
సతీష్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)
వైఎస్సార్ జిల్లా: ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ బీటెక్ రవి, శ్రీనివాసులురెడ్డి, ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్‌లో ఏవో మాట్లాడుతున్నారు. నిన్న పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు.
నేడు అతనితో మేము బెదిరించినట్లు పోలీసులకు పిర్యాదు చేయించారు. జగన్ గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదం. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి వైఎస్ జగన్. నూటికి నూరు పాళ్లు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరగాలని కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్. ఉప మండలాధ్యక్షుడ్ని లోబరుచుకుని ఇలా చేస్తున్నారు.
ఎవరు బెదిరించారు అనేది రికార్డింగ్ చేసింది చూపండి. మేము పదవి ఇచ్చిన వారు ఇతర పార్టీలోకి వెళ్తుంటే మాట్లాడటం తప్పేలా అవుతుంది. బెదిరింపు వేరు..బుజ్జగింపు వేరు. మా పార్టీ నేతను మా మేము బుజ్జగించే ప్రయత్నం చేశాము. నిజంగా బెదిరించి ఉంటే రికార్డింగ్ చూపండి. ఒక దురుద్దేశంతో ఇలా చేసి బెయిల్ పై ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చెప్తున్న ఉప మండలాధ్యక్షుడు మా అభ్యర్థి నామినేషన్ లో కూడా పాల్గొన్నాడు. మీరు అతన్ని లోబరుచుకుని ఇలా చేయడం మీ నైజానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.