార్యకర్తలు పులివెందులలో దిగారు. వైఎస్సార్సీపీ నాయకులను కావాలనే బైండోవర్ చేస్తున్నారు.ఎన్నిక నిర్వహిస్తున్నది ఎన్నికల సంఘమా? లేక ప్రభుత్వమా?. పులివెందుల ప్రజలు ఎంతో తెలివైన వాళ్లు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని గెలిపిస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సంయమనం పాటించాలి. పోలీసులు బెదిరించి మరీ పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించారు. ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేశారు. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేశారు అని ఆరోపించారు. -
బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు!
‘చంద్రబాబు.. మీ మోసం మరోసారి రుజువైంది’ అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల సందర్భంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి తమ ‘సూపర్ సిక్స్’ హామీల్లో ప్రకటిస్తే.. పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు కేవలం ఐదు వేల చొప్పున పంపిణీ చేయడంపై జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పైగా.. ‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలనూ తప్పుపట్టారు. మాటిచ్చి తప్పడం చంద్రబాబుకు ఇదేమీ కొత్త కాదు. గతాన్ని చూస్తే ఇలాంటి సంఘటనలు బోలెడు కనిపిస్తాయి. కానీ, బాబు తప్పిదాలను కప్పిపుచ్చేందుకు ఎప్పటికప్పుడు కలరింగ్ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నాడూ అనే అభిప్రాయం కలిగించేలా చేసేందుకు ఆయన వ్యాఖ్యలను హైలైట్ చేస్తున్నారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదెవరూ? ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు, బొంకులతో మాట తప్పింది ఎవరన్నది రైతులకు తెలియదా?.జగన్ ప్రభుత్వం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.13,500 క్రమం తప్పకుండా చెల్లించిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పినదాని కంటే ఒక ఏడాది ఎక్కువగానే ఇచ్చింది కూడా. అయినా ఆ రోజుల్లో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించేవారు. కేంద్రమిస్తున్న నిధులను కూడా తన పథకంలోకి కలిపి ఎలా ఇస్తారని ప్రశ్నించే వారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చే సాయంతో దీనికి సంబంధం లేదన్నట్లే చెప్పారు. 2014లో రూ.89వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి రూ.15 వేల కోట్లతో సరిపెట్టిన విషయంపై రైతుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఈసారి మాట తప్పరేమో అనుకుని ఉండవచ్చు. కానీ ఆయన తీరేమీ మారలేదు. తొలి ఏడాది పెట్టుబడి సాయం మొత్తం ఇవ్వలేదు. రెండో ఏడు కూడా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. ఈ విషయాన్ని తరచూ ప్రస్తావిస్తున్న ప్రతిపక్ష నేతకు అడ్వాంటేజ్ వస్తుందేమో అన్న బెంగతో అరకొర అమలుకు సిద్ధమయ్యారు. ఇదే పూర్తి సాయం అన్న బిల్డప్‌కు తెరలేపారు.‘తల్లికి వందనం’ తీరులోనే ‘అన్నదాత సుఖీభవ’ లోనూ ఏడు లక్షల మందిని తగ్గించారని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాక ఇరవై వేల బదులు రూ.14 వేలే ఇస్తామని ప్రకటించారు. ఆరు వేల చొప్పున కోత పెట్టారన్నమాట. దీన్ని మాట నిలబెట్టుకోవడం అంటారా? కాకపోతే చంద్రబాబు ఏ అసత్యాన్ని అయినా అలవోకగా చెప్పగల నేర్పరి. కూటమి ఎన్నికల ప్రణాళికనూ, ప్రభుత్వం అమలు చేసిన వాటిని పోల్చి చూస్తే ఈ విషయం తేలికగా తెలిసిపోతుంది. తల్లికి వందనం స్కీమ్ తర్వాత అన్నీ అమలు చేసేశామని, ఇంకెవరైనా అమలు కాలేదంటే నాలుక.. అంటూ వెంటనే సర్దుకుని మందం అనుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలలో కోత పెట్టినా, ఒక ఏడాది ఎగ్గొట్టినా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని చంద్రబాబు చెప్పగలిగారు. నిజాయితీగా వ్యవహరించి ఉంటే.. ఇంత ఇవ్వాలని అనుకున్నాం.. కానీ అలా చేయలేకపోతున్నాం.. మన్నించాలని అడుగుతారు. అలా మాట్లాడకపోతే మానే.. అంతా చేసేసినట్లు మభ్య పెట్టాలని అనుకోవడమే చంద్రబాబు స్పీచ్ హైలైట్. దీనిని దృష్టిలో ఉంచుకునే జగన్ తన ప్రకటనలో చంద్రబాబు మోసం మరోసారి నిజమైందని అన్నారు.ఒక్కో రైతుకు ఇప్పటికి రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం ఐదు వేలే అని వ్యాఖ్యానించారు. వచ్చే రోజుల్లో మిగిలిన తొమ్మిది వేలు ఇచ్చినా రూ.26 వేల వరకు రైతులకు బాకీ పడినట్లే అవుతుంది కదా!. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో కొన్ని వింతలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన సభలో నులక మంచాలు వాడారట. వాటిపై చంద్రబాబు కూర్చున్నారట. ప్రజలూ అలాగే చేశారట. ఇది సింప్లిసిటీ అనుకోవాలన్నది వారి లక్ష్యం కావచ్చు. కాని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నులక మంచాల దశకు తీసుకువెళ్లిందన్న విమర్శలకు ఆస్కారం ఇచ్చారని కూడా భావించవచ్చు. నిత్యం హెలికాప్టర్లో చిన్న, చితక కార్యక్రమాలకు కూడా కోట్లు ఖర్చు చేస్తూ అటెండ్ అవుతుండే చంద్రబాబు నులక మంచంపై కూర్చుంటే రైతులకు ఒరిగేది ఏం ఉంటుంది. వారికి ఇవ్వవలసిన గత ఏడాది బకాయి రూ.20 వేలు ఇచ్చి ఉంటే రైతులు కూడా శభాష్ అని ఉందురు కదా!.మరో సన్నివేశం ఏమిటంటే చంద్రబాబు హెలికాఫ్టర్ దిగి ఆటోలో ప్రయాణించడం. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఆటో డ్రైవర్‌తో ఐటీ గురించి కూడా మాట్లాడించడం, కెమెరాల కోసం చేతులు ఊపుతూ వెళ్లడం అంతా తమాషాగా ఉంది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారంటే అది మనం చూపిన చొరవ అని అనడంలో కొందరైనా నమ్మకపోతారా అన్న భావన ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడితే నవ్వుల పాలు అవుతామన్న సంగతిని విస్మరిస్తున్నారు. చంద్రబాబు ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా బడ్డి కొట్టు వద్దకో, సెలూన్ షాప్ వద్దకో వెళ్లి సామాన్యులను పలకరిస్తున్నారు. అది తప్పు కాదు. కానీ, ముందస్తు ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం వల్ల అదంతా షోగా మారుతోందే తప్ప, వాస్తవ పరిస్థితి తెలుసుకునే ఆలోచన ఉన్నట్లు అనిపించదు.టీడీపీ మీడియా ఆహో, ఓహో అని భజన చేయవచ్చు. నిప్పులు చెరుగుతున్న ఎండలో చంద్రబాబు కూర్చున్నారని, భారీ వేదికలు లేవని, షామియానాలు లేవని గొప్ప విషయంగా ప్రచారం చేశారు. నిజమే.. ఇకపై అన్ని కార్యక్రమాలు ఇలాగే ప్రభుత్వానికి ఖర్చు లేకుండా చేస్తారని కూడా ఈ మీడియా గ్యారంటీ ఇచ్చి ఉండాల్సింది. పెంచిన వెయ్యి ఫించన్ ఇవ్వడం కోసం లక్షల రూపాయల వ్యయం చేస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రచారార్భాటాన్ని కూడా టీడీపీ మీడియా ఆపగలిగితే మెచ్చుకోవచ్చు. ఇక యథా ప్రకారం వైఎస్సార్సీపీపై బురద చల్లుడు కూడా చంద్రబాబు సాగించారు. మహిళలపై వైఎస్సార్సీపీ వారు దౌర్జన్యాలు చేశారని, పార్టీ కార్యకర్త కాన్వాయ్ కింద పడితే పొదల్లో పడేశారనో, ఇంకా ఏవేవో వ్యాఖ్యలు చేసి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుంటున్నారు.టీడీపీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరించడం పద్దతి అనిపించదు. వైఎస్సార్సీపీ మహిళా నేతలపై కొందరు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచక వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నవారిపై కనీసం కేసులు పెట్టకుండా ఉంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనాలా? లేక కొందరి కోసమే పని చేసే ప్రభుత్వం అనుకోవాలా?. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పులివెందులలో పచ్చ అరాచకం.. వైఎస్సార్సీపీ నేతలపై బైండోవర్
సాక్షి,వైఎస్సార్: పులివెందులలో పచ్చ నేతల అరాచకం తారాస్థాయికి చేరుకుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తాము ఓడిపోతామనే అసహనానికి గురైంది. అధికారబలాన్ని ఉపయోగించి వైఎస్సార్సీపీ కీలక నాయకులను అరెస్ట్ చేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తోంది.ఎటువంటి కేసులు లేకపోయినా కావాలని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. నల్లపురెడ్డిపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ అంటూ స్టేషన్‌కు తరలించింది. మంగళవారం ఎన్నిక జరిగే పులివెందుల మండలానికి సంబంధం లేని లింగాల రామలింగారెడ్డిపై కేసులు లేకపోయినా బైండోవర్ నమోదు చేసింది. ఇలా ఈ రెండు రోజుల్లోనే 100 మందికి పైగా వైఎస్సార్సీపీ నాయకులను బైండోవర్ చేసింది. మరో వైపు కూటమి శ్రేణులు.. వైఎస్సార్సీపీ నేతలపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారు. వివాహానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి చేశారు. హత్యా యత్నానికి ప్రయత్నించారు. కాగా, పులివెందులలో విచ్చలవిడిగా టీడీపీ మూకలు చెలరేగిపోతున్నా .. పోలీసులు కట్టడి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబూ.. నేను ఎమ్మెల్యేను!
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ (జనసేన పార్టీ)కి మంగళవారం దుర్గగుడిలో చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లు ఆయన ఆలయ అధికారులకు, ప్రొటోకాల్‌కు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో కారులో ఘాట్‌రోడ్డు మీదగా ఓం టర్నింగ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే కారును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొటోకాల్ నుంచి సమాచారం లేనందున అక్కడే కారు నిలుపుకోవాలని డ్రైవర్‌కు సూచించారు. కారులో ఎమ్మెల్యే ఉన్నారని డ్రైవర్ చెప్పినా సిబ్బంది వినలేదు. దీంతో ఎమ్మెల్యే కారు అద్దం కిందకు దింపి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతలో విషయం తెలుసుకున్న ప్రొటోకాల్ అధికారులు సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించడంతో వారు కారును సమాచార కేంద్రం వరకు అనుమతించారు.దీంతో, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది నిర్వాకంపై మండిపడ్డారు. ఆలయ ఈవో శీనానాయక్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగక తాను ఈ అంశాన్ని తేలికగా తీసుకోనని, ఆలయ ప్రొటోకాల్‌లో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా నివేదన అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించినా ఆయన శాంతించలేదు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు: వైఎస్ జగన్
ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బ తిన్న వాళ్ల గురించి. కళ్ల ఎదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే, వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. అలా వరసగా కేసులు పెట్టి.. జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం. మీ సేవలను గుర్తుంచుకుంటాం. – న్యాయవాదులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చోటుచేసుకున్న పరిస్థితులపై మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులున్నాయి’. ఈ సమయంలో మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా వరమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం’ అని ప్రశంసించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..స్వరం వినిపిస్తే జీర్ణించుకోలేని పరిస్థితి తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బురద చల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య బా«ధితుల తరఫున గట్టిగా నిలబడి, వారి స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మీ పాత్ర చాలా ముఖ్యం. మన భుజాల మీద బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్సార్సీపీకి పెద్దన్నగా మీ పాత్రను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు.నాడు లీగల్ కమ్యూనిటీకి ఎంతో మేలుగతంలో మనం (వైఎస్సార్సీపీ ప్రభుత్వం) లాయర్లు, లీగల్ కమ్యూనిటీకి ఏం చేశామనేది నా కంటే, మీరే బాగా చెబుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా యువ న్యాయవాదులకు ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ‘లా నేస్తం’ ఇచ్చాం. అలా యువ లాయర్లకు అండగా, తోడుగా నిలిచాం. నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాలని, జీపీలు, ఏజీపీల నియామకాల్లో 52% రిజర్వేషన్ ఇచ్చాం. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించి, అందులో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. లాయర్ల ఇన్సూరెన్స్ పథకానికి కూడా మూడో వంతు ప్రభుత్వమే చెల్లించింది. ఇవన్నీ అప్పట్లో గర్వపడే విధంగా చేశాం. అయితే కూటమి ప్రభుత్వంలో చివరకు లాయర్లను కూడా మోసం చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ ఏవీ లేవు. అంతా మోసం. మన ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. వారి హామీలు మోసాలుగా మారాయి. మరోవైపు అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగం, శాంతి భద్రతలు ఇంకా పరిపాలనలో పారదర్శకత.. ఏది తీసుకున్నా అన్నీ అస్తవ్యస్తం. అన్నింట్లో తిరోగమనం. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.విచ్చలవిడిగా అవినీతి రాష్ట్రంలో అవినీతి మామూలుగా లేదు. విచ్చలవిడిగా సాగుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. ఎక్కడ చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు. అక్కడ బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. అదీ చట్ట విరుద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే. ఇసుక ఫ్రీ అన్నారు. కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాట క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పలువురు సీనియర్ న్యాయవాదులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.అమరావతి నిర్మాణంలో యథేచ్ఛగా దోపిడీఅమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4,500కు లగ్జరీగా ఎక్కడైనా బ్రహ్మాండంగా కట్టొచ్చు. ఆ రేటుకు హైదరాబాద్, బెంగళూరులోనూ కట్టొచ్చు. కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9,500, రూ.10 వేలకు ఇచ్చారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజం. ఇంకా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ)లోనూ అవినీతి. మనం యూనిట్ రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, అప్పుడు మనపై బురద చల్లారు. ఆ తర్వాత వాళ్లు అదే యూనిట్ విద్యుత్‌కు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతే. ఏ పని చేయాలన్నా, కంపెనీ నడపాలన్నా, మైనింగ్ చేయాలన్నా, గ్రావెల్ తరలించాలన్నా ముందు ఎమ్మెల్యేను కలవాలి. లంచం ఇవ్వాలి. వారు కొంత తీసుకుని, పైకి కొంత పంపిస్తారు. ఇన్ని మోసాలు, దారుణాలు చేస్తున్న వారికి దేవుడు తప్పక బుద్ధి చెబుతాడు. తంతే ఎక్కడ పడతారో.. వాళ్లకూ తెలియదు.వారిని చట్టం ముందు నిలబెడతాం⇒ ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోము. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం. త్వరలోనే ఒక యాప్ వస్తుంది. దాని తయారీలో సీనియర్ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. ⇒ రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైఎస్సార్సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్ ఓపెన్ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. ⇒ దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అందుకే లాయర్ల ద్వారా ఆ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యం. పెద్దన్న మాదిరిగా లాయర్లు తోడుగా ఉండాలి. లాయర్ల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మహిళా విభాగంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. ఐదు జోన్లకు ఐదుగురు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించింది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఈర్లి అనురాధ.. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు వంగా గీత.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఉప్పాల హారిక.. ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కాకాణి పూజిత.. వైఎస్సార్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎస్.వి.విజయమనోహరి నియమితులయ్యారు. -
జనసేన వర్సెస్ టీడీపీ రగడ..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్‌మోడల్ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ హాట్‌టాపిక్‌గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్‌తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ రగడ హాట్ హాట్‌గా మారింది. జనసేన భవితవ్యం గందరగోళం జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్‌తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్‌మోడల్‌గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నా టీడీపీ లైట్‌గా తీసుకుంది. టీడీపీ ట్రాప్‌లో కరాటం మరోవైపు టీడీపీ ట్రాప్‌లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పారీ్టపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కార్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసేలా విజయవంతంగా మైండ్ గేమ్ నడిపింది. -
తప్పుడు సాక్ష్యాలతో కేసులు.. బాబు పాలనంతా అన్యాయమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం.. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ, తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు అంటూ హమీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం.బెదిరింపులతో తప్పుడు కేసులు.. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. మన ప్రభుత్వం హయాంలో మనం అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా ఉన్నాం. అట్టడుగు వర్గాలకు తోడుగా నిలిచాం.జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాం. న్యాయవాదుల సంక్షేమ నిధికోసం రూ.100 కోట్లు కేటాయించాం. ఇన్సూరెన్స్ కోసం 1/3 వాటాగా మన ప్రభుత్వమే ఇచ్చింది. ఇన్ని రకాలుగా మనం న్యాయవాదులకు మేలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాదిరిగా న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలు, మోసాలే. అన్ని రంగాల్లో తిరోగమనమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పురోగతి, అభివృద్ధి అన్నవి కనిపించడం లేదు. అవినీతి విచ్చలవిడిగా ఉంది.పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు..జగన్ 2.Oలో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలి.లిక్కర్లో భారీగా అవినీతి.. లిక్కర్లో అవినీతి విపరీతంగా ఉంది. ఎంఆర్పీ రేట్లకు మించి అమ్ముతున్నారు. ప్రతీ గ్రామంలోనూ వీధికి ఒక బెల్టుషాపు ఉంది. బెల్టుషాపులకూ వేలం వేస్తున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ కూడా ఎమ్మార్పీ రేట్లు కన్నా అధికంగా అమ్ముతున్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోంది?. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు.అమరావతిలో కమీషన్ దందా..అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోంది. చదరపు అడుగుకు రూ.4వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చు చేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మనం రూ. 2.49లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రూ.4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారు. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్ల ముందే కరప్షన్ కనిపిస్తోంది అని ఆరోపించారు. -
సూత్రధారి చంద్రబాబే
సాక్షి, అమరావతి : ‘అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలే అన్నీ’ అని ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ పాపులర్ డైలాగ్ ఉంటుంది.. ‘స్వార్థం అన్నది నిజం.. నిస్వార్థం దాని కవచం’ అని కూడా చెబుతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అక్రమ కేసు నాటకం అంతకు మించిన కుట్ర స్క్రిప్ట్‌తో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు వివిధ పాత్రలు హఠాత్తుగా తెరపైకి వస్తున్నాయి. అన్నీనూ చంద్రబాబు తన అవసరాల కోసం ప్రవేశ పెడుతున్న పాత్రలే. హఠాత్తుగా నోట్ల కట్టలు ప్రత్యక్షం అవుతున్నాయి.. ఆడియోలు, వీడియోలు ఎల్లో మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కానీ న్యాయస్థానం క్రియాశీలత, అదే ఆడియో వీడియో ఆధారాలతో ఆ కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఈ రెడ్‌బుక్ కుట్ర నాటకంలో విలన్ మాత్రం కచ్చితంగా చంద్రబాబేనన్నది అంతిమంగా నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు వేధింపులు బెడిసి కొడుతున్నాయి. దాదాపు ఏడాదిగా సీఐడీ, సిట్లు దర్యాప్తు ముసుగులో వేధింపులకు పాల్పడుతున్నా, ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. దాంతో న్యాయస్థానాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సిట్ చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారు. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు తన రెడ్‌బుక్ కుట్ర నాటకంలో కొత్త పాత్రధారులను పక్కా పన్నాగంతో ప్రవేశ పెడుతున్నారు. టీడీపీ మూలాలు ఉన్న వారు, సీనియర్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు, తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా లబ్ధి పొందిన వారిని ఏరికోరి తెరపైకి తెస్తున్నారు. వారందరినీ వైఎస్సార్సీపీ నేతలకు సన్నిహితులుగా ముద్ర వేస్తూ.. టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. అందుకోసం టీడీపీ వీర విధేయ సిట్ అధికారులే స్వయంగా నోట్ల కట్టల జప్తు డ్రామాకు పాల్పడుతున్నారు. తద్వారా పాత్రధారులు టీడీపీ వర్గీయులే.. నోట్ల కట్టలు టీడీపీ వర్గీయులవే.. సిట్ అధికారులూ టీడీపీ వీర విధేయులే.. సూత్రధారి చంద్రబాబేనని స్పష్టమవుతోంది. అయితే ఇంత చేసినా, టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా కుట్రలు కూడా బెడిసికొట్టాయి. సిట్ తాజాగా తెరపైకి తెచ్చిన వారందరూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలకు అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా బట్టబయలైన వైనం ఇలా ఉంది. టీడీపీ కేంద్రమంత్రులు, ఎంపీలు కూడా దగ్గరివారే.. టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ, ఏలూరు ఎంపీలు భరత్, పుట్టా మహేష్‌తో వెంకటేశ్ నాయుడు (ఫైల్) టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడే తీగల విజయేందర్‌రెడ్డి ⇒ మద్యం విధానంపై అక్రమ కేసులో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సేకరించని సీఐడీ, సిట్.. వారం రోజుల క్రితం ఒక్కసారిగా హడావుడి చేశాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు జప్తు చేసినట్టు కనికట్టు చేసింది. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆ ఫామ్‌హౌస్‌లో 2024 జూన్‌లో ఆ నగదును దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చింది. సిట్ అధికారులే ఆ రూ.11 కోట్లు తెప్పించి ఈ జప్తు కట్టుకథ వినిపించారు. ⇒ ఈ హైడ్రామాకు సిట్‌కు పూర్తిగా సహకరించింది వర్దమాన్ ఇంజినీరింగ్ కాలేజి యజమాని తీగల విజయేందర్ రెడ్డి. తమ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన రూ.11 కోట్లను అట్ట పెట్టెల్లో అదే కాలేజీకి ఎదురుగా ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో పెట్టించారు. అనంతరం ఆ నగదునే సిట్ జప్తు చేసినట్టు కథ నడిపించారు. ఇంతగా విజయేందర్ రెడ్డి ఈ కుట్రలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు సహకరించారని సందేహం రావచ్చు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ తరఫున హైదరాబాద్ మేయర్‌గా, ఎమ్మెల్యేగా చేసిన తీగల కృష్ణా రెడ్డి సోదరుని కుమారుడు. ⇒ తీగల విజయేందర్ రెడ్డికి చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు టీడీపీ సీనియర్ నేతలతో, టీడీపీ అనుకూల మీడియా అధిపతులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ రెడ్‌బుక్ కుట్ర కేసు వీగిపోతోందన్న ప్రమాద ఘంటికలు మోగగానే చంద్రబాబు పక్కా పన్నాగంతో విజయేందర్ రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సహకారంతోనే రూ.11 కోట్ల నగదు జప్తు డ్రామాకు సిట్ పాల్పడింది. ⇒ కాగా, ఆ నగదును ఆర్బీఐతో తనిఖీ చేయించాలని రాజ్ కేసిరెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే ఆర్బీఐ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే.. ఆ నోట్ల కట్టల మీద ఉన్న బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లు ఏమిటన్నది వెల్లడవుతుంది. ఆ నోట్లను ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది.. వాటిని ఎవరు, ఎప్పుడు డ్రా చేశారు.. ఏ బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేశారన్న వివరాలు వెలుగులోకి వస్తాయి. ⇒ 2024 జూన్ తర్వాత ఆ నోట్ల కట్టలు అన్నీ గానీ, వాటిలో కొన్నిగానీ ముద్రించినట్టు వెల్లడైతే.. సిట్ చెప్పింది అంతా కట్టుకథేనని తేలి పోతుంది. ఆ నోట్లను 2024 జూన్ తర్వాత ఏదైనా బ్యాంకు నుంచి డ్రా చేశారని నిగ్గు తేలితే.. ఆ బ్యాంకు ఖాతాదారుడు ఎవరన్నది వెలుగులోకి వస్తుంది. దాంతో ఈ జప్తు కట్టుకథ వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర బట్టబయలవుతుంది.⇒ అందుకే ఆ నోట్ల కట్టలను న్యాయస్థానం అనుమతి లేకుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో డిపాజిట్ చేసేయాలని సిట్ అధికారులు యత్నించారు. కాగా రాజ్ కేసిరెడ్డి పిటిషన్‌పై సత్వరం న్యాయస్థానం స్పందించడంతో సిట్ కుట్ర విఫలమైంది. ఆ నోట్ల కట్టలను విడిగా భద్రపరచాలని.. బ్యాచ్ నంబర్లు, సీరియల్ నంబర్లతో సహా పంచనామా నిర్వహించాలని.. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో రూ.11 కోట్ల జప్తు హైడ్రామాతో కనికట్టు చేయాలన్న చంద్రబాబు కుట్ర పూర్తిగా బెడిసి కొట్టింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటేశ్ నాయుడు (ఫైల్) లోకేశ్ బినామీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామే రాజ్ కేసిరెడ్డి⇒ లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే ఈ భేతాళ కుట్ర కథకు చంద్రబాబు పక్కాగా స్క్రిప్ట్ రచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా కేవలం రెండేళ్లపాటు చేసిన రాజ్ కేసిరెడ్డికి ముడి పెడుతూ ఈ అక్రమ కేసు నమోదు చేశారు. తాము చెప్పమన్నట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. విచారణలో రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు కూడా చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించారు. కానీ ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి తిరస్కరించారు. ఆ విషయాన్ని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికే వెల్లడించింది. ⇒ అసలు రాజ్ కేసిరెడ్డిని ఈ కపట నాటకంలో ప్రధాన పాత్రధారిగా చేసుకోవాలని చంద్రబాబు ఎందుకు భావించారంటే.. రాజ్ కేసిరెడ్డి.. మంత్రి నారా లోకేశ్ బినామీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కనుక. కేశినేని చిన్ని లోకేశ్ బినామీ అన్నది బహిరంగ రహస్యమే. ⇒ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘ప్రైడే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని ప్రస్తుతం సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామా(జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. ⇒ ఈ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ ( accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. లోకేశ్ తన బినామీ అయినందునే కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిని చేశారు. ⇒ కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖపట్నంలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. కేశినేని చిన్ని ముసుగులో లోకేశ్ ఇలా దోపిడీకి పాల్పడుతున్నారు. అటువంటి కేశినేని చిన్నితో రాజ్‌కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి. అంటే బినామీ దందా ముసుగు తొలగిస్తే లోకేశ్, రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వాములు అన్నది స్పష్టమవుతోంది. పారని బాబు తాజా పాచిక⇒ అయినా సరే పట్టు వదలని చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా మరో కట్టుకథను వ్యాప్తిలోకి తెచ్చారు. వెంకటేశ్ నాయుడు చార్టెడ్ విమానాల్లో ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియోలు, హీరోయిన్ తమన్నా పక్క సీట్లోనే కూర్చున్న ఫొటోలు ఎల్లో మీడియాకు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన డబ్బుతోనే వెంకటేశ్ నాయుడు ఇంతటి జల్సాలు చేశారని.. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారని రకరకాల కట్టు కథలను టీడీపీ సోషల్ మీడియాతోపాటు టీడీపీ అనుకూల ఎల్లో మీడియా వినిపించింది. ⇒ కానీ ఈ కుట్ర పాచిక కూడా విఫలమైంది. ఎందుకంటే వెంకటేశ్ నాయుడు చంద్రబాబు, లోకేశ్‌లకు అత్యంత సన్నిహితుడన్నది ఫొటో ఆధారాలతోసహా బట్టబయలైంది. వారిద్దరికి ఆయన అత్యంత సన్నిహితుడనే నిజాన్ని ఆ ఫొటోలు బయటపెట్టాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ తరఫున కేంద్ర మంత్రులుగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతోపాటు పలువురితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో మొత్తం కుట్ర డ్రామా బట్టబయలైంది. ⇒ వెంకటేశ్ నాయుడు ప్రయాణించిన చార్టెడ్ ఫ్లైట్ ఎవరిదో తెలుసా.. చంద్రబాబు బీజేపీలోకి పంపిన నేత, ప్రస్తుత ఎంపీ సీఎం రమేశ్ కంపెనీది. టీడీపీ నేతలతో కలిసే వెంకటేశ్నాయుడు ఆ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి చెన్నై, కోయంబత్తూరు తదితర నగరాలకు వెళ్లారు. హీరోయిన్ తమన్నా కూడా అదే ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. కానీ టీడీపీ నేతలతో వెంకటేశ్ నాయుడు ఉన్న ఫొటోలు కాకుండా తమన్నా పక్క సీట్లో కూర్చున్న ఫొటోనే సిట్ విడుదల చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కానీ పూర్తి ఫొటోలు బయట పడటంతో సిట్ కుట్ర బెడిసి కొట్టింది.చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితుడే వెంకటేశ్ నాయుడు⇒ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్ల జప్తు హైడ్రామా విఫలమవడంతో చంద్రబాబు మరో దుష్ప్రచార కుతంత్రం రచించారు. ఈ కుట్ర కేసులో మరో పాత్రధారిగా వెంకటేశ్ నాయుడు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన హైదరాబాద్‌లో రూ.5 కోట్ల నగదును పరిశీలిస్తున్న వీడియోలను టీడీపీ అనుకూల మీడియాకు లీక్ చేశారు. ఆ రూ.5 కోట్లు నగదు అంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం డబ్బులేనని... 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకే హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం చేసినవని ప్రజల్ని నమ్మించేందుకు యత్నించారు. ⇒ కాగా, ఆ రూ.5 కోట్లలో 2023 మే లోనే ఆర్బీఐ ఉపసంహరించిన రూ.2 వేల నోట్ల కట్టలు ఉండటాన్ని పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో ఆ వీడియో 2023 మే కంటే ముందు తీసిందేనని స్పష్టమైంది. తద్వారా 2024 ఎన్నికల్లో వెచ్చించేందుకు వైఎస్సార్సీపీ ఆ నోట్లను తరలించడం అంతా కనికట్టేనని తేటతెల్లమైంది. మరోవైపు వెంకటేశ్ నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన వ్యాపార వ్యవహారాలకు చెందిన నగదును వైఎస్సార్సీపీకి ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడిందన్నది బట్టబయలైంది. -
‘ మేం బెదిరించి ఉంటే రికార్డింగ్ చూపించండి’
వైఎస్సార్ జిల్లా: ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ బీటెక్ రవి, శ్రీనివాసులురెడ్డి, ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్లో ఏవో మాట్లాడుతున్నారు. నిన్న పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. నేడు అతనితో మేము బెదిరించినట్లు పోలీసులకు పిర్యాదు చేయించారు. జగన్ గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదం. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి వైఎస్ జగన్. నూటికి నూరు పాళ్లు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరగాలని కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్. ఉప మండలాధ్యక్షుడ్ని లోబరుచుకుని ఇలా చేస్తున్నారు. ఎవరు బెదిరించారు అనేది రికార్డింగ్ చేసింది చూపండి. మేము పదవి ఇచ్చిన వారు ఇతర పార్టీలోకి వెళ్తుంటే మాట్లాడటం తప్పేలా అవుతుంది. బెదిరింపు వేరు..బుజ్జగింపు వేరు. మా పార్టీ నేతను మా మేము బుజ్జగించే ప్రయత్నం చేశాము. నిజంగా బెదిరించి ఉంటే రికార్డింగ్ చూపండి. ఒక దురుద్దేశంతో ఇలా చేసి బెయిల్ పై ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చెప్తున్న ఉప మండలాధ్యక్షుడు మా అభ్యర్థి నామినేషన్ లో కూడా పాల్గొన్నాడు. మీరు అతన్ని లోబరుచుకుని ఇలా చేయడం మీ నైజానికి నిదర్శనం’ అని మండిపడ్డారు. -
నేను నవ్వినందుకు కేసు పెట్టారు
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్‌తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు. కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. -
లిక్కర్ కేసు.. వెంకటేష్ నాయుడు పచ్చదొంగే!
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్‌కు వైఎస్సార్సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.టీడీపీ నాయకులతోనే సంబంధాలువెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది. -
‘లోకేశ్‌కు సీఎం పదవి.. చంద్రబాబు ఇంట్లో గొడవలు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారని విమర్శలు చేశారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేశ్ ఇంట్లో గొడవలు పెడుతున్నాడు. కుటుంబ కలహాలు పెరిగాయి. లోకేశ్‌ను అందుకే చంద్రబాబు పొగుడుతున్నారు. సరిగ్గా చదువుకోని లోకేశ్‌ను మంత్రిని చేశారు. చంద్రబాబును మించిన అవినీతిపరుడు లోకేశ్. చంద్రబాబు ప్రతీ విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు. ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకర్లకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా చంద్రబాబు డబ్బులు పంపుతున్నారు. పదే పదే 90 దేశాలు అంటూ చంద్రబాబు మాట్లాడే మాటల వెనుక చాలా కథ ఉంది. అందుకే రామోజీకి భూమి.. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించిందిఅందుకే ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం దూరం పెట్టింది. కుట్రలు పన్నటంలో చంద్రబాబును లోకేశ్ మించి పోయాడు. ఇప్పుడు లోకేశ్ భజన చేయటంలో ఎల్లో మీడియా పోటీ పడుతోంది. పత్రికలను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ మనుషులను పార్టీకి దూరం చేశారు. తనకు ఇష్టమైన వారిని దగ్గర చేర్చుకుని, ఎన్టీఆర్ టీమ్‌ని వెళ్లగొట్టారు. తాను అడిగిన వందలాది ఎకరాల భూమిని రామోజీరావుకు ఎన్టీఆర్ ఇవ్వలేదు. ఆ కోపంతో ఉన్న రామోజీరావుని చంద్రబాబు దగ్గరకు చేర్చుకున్నారు. ఆ తర్వాత నుండి చంద్రబాబు తన కుట్రలకు మరింత పదును పెట్టారు. అన్నింటా బాబు మనుషులే..ఎన్టీఆర్ గెలుపు వెనుక నేను ఉన్నానని నాపై కుట్రలు పన్నారు. నన్ను రాజ్యాంగేతర శక్తి అంటూ నాపై ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిల్‌గేట్స్‌ని మించిన ధనవంతుడ్ని కావాలని చంద్రబాబుకు కోరిక ఉండేది. అందుకే విపరీతమైన అవినీతి, అక్రమాలు, కుట్రలు చేస్తూ వస్తున్నారు. పరిపాలన చేతగాని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బతుకుతున్నారు. తండ్రిని మించిన అవినీతిలో లోకేశ్ మునిగి పోయారు. ఇసుక, మద్యంలో తండ్రీ కొడుకుల అవినీతి తారాస్థాయికి చేరింది. ఇక్కడ సంపాదించిన డబ్బంతా సింగపూర్‌లో పెట్టుబడి పెడుతున్నారు. సీబీఐ, ఈడీ సహా అనేక న్యాయ వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారు. తాము దోచుకున్న డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం ఎంతోకాలం నిలవదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
గోడకు కొట్టిన బంతిలా.. తిరగబడ్డ నెల్లూరు!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం నేర్పి ఉండాలి. వైఎస్సార్సీపీ పార్టీకి కూడా ఇదో అనుభవం అని చెప్పాలి. పోలీసుల వ్యవస్థ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తే ప్రజల్లో వచ్చే తిరుగుబాటు ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా తెలియజేసినంది. ఒక నాయకుడి పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు (రోడ్లు) ధ్వంసం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు కూడా. ప్రజాస్వామ్యాన్ని ఇంతగా పరిహాసం చేసిన సందర్భం కూడా ఇంకోటి ఉండదు. వైఎస్ జగన్ తన మీడియా సమావేశంలో వ్యక్తిగత విమర్శలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, తను ఏ సందర్భంలో టూర్‌కు వచ్చిందీ, పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ కార్యకర్తల విధ్వంస కార్యక్రమాలు వాటి విపరిణామాలపై ఎక్కువ మాట్లాడారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన జమ్మలమడుగు పర్యటనలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అసలు మినహా మిగిలిన సోదంతా వెళ్లబోసుకున్నారు. 👉జైల్లో ఉన్న మాజీ మంత్రి, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు, మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన్ను కూడా పలుకరించే ఉద్దేశంతో జగన్ నెల్లూరులో పర్యటనకు సంకల్పించారు. గత నెల మొదటిలోనే ఈ పర్యటన ఖరారైనా హెలిప్యాడ్ కోసం పోలీసులు ఒక అటవీ ప్రాంతాన్ని చూపించడంతో వాయిదా పడింది. ఆ ప్రదేశంలోనే ఒక చిన్న రోడ్డు ఏర్పాటు చేసుకుని టూర్ తేదీలు నిర్ధారించుకున్నారు. అంతే! ఇక అప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఆయన ప్రోగ్రాంను విఫలం చేయడానికి చాలా శ్రమ పడింది. చంద్రబాబు, లోకేశ్‌లకు వీర విధేయులైన పోలీసు అధికారులను ప్రయోగించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. జగన్ టూర్లో పాల్గొనడానికి వీల్లేదని శాసించే రీతిలో పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు నోటీసులు ఇచ్చారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులే కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చారు. జగన్ టూర్లో పాల్గొంటే ఏదో జరిగిపోతుందని, కేసులు పెడతారని ప్రచారం చేశారు. టూర్ జరిగే రోజున ప్రజలు, అభిమానులు ఎవరూ రాకుండా ఉండడం కోసం పోలీసులు జేసీబీలతో రోడ్లపై గోతులు తవ్వారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎక్కడకక్కడ ఇనుప కంచెలు వేయడం, నెల్లూరు సందులలో నుంచి కూడా జనం రాకుండా చేయాలని యత్నించడం వల్ల ప్రజలు నానాపాట్లు పడ్డారు. చివరికి అంత్యక్రియల కోసం రేవుకు వెళ్లడం కూడా కష్టమైందని నెల్లూరు వాసి ఒకరు తెలిపారు. ఇన్ని నిర్బంధాల మధ్య ప్రజలు జగన్ టూర్‌కు రారేమో అని అందరకూ అనుకున్నారు. కానీ.. వేల మంది జనం పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ రోడ్లపైకి వచ్చి విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఈ అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. 👉ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి పార్టీని అణగదొక్కాలని అనుకుంటే అది అన్నిసార్లు అయ్యే పని కాదని నెల్లూరు ప్రజలు తెల్చి చెప్పారు. ఈ ఏడాది కాలంలోనే చంద్రబాబు సర్కార్ విపరీతమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోందన్న విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ ఏ పట్టణానికి వెళ్లినా ఇలా జనం తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారో అర్థం కాక కూటమి నేతలు తల పట్టుకుంటున్నారు. ఒక పక్క జనం వస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే ప్రజలు రాలేదని, సాక్షి టీవీలో బంగారు పాళ్యం ప్రోగ్రాం వీడియోలోని సన్నివేశాలు ప్రసారం చేశారని ఒక అసత్య ప్రచారం పెట్టారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి అలా మాట్లాడారంటే జగన్ టూర్‌పై వారు ఎంతగా కలవరపడుతున్నది అర్థం చేసుకోవచ్చు. బంగారుపాళ్యంలో జనం విశేషంగా వచ్చారని వారే స్వయంగా ఒప్పుకున్నట్ల అయ్యిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. ప్రభుత్వం దీనిని పరాభవంగా భావించి మరింత కక్షకు దిగకుండా ఇకనైనా ప్రజస్వామ్య పద్దతిలో జగన్ టూర్లకు సహకరించడం మంచిది. పోలీసులు ఎవరైనా ముఖ్యనేత వస్తుంటే ఆయనకు భద్రతకు కల్పించడం, జనం అధికంగా వస్తున్నారనుకుంటే దానికి తగ్గట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప, జనం ఆ ప్రోగ్రాంకు రాకుండా అడ్డుకోవడమే విధిగా పెట్టుకోరాదని ఈ ఘటన రుజువు చేసింది. 👉బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంతగా పైకి లేస్తుందన్న విషయం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. జగన్, చంద్రబాబుల వ్యాఖ్యలను పరిశీలిద్దాం. పాలనలో విఫలం అయినందునే చంద్రబాబు భయంతో తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. తన పార్టీ నేతలను కలవడానికి వస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. కాకాణి పై ఉన్న పలు అక్రమ కేసుల గురించి ప్రస్తావించి సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు, మీడియా సమావేశం వీడియోను పోస్టు చేసినందుకు కూడా కేసులు పెట్టారని వివరించారు. నిజంగానే ఇది చాలా శోచనీయం. రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి అమలుకాని వైనం, రైతుల కష్టాలు, ప్రభుత్వంలో అవినీతి, శాంతిభద్రతల వైఫల్యం రెడ్ బుక్ రాజ్యాంగం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ మొదలైన అంశాలను జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు వేసిన రెడ్ బుక్ విత్తు పెరిగి చెట్టు అవుతుందని, భవిష్యత్తులో అది వారికే ప్రమాదం అని హెచ్చరించారు.తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని,ఆ విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కూడా జగన్ పేర్కొన్నారు. జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు ఎక్కడా నేరుగా బదులు ఇచ్చినట్లు కనిపించలేదు. రాజకీయ ముసుగులో కొందరు అరాచకాలు సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలన్నది ఆయన భావన. తన కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను నానా మాటలు అన్నప్పటికీ, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అన్నప్పుడు కాని అవేవి అరాచకంగా ఆయనకు కనిపించలేదు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు పోలీసులను ధిక్కరించి హెచ్చరికలు చేయడం, టూర్లు సాగించిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోయి జగన్ టూర్‌ను అరాచకంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం జనం వస్తే తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం అసందర్భంగా అనిపిస్తుంది. రాజకీయ పాలన చేస్తానని చెప్పడం ద్వారా టీడీపీలో అరాచకాన్ని ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని విస్మరిస్తున్నారు. మళ్లీ వస్తా.. అంతు తేలుస్తా అని జగన్ చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు దానిని విశ్వసిస్తుంటే జగన్ టూర్ లకు ఎందుకిన్ని ఆంక్షలు పెట్టడం అన్నదానికి మాత్రం జవాబు ఇవ్వరు. ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా తన కుమారుడు, మంత్రి లోకేశ్ అనుభవ రాహిత్యంతో అమలు చేస్తున్న రెడ్ బుక్ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అవసరం. నెల్లూరు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వానికే మంచిది.లేకుంటే ప్రజలలో ఆయన ప్రభుత్వమే మరింత పలచన అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు.. డీఎస్పీ ఆఫీసుకు అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్‌పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో అనిల్ కుమార్‌కు మద్దతు తెలుపుతూ డీఎస్పీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. కొవ్వూరులో వైఎస్సార్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. కాసేపట్లి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసుకు అనిల్ వచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆఫీస్ వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. అనంతరం, వారినివ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్‌బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్‌బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా?’
విజయవాడ: చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోతాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసలు చంద్రబాబుకి ఆర్టీసీ స్థలం లూలుకి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని ప్రశ్నించారాయన. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 3వ తేదీ) విజయవాడ నుంచి మాట్లాడిన రామకృష్ణ.. ‘వందల కోట్ల ఆర్టీసీ భూమి 99 ఏళ్లు లీజుకివ్వడమేంటి?, విశాఖలోనూ వందల కోట్ల భూమి లూలుకి కట్టబెట్టారు. విదేశాల్లో మూతబడిన లూలుకి ఇక్కడ ప్రభుత్వ భూములివ్వడం దేనికి?, కనీసం చర్చ కూడా లేకుండా చంద్రబాబు, నారాయణ లూలుకు ఆర్టీసి భూములిచ్చేశారు. గన్నవరంలో విమానాశ్రయం ఉంటే మళ్లీ అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పెట్టాల్సిన అవసరం ఏముంది?, విమానాశ్రయాలు కడితే సరిపోదు...విమానాలు నడవాలి కదా. అమరావతిలో 1500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ పెడతాననడం హాస్యాస్పదం. ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా? అని ప్రశ్నించారు రామకృష్ణ. -
లోకేశ్.. తప్పుడు ప్రచారం వద్దు, కచ్చితంగా నిలదీస్తాం: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో తామేదో.. రెచ్చగొడుతున్న లోకేశ్ మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘ఏపీ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాల సంగతి తేలాక వరద జలాల గురించి ఆలోచించాలి. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రాజెక్టుల పైనున్న ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తైన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయాలి. అవేమీ తెలియకుండా లోకేశ్.. ఏపీ ప్రజలను మభ్యపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యునల్స్ చెప్పినదాని ప్రకారం ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ వదులుకోదు.సీనియర్ నాయకుడిగా చంద్రబాబు ఇలాంటి నీటి వాటాలపై ఘర్షణ పూరిత వాతావరణానికి ఇరు రాష్ట్రాల మధ్య తెర లేపొద్దు. వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరూ కోరుకోరు.. మీరు వాటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరమూ ఉండదు. కానీ, మా కోటా, మా వాటా పూర్తి కాకుండా నీటిని తరలిస్తామంటే మా హక్కులపై కచ్చితంగా నిలదీస్తాం, అడ్డుకుంటాం. మా రైతుల హక్కుల కోసం కచ్చితంగా మాట్లాడతాం. దానికి మేమేదో ప్రాంతీయ అసమానతలను రెచ్చగొడుతున్నట్టు లోకేశ్ వక్రీకరించడం సరికాదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఏపీకి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. మా రాష్ట్ర హక్కులు మేము కాపాడుకుంటాం.. మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వకండి అంటూ హితవు పలికారు. -
జెడ్పీటీసీ ఎన్నికలు.. పులివెందులలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, వైఎస్సార్: ఏపీలో అధికార కూటమి సర్కార్ పాలనలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ఏవైనా కూటమి నేతలకు ప్రలోభాలకు, బెదిరింపులకు దిగుతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోలీసుల సాయంతో లా అండ్ ఆర్డర్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇక, తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమి.. వైఎస్సార్సీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది.వివరాల ప్రకారం.. పులివెందుల మండలం అచ్చవెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారుడు, రేషన్ డీలర్ జనార్దన్ రెడ్డిపై రెవెన్యూ అధికారులు అక్రమ కేసు పెట్టారు. జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలకు గురి చేసేందుకు అధికారుల ద్వారా జనార్దన్ రెడ్డి రేషన్ షాపును తనిఖీ చేయించారు. అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రెండు కేజీలు బియ్యం తక్కువగా ఉన్నాయని కేసు నమోదు చేశారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడి మేరకే రేషన్ షాపును తనిఖీ చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలతో పాటు వివిధ జిల్లాల్లోని మూడు ఎంపీటీసీ స్థానాలు, రెండు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు, మణీంద్రం, వేపకంపల్లి, విడవలూరు–1 ఎంపీటీసీ స్థానాలకు 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారని పేర్కొన్నారు. -
సుఖీభవ పేరుతో సెట్టింగ్ డ్రామా
ఒంగోలు సిటీ: ‘పంజాబీ దాబాలాంటి సెట్టింగ్ వేసి.. 50 నుంచి 60 నులక మంచాలపై మహిళలు, రైతులను కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు వెనుక గడ్డివాము, ఒక ట్రాక్టర్ పెట్టి.. చుట్టూ పచ్చగా ఉండేలా భారీ సెట్టింగ్ వేసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఓ డ్రామా తరహాలో నిర్వహించారు’ అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించకుండా అన్నదాతా సుఖీభవ పేరుతో షూటింగ్ చేసుకుని వెళ్లిపోయారని మండిపడ్డారు.శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరిపాలనలో ఏటా 53.58 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా అందేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను భారీగా కుదించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 46.87 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని, మిగిలిన 7 లక్షల మంది రైతులు ఏమి అన్యాయం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. మొదటి ఏడాది రైతులకు సాయం ఎగ్గొట్టి, ఇప్పుడు కేంద్రం వాటా కలుపుకుని రూ.7 వేలు ఇవ్వడం దగా చేయడమేనన్నారు. బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించరు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి పంటకు క్వింటాల్‌కు రూ.27 వేలు నుంచి రూ.28 వేలు ధర లభిస్తే.. చందరబాబు హయాంలో క్వింటాల్ ధర రూ.6 వేలకు పడిపోయిందని శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, శనగ, వరి, పత్తి ఇలా అన్ని పంటల రైతులు గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతున్నారన్నారు. దర్శిలో కార్యక్రమం ఎవరి కోసం.. సీఎం చంద్రబాబు దర్శిలో నిర్వహించిన కార్యక్రమం ఎవరి కోసమో చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మిర్చి రైతుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పొదిలికి జగన్మోహన్రెడ్డి వస్తే వేలాది మంది రైతులు, కార్యకర్తలు తరలివచ్చారని, వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నారు.