breaking news
	
		
	
  - 
      
                   
                                                       తహసీల్దార్.. మహిళా వీఆర్వో పరస్పర ఫిర్యాదులుసాక్షి టాస్క్‌పోర్స్: మహిళా వీఆర్వో హనీట్రాప్‌లో తాను చిక్కుకున్నానని తహసీల్దార్.. కోరిక తీర్చమని తహసీల్దార్ తనను వేధిస్తున్నారని వీఆర్వో ఇద్దరూ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. మహిళా వీఆర్వో ఇంటికి వెళ్లి నగ్నంగా దొరికిపోయిన తహసీల్దార్.. వీఆర్వో తల్లితో పాటు పలువురి చేతిలో చావుదెబ్బలు తిని బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురువారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వాకాడు తహసీల్దార్ రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. గత నెల 24న నాయుడుపేటలో ఉంటున్న మహిళా వీఆర్వో ఇంట్లోకి వెళ్లిన తహసీల్దార్ దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధితురాలు కలెక్టర్, ఎస్పీలకు గురువారం ఫిర్యాదు చేశారు.కాగా.. తాను పెళ్లకూరులో తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు తనతో చనువుగా ఉన్న మహిళా వీఆర్వో పథకం ప్రకారం తనపై వలపు వల విసిరి (హనీట్రాప్ చేసి) ఇంటికి పిలిపించుకుందని.. తనపై దాడి చేయడమే కాకుండా నగ్నంగా వీడియోలు తీసి నగదు కోసం బెదిరిస్తున్నట్టు తహసీల్దార్ కలెక్టర్‌కు, ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆ మహిళా వీఆర్వోపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని తహసీల్దార్ చెప్పినట్టు తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై గురువారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఐ బాబీ చెప్పారు.
- 
      
                   
                                                       వాటిని తెరిస్తే తంటాలే..!సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్‌బాక్స్‌లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్‌ను అదే నంబర్‌తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్‌పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్‌కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్‌కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్‌ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్‌తో సైబర్‌కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్‌లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్‌స్టేషన్‌లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్‌లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్‌లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్
- 
      
                   
                                                       ఇంజినీ‘రింగ్ రింగ’తెనాలిరూరల్: ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. గంజాయి అమ్మకాల్లో భాగస్తులై కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వరుసగా గంజాయి కేసుల్లో స్టూడెంట్లు అరెస్టు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా గురువారం గంజాయి అమ్ముతున్న, తాగుతున్న 13 మందిని గుంటూరు జిల్లా కొల్లిపర, తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 5.2 కిలోల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం గమనార్హం. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మాల డొంక ప్రాంతంలో కొల్లిపరకు చెందిన మల్లోల శోభన్ బాబు, పాముల రుషిబాబు, మండ్రురాజ్ కుమార్, ఆరే ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్ గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోకూరి శ్రీను, కాజా గ్రామానికి చెందిన కారంకి నిఖిల్‌కుమార్, అత్తోటకు చెందిన యర్రు శశికుమార్, దాసరి చేతన్, రేపల్లెకు చెందిన కొసరాజు రోహిత్, కుంచవరానికి చెందిన గరిక గోపినాథ్, మేడా ప్రవీణ్, విశాఖపట్నంకు చెందిన కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి గంజాయి తాగుతున్నారని డీఎస్పీ వివరించారు. ఈ ముఠా విశాఖ జిల్లా పాడేరుకు చెందిన పరమేశ్వరన్ వద్ద గంజాయిని చౌకగా కొని తెనాలి పరిసర ప్రాంతాలలో 20 గ్రాములు రూ.500 చొప్పున అమ్ముతున్నట్టు తేలిందని వెల్లడించారు. నిందితులలో 9 మందిపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఇటీవలే 21 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకుని 13 మందిని అరెస్టు చేశామని, ఇప్పుడు మరో 13 మంది గంజాయి కేసులో అరెస్టు అయ్యారని డీఎస్పీ వివరించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి విక్రేతలు పదిమందిపై పీడీ యాక్టు ప్రయోగించబోతున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోందని, తల్లిదండ్రులు విద్యార్థులను కనిపెడుతుండాలని, లేకుంటే వారి జీవితాలు నాశనం అవుతాయని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పి.కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
- 
      
                   
                                                       పోలీసుల వేధింపులతో.. కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నంసాక్షి, టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన ఆర్. చిన్నబాలయ్య (45) స్థల వివాదం విషయంలో పోలీసుల వేధింపులు తాళలేక మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లా కోర్టు ఆవరణలోనే ఆయన ఈ అఘాయిత్యానికి యత్నించడంతో ఆయన్ను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అక్కడ న్యాయమూర్తి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం.. కడప వన్‌టౌన్ పోలీసులు బాధితుడు, అతని బంధువుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం పోలీసులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థలాల ఆక్రమణకు పోలీసుల యత్నం.. అతడి సోదరులు ఏసన్న, బాలయ్య మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో 2007లో సుగుమంచిపల్లె ఆర్ అండ్ ఆర్‌లో ఒకొక్కరికి ఐదుసెంట్ల చొప్పున ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇచి్చందన్నారు. తమ సోదరుడు చిన్నబాలయ్యకు ఇచ్చిన స్థలాన్ని, ఇంకా కొందరి స్థలాలను ఆక్రమించుకునేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా.. హోంగార్డులు తిరుపతయ్య, నాగార్జునరెడ్డి.. కానిస్టేబుల్ నరసింహులుతో పాటు గ్రామస్తులు దత్తాపురం మాధవరెడ్డి, తుంగ జగదీశ్వర్‌రెడ్డి, బెస్త వేణు, బెస్త ప్రసాద్, మేకల బాలగంగిరెడ్డి వేధిస్తున్నారని.. వీరికి తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం అదనపు ఎస్పీగా ఉన్న వెంకటరాముడు వత్తాసు పలుకుతూ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తలమంచిపట్నం, తాళ్ల ప్రొద్దుటూరు, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లలో చిన్నబాలయ్యపై దొంగతనాల కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేయాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, జడ్జి స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుచేసి ఇస్తామని పోలీసులు తెలిపినట్లు బాధితుడి సోదరులు చెప్పారు.
- 
      
                   
                                                       పెళ్లి పేరుతో టీడీపీ నేత కుమారుడు వంచన.. గోవా తీసుకెళ్లి..సాక్షి, కోనేరు సెంటర్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక దుర్మార్గమైన పంచాయితీకి తెరతీశారు. యువతిని మోసగించిన టీడీపీ నేత, మంత్రి అనుచరుడి కుమారుడి తరఫున రంగంలోకి దిగారు. అతడిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడు, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల్లో ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ స్థానికంగా ఒక యువతిని ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లాడు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్‌ను గోవాలో పట్టుకున్నారు. అతడిని, ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్ నిరాకరించాడు. సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి, యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువతి తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందనే భయంతో ఆ యువతి తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
- 
      
                   
                                                       ఎస్బీఐలో రూ.12 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీహిందూపురం: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్రాంచ్‌లో జరిగిన భారీ చోరీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో సమయంలో బ్యాంకులో భారీ ఎత్తున నగలు, నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. హిందూపురం డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో బ్యాంక్ సిబ్బంది, పోలీసులు విచారణ చేపట్టారు. బ్యాoకు లాకర్లో ఉన్న దాదాపు రూ.12 కోట్ల విలువచేసే 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు చోరీకి గురైనట్లు డీఎస్పీ తెలిపారు. అయితే బ్యాంకు లాకర్ గ్యాస్‌కట్టర్‌తో కత్తిరించినా కింది అర లాక్ తెరుచుకోలేదనీ, గట్టిగా ఉండటంతో తెరవలేక పోయారన్నారు. లేదంటే మరో పదికేజీల బంగారం కూడా చోరీకి గురయ్యేదన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రత్నం మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. నిర్లక్ష్యమే కారణమా? అయితే ఈ ఘటనలో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకుకు సెక్యూరిటీ గార్డు లేకపోవడం, లోపల అలారం పనిచేయకపోవడం, సీసీ కెమెరాలను బ్యాంకు అధికారుల సెల్ఫోన్లకు అనుసంధానించకపోవడం వంటి లోపాలు వెలుగు చూశాయి. ఇటీవల తనిఖీల నిమిత్తం హిందూపురం రూరల్ సీఐ పారిశ్రామికవాడలో తనిఖీలకు వచి్చన సందర్భంగా బ్యాంకు భద్రతపై అధికారులను హెచ్చరించారు. సెక్యూరిటీ పటిష్టం చేయాలని సూచించారు. అయినా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదు.
- 
      
                   
                                                       కోనసీమ: మాచవరంలో దారుణం.. ప్రిన్సిపాల్ కాదు.. కీచకుడుఅంబేద్కర్ కోనసీమ: జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని తీర్చిదిద్దాల్సిన గురువే.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఘటన రాయవరం మండలం మాచవరం గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం 9వ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగపడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయపడి బాలిక కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలిక పదోవ తరగతి చదువుతుంది. మూడు నెలలుగా పిరియడ్స్ రావడంలేదని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు. దీనితో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. నిందితుడైన ప్రిన్సిపాల్ జయరాజ్ పై రాయవరం పోలీసు స్టేషన్లో బాధితురాలు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాయవరం పోలీసులు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జయరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కాగా, పాఠశాలకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువు చెప్పేందుకు అనుమతి ఉంది. అయితే పాఠశాల కరస్పాండెంట్ అనుమతి లేకుండా 10వ తరగతి వరకు విద్యార్థులకు తన పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. పాఠశాలకు 7వ తరగతి వరకు అనుమతి ఉంటే.. పదవ తరగతి బాలికలు ఏ విధంగా చదువుతున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. బాలికలను వేరే పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చి, అనధికారికంగా ఈ పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. దీనిపై రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబును వివరణ కోరగా, ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
- 
      
                   
                                                       ఆగని టీడీపీ నేత అకృత్యాలుచిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తనటీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్‌నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
- 
      
                   
                                                       సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్‌కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్‌కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్‌కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్‌కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్‌లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్‌లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్‌లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్‌కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్‌లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్‌కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్‌బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్‌ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్‌ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్‌గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్‌వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్‌గా ఆమె ఎదిగడం కొసమెరుపు.
- 
      
                   
                                                       ప్రొద్దుటూరులో ఘరానా మోసం.. సచివాలయ ఉద్యోగస్తులమంటూ..ప్రొద్దుటూరు క్రైం: వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌కు మారుస్తానని నమ్మించిన ఓ మోసగాడు 5 తులాల బంగారు నగలతో ఉడాయించాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని చోటు చేసుకుంది. బద్వేలి గురివిరెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు. నెహ్రూరోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. లక్ష్మీదేవికి వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సచివాలయం నుంచి వచ్చానని ఒక వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. మీకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను దివ్యాంగుల పింఛన్‌గా మార్పు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు.వృద్ధాప్య పింఛన్ కంటే దివ్యాంగుల పింఛన్‌కు ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పడంతో వృద్ధ దంపతులు సంతోషించారు. వెంటనే ఆథార్ కార్డు తీసుకొని వెళ్తే మున్సిపల్ ఆఫీసులో ఒక సర్టిఫికెట్ ఇస్తారని అతను వారితో అన్నాడు. ఆ సర్టిఫికెట్‌ను తెచ్చి సచివాలయంలో ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లాడు. అతను వెళ్లగానే లక్ష్మీదేవి ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు.ఫొటో అప్డేట్ చేయాలని చెప్పి వృద్ధురాలికి ఫోటో తీసేందుకు సెల్‌ఫోన్ బయటికి తీశాడు. ఆమె ఒంటిమీద బంగారు నగలు ఉండటంతో వాటిని తీయమని చెప్పాడు. నగలతో ఫొటో దిగితే పింఛన్ రాదని, నగలను పక్కన పెట్టాలని చెప్పాడు. దీంతో ఆమె బంగారు గాజులు, ఇతర నగలను తీసి కిచెన్ రూంలో పెట్టింది. ఫొటో తీయమని ఆమె చెప్పగా ఇక్కడ చీకటిగా ఉందని ఫొటో సరిగా రాదని చెప్పి ఆమెను బెడ్ రూం సమీపంలోకి తీసుకెళ్లాడు.ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు లక్ష్మీదేవిని బెడ్రూంలోకి తోసేసి గడియ పెట్టాడు. కిచెన్ రూంలో ఉన్న నగలను తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వ్యక్తులు గడియ తీశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బంగారు నగలను దోచుకెళ్లాడని ఆమె బోరునా విలపించింది. లక్ష్మీదేవి ఐదు తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు.
- 
      
                   
                                                       కుప్పం: వివాహితుడి ప్రేమతో మోసపోయి..కుప్పం: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ అతని ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం, మార్వాడకు చెందిన వెంకటేష్ కుమారుడు వాసు ఓ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ మెన్‌గా పనిచేస్తున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో కడప పట్టణం, వూటుకూరు ప్రాంతానికి చెందిన ప్రశాంతితో పరిచయం ఏర్పడింది. ఈమె వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా సెక్యూరిటీ కానిస్టేబుల్. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే వాసుకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని అతను ప్రశాంతికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వాసు పనిచేస్తున్న ఫైనాన్స్‌లో గొడవలు రావడంతో అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరు వదిలి వాసు స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ప్రశాంతితో మాట్లాడడం తగ్గించేశాడు. అతనిపై అనుమానంతో గురువారం ఆమె మార్వాడ గ్రామానికి వచ్చి విచారించడంతో అసలు విషయం బయటపడింది. అప్పటికే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న వాసును చూసి తట్టుకోలేకపోయింది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ప్రశాంతిని కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. కాలిన గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలొదిలింది. ప్రేమ ముసుగులో మోసం చేసిన ప్రియుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       కూటమి నేతల ప్లాన్.. మైనర్లతో దొంగల ముఠా తయారీసాక్షి ప్రతినిధి, విజయవాడ: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్ఫోన్లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్‌మిట్టల్ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్’ ప్లాన్ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు. పట్టించిన సిమ్ ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్‌పై మోజుతో ఓ మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. మంత్రి ఫోన్‌తో 41ఏ నోటీసులతో సరి..!విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
- 
      
                   
                                                       విశాఖ పోలీసుల థర్డ్ డిగ్రీ.. మేజిస్ట్రేట్ ఆగ్రహంసాక్షి, విశాఖపట్నం: పొక్సో కేసులో ఏసీపీ చేతివాటం బయటపడింది. ఇంటర్ చదువుతున్న బాలికపై రామకృష్ణ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానంటూ బాలిక ఇంటికి వచ్చి మరి.. బెదిరింపులకు దిగాడు. దీంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని.. వేధింపులు భరించలేక పోతుందని హార్బర్ ఏసీపీ కాళిదాసును బాలిక తల్లిదండ్రులు ఆశ్రయించారు.పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. కాగా, ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలు తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. దాడి చేసినా కానీ బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కాళిదాసు తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో పోలీసులు డబుల్ గేమ్ ఆడారు. పోలీస్ స్టేషన్లో గొడవ బయటకి రావటంతో నిందితుడికి పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. నిందితుడి ప్రైవేట్ పార్ట్స్‌పై వేడి మైనపు చుక్కల్ని వేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు రామకృష్ణ.. రిమాండ్ సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట థర్డ్ డిగ్రీ విషయం బయట పెట్టాడు. పోలీసులపై మేజిస్ట్రేట్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సీపీ శంఖబ్రతబాగ్చికి మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
- 
      
                   
                                                       సంతమాగులూరు తండ్రీకొడుకుల హత్య కేసులో టీడీపీ నేత?సాక్షి,బాపట్ల: జిల్లా సంతమాగులూరు మండలంలో జరిగిన జంట హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం.చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కుమారుడు కిడ్నాప్,దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు చెల్లని చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు వెళ్తున్న వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను అగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం దారుణంగా హత్య చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తండ్రీ,కొడుకుల హత్య కేసులో టీడీపీ నేత బాదం మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెంగుళూరులో బాదం మాధవరెడ్డితో హతులు వీరాస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి ఆర్ధిక పరమైన గొడవలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి వివాదం కారణంగానే మృతుల్ని పక్కాప్లాన్ ప్రకారం హత్య చేశారని, హత్యలో స్వయంగా బాదం మాధవరెడ్డి పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
- 
      
                   
                                                       భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!నంద్యాల: భర్తను తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది ఓ మహిళ. నంద్యాల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి రమణయ్య పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       మసాజు మాటున 'గలీజు'విశాఖ సిటీ : విశాఖ హైటెక్ వ్యభిచారానికి కేంద్రంగా మారిపోయింది. స్పా సెంటర్ల ముసుగులో గలీజు వ్యవహారం సాగుతోంది. మసాజు మాటున వ్యభిచారం నడుస్తోంది. సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్‌ల ద్వారానే దందా జరుగుతోంది. వెల్నెస్.. స్పా సెంటర్ల పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేంద్రాలు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీటి నిర్వాహకులు కొందరు విదేశాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటూ.. వారితో చీకటి వ్యాపారానికి తెరలేపుతున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన యాడ్స్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. అన్ని రకాల సేవలను అందిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా స్పా సెంటర్లపై పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి వీటిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. గత వారంలో వరుసగా రెండు స్పా సెంటర్లపై చేసిన దాడుల్లో వారి మసాజ్ బాగోతం బయటపడింది. హైటెక్ దందా సామాజిక మాధ్యమాల ద్వారానే 80 శాతం హైటెక్ వ్యభిచారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు పలువురు నిర్వాహకులు లొకేంటో, ఇన్‌స్టా, టెలీగ్రామ్, వాట్సాప్.. ఇలా సామాజిక మాధ్యమాలు, మెసేజింగ్ యాప్‌ను వినియోగించుకుంటున్నారు. వీటిలో డిజిటల్ యాడ్స్ ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. వాటిలో ఉన్న నెంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. వెంటనే ఆటో జనరేటెడ్ రిప్లయ్ వచ్చేస్తుంది. ఎటువంటి సేవలు అందిస్తారన్న వివరాలు అందులో ఉంటాయి. మరో నిమిషంలోనే ఫోన్ మోగుతుంది. మధురమైన వాయిస్‌తో వారి అందించే సేవలు, వారి చార్జీలు వివరిస్తారు. ఓకే అంటే చాలు.. వెంటనే లొకేషన్ మొబైల్‌కు వచ్చేస్తుంది. ఇదీ విశాఖలో సాగే హైటెక్ వ్యభిచారం. సాధారణ మసాజ్‌లకు రూ.1000 నుంచి రూ.2500 ఛార్జ్ చేస్తున్నారు. అయితే క్రాస్ మసాజ్ నుంచి ప్రత్యేక సేవలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సేవలు కావాలంటే రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. విశాఖలో 71 స్పా సెంటర్లు ఆకర్షణీయమైన ఎంట్రన్స్.. లోపల అడుగుపెడితే అద్భుతమైన యాంబియన్స్.. అందమైన యువతులతో స్వాగతాలు.. స్టార్ హోటల్‌ను తలపించే రూమ్‌లు.. ఇలా నగరంలో ఇలా రూ.కోట్లు ఖర్చు పెట్టి స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 71 వరకు ఈ వెల్నెస్, స్పా, రిలాక్స్ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిరిపురం, పాండురంగాపురం, బీచ్ రోడ్డు, సీతమ్మధార, గాజువాక ప్రాంతాల్లోనే సగం కంటే ఎక్కువగా సెంటర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని స్పా సెంటర్ల నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. విదేశాల నుంచే కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటున్నారు. శరీరం అలసిపోయిన, కండరాలు బిగుసుకుపోయిన వారికి అనేక రకాల మసాజ్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ లోపల జరిగే తంతే వేరుగా ఉంటోంది. చట్ట విరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లు.. స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న చీకటి వ్యాపారానికి పోలీసుల నుంచి సహకారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంలో ఒక్కో స్పా సెంటర్ నుంచి నెలకు రూ.10 వేలు స్టేషన్‌కు అందుతున్నట్లు సమాచారం. అసాంఘిక కార్యకలాపాలు సాగించే సెంటర్ల నుంచి రూ.50 వేలు నుంచి రూ.లక్ష వరకు ముట్టజెబుతున్నారన్న టాక్ ఉంది. అందువల్లే ఇన్నాళ్లు ఆ స్పా సెంటర్ల వ్యవహారం బయటపడలేదన్న వాదనలు ఉన్నాయి.వీటి నిర్వహణ, చట్ట విరుద్ధ కార్యక్రమాలపై అనేక ఫిర్యాదులు రావడంతో సీపీ శంఖబ్రత బాగ్చి గతంలో ప్రతి 2,3 నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అన్ని కేంద్రాల్లో దాడులు చేపట్టినా ఒక్క కేంద్రంలోనూ ఈ తరహా వ్యవహారం వెలుగు చూడలేదు. తనిఖీలకు వెళుతున్న సమాచారం నిర్వాహకులకు ముందుగానే అందుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా.. కూటమి ప్రభుత్వంలో విశాఖలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. హత్యలు, గ్యాంగ్వార్లు, దాడులు, దోపిడీలతో ప్రశాంత విశాఖలో అలజడి రేగుతోంది. తాజాగా ఈ స్పా సెంటర్లలో వ్యభిచారం వ్యవహారం బట్టబయలవడం నగరంలో పరిస్థితికి అద్దం పడుతోంది. గత వారంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో రెండు స్పా కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు.
- 
      
                   
                                                       నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీనెల్లూరు సిటీ/ఆత్మకూరు: నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఓ వ్యక్తి బస్సును చోరీ చేయడంతో దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసీ అధికారులు హైరానా పడ్డారు. చివరికి ఫాస్ట్‌ట్యాగ్‌తో బస్సు ఆచూకీ కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు ఏఎస్‌పేట నుంచి మంగళవారం సాయంత్రం ప్రయాణికులతో బయలుదేరి నైట్ హాల్ట్‌గా నెల్లూరు బస్టాండ్‌కు చేరింది. బుధవారం ఉదయం 5 గంటలకు తిరిగి ఏఎస్‌పేటకు బయలుదేరాల్సి ఉంది. డ్రైవర్, కండెక్టర్ బస్టాండ్‌లోనే నిద్రపోయారు. ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం తెల్లవారు జామున బస్సును అపహరించాడు. 4 గంటలకు నిద్రలేచిన కండక్టరు, డ్రైవర్ బస్టాండ్‌లో బస్సు కనిపించకపోవడంతో ఆత్మకూరు, నెల్లూరు డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు టోల్గేట్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు బస్సు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజా వద్ద సంగం వైపు క్రాస్ అయినట్లు ఫాస్ట్‌ట్యాగ్ మెసేజ్ వచ్చింది. సంగంలో బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆగలేదు. నెల్లూరుపాళెం సెంటర్ వద్దకు వచ్చిన బస్సును పలువురు చాకచక్యంగా నిలిపి బస్సు నడిపిన వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీకి ఫిర్యాదు చేశారు. బస్సును చోరీ చేసిన వ్యక్తిని విడవలూరు మండలం కంచరపాళెంకు చెందిన కృష్ణగా గుర్తించారు. అతనికి మతిస్థిమితం లేదని తెలిపారు. నెల్లూరు పోలీసులకు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కృష్ణను నెల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు ఎస్సై జిలానీ తెలిపారు.
- 
      
                   
                                                       మచిలీపట్నం: యూ ట్యూబ్ వీడియోలు చూసి..సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో యూ ట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు ముగ్గురూ 9వ తరగతి విద్యార్థులే. వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడిన మైనర్లు.. రెండు నెలల్లో నాలుగు దొంగతనాలు చేశారు. ఆ ముగ్గురు నుంచి రూ.10 లక్షల 20 వేలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలుర్ల నుంచి చోరీ సొత్తును కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్ అనే వ్యక్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. జువైనల్ హోంకు తరలించారు. మైనర్ల నుంచి చోరీ వస్తువులు కొనుగోలు చేసిన ఇద్దరికి నోటీసులిచ్చి వదిలేశారు. కాగా, చోరీ చేసిన సొత్తును కొన్నవారికి 41 నోటీసులిచ్చి వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే కొక్కిలిగడ్డ రాము, వల్లూరు సంతోష్‌ను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.
- 
      
                   
                                                       బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!చిత్తూరు అర్బన్: అతడికి 19 ఏళ్లు. ఆమెకు 38 ఏళ్లు. అయినా వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సమాజం తమ పెళ్లిని అంగీకరించదని భావించి ఎవరికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. విధి అడ్డు తగలడంతో చేసేదేమీలేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ ఘటన జరిగింది.వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన యువకుడు(19) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో నాన్–టీచింగ్ స్టాఫ్‌గా మహిళ(38) పనిచేస్తోంది. ఈమెకు వివాహమవ్వగా.. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి, ఆ మహిళతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురి వయసు తేడా దాదాపు 20 ఏళ్లు ఉండటంతో తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన వీరు మూడు రోజుల క్రితం ఎవ్వరూ తమకు అభ్యంతరం చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వెళ్లిపోయారు.కానీ, ఇంతలో తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించడంలేదని యువకుడి తల్లిదండ్రులు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. వీరి ప్రేమ విషయం బయటపడింది. సాంకేతిక ఆధారంగా వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అక్కడి నుంచి ఇరువురినీ చిత్తూరుకు తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సీఐ నెట్టికంటయ్య కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో యువకుడిని ఇంటికి పంపించారు. ఆ మహిళ కూడా తన ఇంటికి వెళ్లిపోయింది.
- 
      
                   
                                                       మహిళా వీవోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులుఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దళిత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక గత శనివారం తెల్లవారు జామున అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన తనను ఏడాది కాలంగా మానసికంగా వేధిస్తున్నాడని, అసభ్యపదజాలంతో అశ్లీల సూచనలు చేస్తూ తనను ఒంటరిగా ఇంటి వద్ద కలవాలని మానసికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మాది, నీ ఉద్యోగం ఉండాలంటే నాతో ఇంటి వద్ద రాత్రి ఒంటరిగా కలవాలని, నేను చెప్పినట్లు వినాలి’ అని బెదిరించినట్టు వివరించారు. ఆరు నెలల క్రితమే విషయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈ మధ్య సుబ్బారావు ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా నరకం అనుభవించానని, గత్యంతరం లేక ఆత్మహత్యా యత్నం చేశానని గోడు వెళ్లబోసుకున్నారు. విషయం పక్కదారి పట్టించే యత్నం.. అసలు విషయం పక్కదారి పట్టించేందుకు సుబ్బారావు పలువురు డ్వాక్రా సభ్యులను ఆటోల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్త్రీ నిధి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా నిధులు స్వాహా చేసిందని బాధితురాలి మీద ఆరోపణలు చేయించారు. సుబ్బారావు తమ తరఫున ఉన్నందున ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డ్వాక్రా సభ్యులు పదేపదే ఆయనకు అండగా నిలిచే యత్నం చేశారు. శనివారం తెల్లవారు జామున బాధితురాలు నిద్రమాత్రలు మింగిన విషయం తెలుసుకున్న వీరు సోమవారం ఉదయం నగదు స్వాహా చేసిందని వెలుగు కార్యాలయంలో అధికారులకు డ్వాక్రా సభ్యులతో చెప్పించే యత్నం చేయడం గమనార్హం. స్త్రీ నిధి నగదు కొంత తన వద్ద ఉన్న మాట వాస్తవమే అని, వాటిని తిరిగి సంస్థకు జమ చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. తన వ్యక్తిగత సమస్యకు డ్వాక్రా నిధులకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
- 
      
                   
                                                       సిట్ లీకులతోనే ఆ కథనాలు.. జడ్జి ఎదుట ధనుంజయ్‌రెడ్డి ఆవేదనసాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసులో అరెస్టైన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి.. ఏసీబీ కోర్టు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైల్లో ఉన్న తన గురించి, బయట ఉన్న తన కుటుంబం గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ జడ్జి ముందు ఇవాళ ఆవేదన వెలిబుచ్చారాయన. ‘‘మేం ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉన్నాం. జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పైనుంచి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు. పై నుంచి అడిగితే మేం ఫోటోస్ తీస్తున్నామని చెబుతున్నారు. నేను ఐదుగురితో మాట్లాడినట్టు సెల్‌ఫోన్ ట్రాక్ ద్వారా గుర్తించినట్టు పేపర్లో ఓ వార్త చూశాను. ఆ కథనంలో పేర్కొన్న ఐదుగురిలో ఇద్దరిని మాత్రమే నేను కలిశానంతే. మిగతా ముగ్గురిని ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కలవలేదు. కావాలంటే ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థతో నైనా విచారణ చేయించుకోవచ్చని కోరుతున్నానుమాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలు అని కథనాలు రాస్తున్నారు. నేను విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు అంఉదలో పేర్కొన్నారు. నేను నా లైఫ్‌లో కొన్న ఒకే ఒక్క శాంట్రో కారు. నా భార్య మరో కారు వాడుతోంది. ఇవి రెండు విలాసవంతమైన కార్లా?. పత్రికల్లో వస్తున్న కథనాలతో మా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ విధంగా మాపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. సిట్ అధికారులే లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు.గత 20 రోజులుగా పత్రికల్లో వార్తలు చూస్తే మేం ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. చార్జీషీట్లో ప్రతి పేరా గురించి పత్రికల్లో రాశారు. ఇది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ కేసు. నేను కోర్టులో ఈ విషయం చెప్పాను. కాబట్టి రేపట్నుంచి సిట్ మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. అయినా అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం అని చెప్పారాయన.
- 
      
                   
                                                       జాబు కావాలంటే ‘కమిట్మెంట్’ ఇవ్వాల్సిందేచిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన ఓ మహిళను ఆసుపత్రిలో శానిటేషన్ పనులు చేయించే టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్(చింటు) ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆమె ఉద్యోగం కోసం అనేక మార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త నుంచి సదరు మహిళ సెల్‌కు కాల్ వచ్చింది. తాను సహాయం చేస్తానని, నీకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అయితే తనతో పాటు చింటుకు కమిట్మెంట్ ఇవ్వాలని నిస్సిగ్గుగా అడిగాడు.ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను అలాంటి దానిని కాదని, డబ్బులు కావాలంటే ఇస్తానని బాధితురాలు చెప్పగా.. ‘డబ్బు వద్దు’ అని చెబుతూ గట్టిగా మాట్లాడుతూ ‘ఒప్పుకుంటే ఇప్పిస్తా.. లేదంటే లేదు’ అని తేల్చి చెప్పాడు. అది లేకుండా ఉద్యోగం కుదరదా? అని సదరు మహిళ ప్రశ్నిస్తూ..‘ఎవరు అడిగారు’ అని అడగ్గా.. తానే అడిగానంటూ అంటూ సదరు వ్యక్తి చెప్పడం గమనార్హం.కాగా, ఈ ఘటన వారం క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. హిందూపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చింటు ఈ వ్యవహారం అంతా తనకు చుట్టుకుంటుందని తెలిసి నిందితుడి తరఫున మాట్లాడి తప్పించే ప్రయత్నం చేశాడు. ఇది కాస్తా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల దగ్గరకు వెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా చేసినట్టుగా తెలుస్తోంది.
- 
      
                   
                                                       ఎటుపోతోంది విశాఖ?చోరీలు.. దోపిడీలు.. హత్యలు.. లైంగిక దాడులు.. గంజాయి బ్యాచ్‌ల గ్యాంగ్ వార్లు.. మాదక ద్రవ్యాల మత్తులో యువకుల ఘర్షణలు.. ఇలా వరుస ఘటనలతో విశాఖ వణికిపోతోంది. ప్రశాంత నగరంలో రోజూ ఎక్కడో చోట హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో రౌడీషిటర్లు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డు మీదే కత్తులతో తెగబడుతున్నారు. హత్యలకు పూనుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ గ్యాంగ్ వార్లతో అలజడి సృష్టిస్తున్నారు. ఫలితంగా సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖ.. ఇప్పుడు సిటీ ఆఫ్ క్రైమ్‌గా మారిపోతోంది. ఇందుకు ఇటీవల జరిగిన హత్యలు, దాడులు, చోరీ ఘటనలే నిదర్శనం. – విశాఖ సిటీప్రకృతి అందాలతో అలరారే ప్రశాంత విశాఖలో నేడు రక్తపుటేర్లు పారుతున్నాయి. వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు వారాల్లో మూడు హత్యలు జరగడం కలకలం రేపుతోంది. ఈ ఆరు నెలల కాలంలో నగరంలో 12 హత్యలు చోటు చేసుకున్నాయి. వీరిలో ఏడుగురు మహిళలే బలవడం గమనార్హం. ⇒ ఈ నెల 13న అర్ధరాత్రి వెంకటేశ్వరమెట్టకు చెందిన రౌడీషిటర్ చెట్టి ఎల్లాజీ అలియాస్ వట్టి (22) హత్యకు గురయ్యాడు. గొడవలు వద్దు.. సర్దుకుపోండి అన్నందుకు స్నేహితుడే అతడిని కత్తితో పొడిచి హతమార్చాడు. ⇒ ఈ నెల 8న అర్ధరాత్రి పాత కక్షలతో పెందుర్తి పరిధి పులగానిపాలానికి చెందిన రౌడీషిటర్ మాసపు లోహిత్ (20) అలియాస్ నానిని అతడి స్నేహితులే పక్కా ప్లాన్ వేసి చంపేశారు. మాధవధార కుంచుమాంబ అమ్మవారి పండగలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ⇒ ఈ నెల 6న కొబ్బరితోటకు చెందిన కనకరాజు(32) అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. మద్యం సేవించి కింద పడటంతో తల వెనుక బలమైన గాయం తగలడంతో మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించామని పోలీసులు చెబుతుండగా.. ఇది హత్యేనని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ⇒ ఈ నెల 1న జ్ఞానాపురం శ్మశానవాటికలో అల్లిపురం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ నాగమణి ఎల్లాజీ(35) హత్యకు గురయ్యాడు. శ్మశాన వాటిక సిబ్బందిని బెదిరించిన ఘటనలో ఒకరు చేతిలో ఉన్న గెడ్డపారతో ఎల్లాజీ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళలకు రక్షణ కరువుఒక్క రోజులో డెలివరీ కాబోయే భార్యను అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన భర్త.. డబ్బు కోసం వృద్ధ దంపతులపై కత్తితో దాడి చేసి వివాహిత మెడ కోసి మంగళసూత్రాన్ని ఎత్తుకుపోయిన అగంతకుడు.. పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు, ఆమె తల్లి గొంతు కోసిన ప్రియుడు.. దాకమర్రి ఫార్చ్యూన్ లేఅవుట్లో మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు.. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని వారించిన తల్లిని కొట్టి చంపిన కొడుకు.. ఇలా విశాఖలో వరుసగా మహిళలు హత్యకు గురవుతూ నే ఉన్నారు.మహిళల రక్షణే తమ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితలు విశాఖలో పరిస్థితులపై కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోరు మెదపడం లేదు. పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నా.. కూటమి ప్రభు త్వానికి పట్టడం లేదు. ఈ ఘటనలు విశాఖ ఆర్థిక రాజధానిగా కాకుండా నేర రాజధానిగా మారుతోందన్న వార్తలకు బలాన్నిస్తున్నాయి.డ్రగ్స్ కలకలం కూటమి ప్రభుత్వంలో విశాఖ గంజాయికే కాకుండా డ్రగ్స్ కూడా అడ్డాగా మారిపోయింది. అందుకు ఇటీవల జరిగిన కొకైన్ వ్యవహారమే నిదర్శనం. ఢిల్లీ నుంచి కొకైన్‌ను విశాఖకు తీసుకొచ్చిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురి కూటమి నేతల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్‌తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ వీరిలో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చూపించారు.మిగిలిన ఇద్దరిని వదిలేయడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వీరిని అరెస్టు చేయకుండా కూటమి ప్రజాప్రతినిధులపై పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ సరఫరాదారుడు ఢిల్లీలో ఉంటే ప్రిన్స్ అనే కింగ్‌పిన్ కోసం పోలీసుల ప్రత్యేక బృందాలు అక్కడకు వెళ్లాయి. కానీ ఇప్పటి వరకు అతడి ఆచూకీ లభించిలేనట్లు తెలుస్తోంది. గంజాయి బ్యాచ్‌ల గ్యాంగ్వార్కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గంజాయి బ్యాచ్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రణాళిక పేరుతో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హడావుడి చేశారు. కానీ నగరంలో గంజాయి నిర్మూలన జరగకపోగా.. వినియోగం పెరిగిపోయింది. ఏజెన్సీలో జరిగే గంజాయి సాగుపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో నగరం నడిరోడ్డులోనే గంజాయి మొక్కలు దర్శనమివ్వడం సంచలనం రేపింది.కొద్ది నెలల కిందట ఆంధ్రా మెడికల్ కాలేజీ వెనుక గంజాయి మొక్కలను గుర్తించగా.. తాజాగా వారం కిందట జ్ఞానాపురంలో ఒక పాడుబడిన ఇంట్లో గంజాయిని సాగు చేస్తున్న విషయం బయటపడింది. ఇలా కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు నగరానికి పాకింది. గంజాయి వినియోగం సైతం విపరీతంగా పెరిగింది. గంజాయి మత్తులో యువకులు నిత్యం దాడులు, దోపిడీలతో అమాయకులపై తెగబడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో గ్యాంగ్ వార్లు విపరీతంగా పెరిగిపోయాయి. ⇒ ఈ నెల 6న అర్ధరాత్రి తమను అవమానకరంగా మాట్లాడి వేధిస్తున్నారన్న కక్షతో ఓ వర్గం.. కొత్తపాలెం ప్రధాన రహదారి గవర రామాలయం వద్ద నలుగురిపై దాడి చేసి గాయపరిచింది. ⇒ ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి రైల్వే గ్రౌండ్ వద్ద రెండు గ్యాంగ్‌లు కొట్లాటకు దిగాయి. రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు గాయపడగా వారికి కేజీహెచ్‌లో చికిత్స అందించారు. ⇒ ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి గాజువాకలో జీవన్ అనే వ్యక్తిపై 11 మంది యువకులు బీరు బాటిళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
- 
      
                   
                                                       భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!ఏలూరు: అనుమానాస్పద స్ధితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక (38) తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. నూజివీడు సమీపంలో బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మందాడ లక్ష్మయ్య, ప్రభావతి కుమార్తె దేవికను పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన చిన్ని సురేంద్రకిచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పవన్ తేజ, గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక ఉంగుటూరు మండలం నల్లమాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సురేంద్ర ఉంగుటూరు మండలం రాచూరు పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. చొదిమెళ్ళ శ్రీవల్లి అపార్ట్‌మెంట్స్‌లో ఐదేళ్ల కిందట అపార్ట్మెంట్ కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఉంటున్నారు. శని, ఆదివారాలు ఏలూరు అపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సురేంద్ర వచ్చేసరికి ఉరి వేసుకుని భార్య దేవిక మృతి చెంది ఉంది. మనస్తాపంతో కాళ్లు, చేతులపై అతను తీవ్రంగా కోసుకున్నాడు. దేవిక పుట్టిన రోజు సందర్భంగా కుమారులు శుభాకాంక్షలు చెప్పేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు లిఫ్ట్ చేయకపోవడంతో ఏలూరులోనే ఉంటున్న పెదనాన్నకు చెప్పడంతో అతను అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా రక్తమడుగులో ఉన్న తమ్ముడు కనిపించాడు. వెంటనే పోలీసులకు, సురేంద్ర మామ లక్ష్మయ్యకు విషయం తెలియచేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు. మృతిపై అనుమానాలు: మృతురాలి తండ్రి తన కూతురు దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు. టీచర్ మృతి చెందిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెల్‌ఫోన్ డేటా కీలకం కానుంది. పుట్టినరోజు నాడే తన కుమార్తె దేవిక మృతి చెందటం తట్టుకోలేకపోతున్నానని తండ్రి లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న కూతురుగా గారాబంగా పెంచమని ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు.
- 
      
                   
                                                       పక్కలోకి వస్తేనే సంతకం పెడతాబెల్లంకొండ: రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. వారం రోజుల నుంచి వివాహిత వీఆర్వో వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించాడు. దీంతో 2 రోజుల క్రితం వీఆర్వో ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్ఫోన్లో వీడియో తీసి, శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహశీల్దార్ టీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి, వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


