breaking news
	
		
	
  - 
      
                   
                                                       భర్త బర్త్ డే విషెస్ చెప్పలేదని టీచర్..!!ఏలూరు: అనుమానాస్పద స్ధితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక (38) తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. నూజివీడు సమీపంలో బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మందాడ లక్ష్మయ్య, ప్రభావతి కుమార్తె దేవికను పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామానికి చెందిన చిన్ని సురేంద్రకిచ్చి 20 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి పవన్ తేజ, గౌతమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దేవిక ఉంగుటూరు మండలం నల్లమాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సురేంద్ర ఉంగుటూరు మండలం రాచూరు పాఠశాలలో హెచ్ఎంగా ఉన్నారు. చొదిమెళ్ళ శ్రీవల్లి అపార్ట్‌మెంట్స్‌లో ఐదేళ్ల కిందట అపార్ట్మెంట్ కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఉంటున్నారు. శని, ఆదివారాలు ఏలూరు అపార్ట్‌మెంట్‌కు వెళ్తుంటారు. శనివారం సాయంత్రం 5 గంటలకు సురేంద్ర వచ్చేసరికి ఉరి వేసుకుని భార్య దేవిక మృతి చెంది ఉంది. మనస్తాపంతో కాళ్లు, చేతులపై అతను తీవ్రంగా కోసుకున్నాడు. దేవిక పుట్టిన రోజు సందర్భంగా కుమారులు శుభాకాంక్షలు చెప్పేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు లిఫ్ట్ చేయకపోవడంతో ఏలూరులోనే ఉంటున్న పెదనాన్నకు చెప్పడంతో అతను అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా రక్తమడుగులో ఉన్న తమ్ముడు కనిపించాడు. వెంటనే పోలీసులకు, సురేంద్ర మామ లక్ష్మయ్యకు విషయం తెలియచేసి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు. మృతిపై అనుమానాలు: మృతురాలి తండ్రి తన కూతురు దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు తండ్రి లక్ష్మయ్య తెలిపారు. పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని కోరారు. టీచర్ మృతి చెందిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెల్‌ఫోన్ డేటా కీలకం కానుంది. పుట్టినరోజు నాడే తన కుమార్తె దేవిక మృతి చెందటం తట్టుకోలేకపోతున్నానని తండ్రి లక్ష్మయ్య కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న కూతురుగా గారాబంగా పెంచమని ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు.
- 
      
                   
                                                       పక్కలోకి వస్తేనే సంతకం పెడతాబెల్లంకొండ: రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. వారం రోజుల నుంచి వివాహిత వీఆర్వో వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించాడు. దీంతో 2 రోజుల క్రితం వీఆర్వో ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్ఫోన్లో వీడియో తీసి, శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహశీల్దార్ టీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి, వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- 
      
                   
                                                       మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి రిమాండ్సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విజయవాడ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. మిథున్‌రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది. ఓ పార్లమెంట్ సభ్యుడికి నిబంధనల ప్రకారం జైలులో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తారో వాటన్నింటినీ మిథున్‌రెడ్డికి కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. వెంట మందులు తీసుకెళ్లేందుకు మిథున్‌రెడ్డికి అనుమతినిచ్చింది.ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం అక్రమ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘ విచారణ తరువాత శనివారం రాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కోర్టు ఎదుట హాజరుపరిచే ముందు మిథున్‌రెడ్డిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.రాజకీయ కక్ష సాధింపుతో నాపై కేసు పెట్టారు ఈ సందర్భంగా మిథున్‌రెడ్డితో న్యాయాధికారి మాట్లాడారు. ఊరు, పేరు, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబంలో ఎంత మంది ఉంటారు.. వంటి వివరాలు అడిగారు. వాటన్నింటికీ మిథున్‌రెడ్డి సమాధానం చెప్పారు. తనపై దురుద్దేశాలతో, రాజకీయ కారణాలతో ఈ కేసు నమోదు చేశారని మిథున్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. తానెలాంటి తప్పు గానీ, నేరం గానీ చేయలేదన్నారు. కోర్టు ముందు హాజరుపరిచే ముందు వైద్యులు తనకు రెండుసార్లు ఈసీజీ పరీక్షలు నిర్వహించారని, రెండింటికీ తేడాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల తనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి.. ఆ తర్వాత మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు. మిథున్‌రెడ్డి మూడు పర్యాయాల నుంచి ఎంపీగా ఉన్నారని తెలిపారు. ఆయన లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారని వివరించారు. ఆయనకున్న ప్రాణహాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించిందని నాగార్జునరెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో జైలులో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే వెంట మందులు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరారు. పిటిషనర్‌కు రిమాండ్ విధిస్తే తగిన సౌకర్యాలు ఉన్న నెల్లూరు కేంద్ర కారాగారానికి గానీ, రాజమండ్రి కేంద్ర కారాగారానికి గానీ పంపాలని కోరారు. జైలులో వీఐపీ బ్యారెక్ కేటాయించాలని అభ్యర్థించారు.కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు వీలుగా జైలులో ఎక్కువ ములాఖాత్‌లను మంజూరు చేయాలని కోర్టును కోరారు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిట్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ మద్యం విధానంలో మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని తెలిపారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మిథున్‌రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. నెల్లూరు, రాజమండ్రి కేంద్ర కారాగారాలకు కాకుండా, విజయవాడ లేదా గుంటూరు జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి ఆగస్టు 1 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించింది.రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు మిథున్‌రెడ్డి సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాత్రి 8.38 గంటలకు తీసుకొచ్చారు. జైలు అధికారుల ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయనకు కేటాయించిన బ్యారక్‌లోకి తీసుకెళ్లారు. పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాకినాడ వెళ్లే రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. 144 సెక్షన్, 30 సెక్షన్లు అమలు చేశారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయనకు మద్దతుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలి వచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పార్టీ నేతలు జైలు వద్ద నిరసనకు దిగారు. జైలు గేటు ఎదురుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ బైఠాయించి, నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
- 
      
                   
                                                       అంబేద్కర్ పేరుతో రూ.100 కోట్లకు కుచ్చుటోపీ.. బయటపడింది ఇలావిశాఖపట్నం: అంబేద్కర్ ఆశయసాధన పేరుతో వేలాది మందికి కుచ్చుటోపీ పెట్టి, కోట్ల రూపాయలు కాజేసిన స్నేహా మ్యాక్స్ సంస్థపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కటికల శివభాగ్యారావు అంబేద్కర్ ఆశయాలు సాధన కోసం అంటూ ‘స్నేహ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ’ని స్థాపించారు. ఉన్నతాధికారిగా పని చేసిన వ్యక్తి, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నాడని నమ్మి అనేకమంది సభ్యులుగా చేరారు.తమ సంస్థలో డబ్బు ఆదా డిపాజిట్ చేస్తే 12 శాతం వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇలా రూ.100 కోట్లవరకూ వసూలు చేశాడు. అంతేకాకుండా సంస్థకు వచ్చిన లాభాలను దళితుల సంక్షేమానికి వినియోగిస్తానని తెలిపాడు. దీంతో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు దాదాపు 2,500 మంది వరకు సభ్యులుగా చేరారు. లక్షలాది రూపాయలు స్నేహా మ్యాక్స్‌లో డిపాజిట్లు, ఇతర రకాల పద్దుల కింద జమ చేశారు.2008లో ఏర్పాటైన ఈ సంస్థ సభ్యులకు కొన్నాళ్లపాటు వడ్డీలు చెల్లించింది. ఆ తరువాత రానురాను కార్యకలాపాలను తగ్గించుకుంటూ రావడం, చైర్మన్‌గా ఉన్న భాగ్యారావు అందుబాటులో లేకపోవడంతో సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో 87వ వార్డు సిద్ధార్థనగర్‌లో నివాసముంటున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి ఎన్.బాలభాస్కరరావు మరో పది మందితో కలిసి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థకు చెందిన ఆరుగురిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.అరెస్ట్ అయిన వారిలో గోపాలపట్నానికి చెందిన గూడిపూడి సీతామహాలక్ష్మి, రాజీవ్‌నగర్‌కు చెందిన మాటూరి శ్రీనివాసరావు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఉండవల్లి శ్రీనివాసరావు, సీతమ్మధారకు చెందిన విశ్వేశ్వరరావు, రంగారావు, ధనలక్ష్మి ఉన్నారు. దీనిలో ప్రధాన సూత్రధారి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సహా మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- 
      
                   
                                                       నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్ధనుష్ నటించిన తెలుగు సినిమా ‘కుబేర’.. థియేటర్ నుంచి ఇప్పడు ఓటీటీకి వచ్చి అలరిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా కథాంశం తరహాలోనే నెల్లూరులో ఓ భారీ కుంభకోణం ఇప్పుడు బయటపడింది.సాక్షి, నెల్లూరు: కుబేర సినిమా తరహాలో జిల్లా కేంద్రంలో బయటపడిన ఓ భారీ స్కామ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10 కోట్ల 60 లక్షల మేర సొమ్మును కేటుగాళ్లు మాయ చేశారు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు.ఓ ఫేక్ కంపెనీని ఏర్పాటు చేసి.. అందులో కొందరు గిరిజనులను ఉద్యోగులుగా చూపించారు. వాళ్లకు ఆరు నెలలపాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేశారు. అలా మొత్తం 56 మంది పేరిట నెల్లూరు యాక్సిస్ బ్రాంచ్‌లో లోన్లకు అప్లై చేసి డబ్బు చేజిక్కించుకున్నారు. అయితే.. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో గిరిజనులకు నోటీసులు వెళ్లాయి. దీంతో వాళ్లు లబోదిబోమన్నారు. 2022 నుంచి సుమారు రెండేళ్లపాటు ఈ భారీ స్కామ్ జరిగినట్లు తేలింది. కిందటి ఏడాది సదరు బ్రాంచ్ మేనేజర్ ముగ్గురు వ్యక్తుల మీద ముత్తుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
- 
      
                   
                                                       భార్యకు అదే పిచ్చి... భర్త ఏం చేసాడంటే!కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్‌కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్‌లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కని్పంచలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు.
- 
      
                   
                                                       భార్యను చంపి.. భర్త ఆత్మహత్యచంద్రగిరి: భార్య మీద అనుమానంతో ఓ భర్త ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. చిత్తూరు సమీపంలోని ఠాణాకు చెందిన లోకేశ్వర్(45)కు, మంగళం సమీపంలోని తిరుమల నగర్‌కు చెందిన ఉష(34)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 ఏళ్ల బాబు, 11 ఏళ్ల పాప ఉన్నారు. వీరిద్దరూ కోళ్లఫారం కాలనీలో నివాసం ఉంటున్నారు. లోకేశ్వర్ బీఎస్ఎన్ఎల్లో టెక్నీషియన్ కాగా, ఉష స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనిచేస్తోంది. భార్య ఉషపై లోకేశ్వర్‌కు అనుమానం ఉండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గత నెల 30న భార్యభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉష.. కాలనీ సమీపంలోని తిరుమలనగర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇదిలా ఉండగా, ఉద్యోగానికి వెళ్లేందుకు శనివారం ఉదయం 5 గంటలకు ఉష తన అమ్మ ఇంటి నుంచి బయల్దేరింది. భార్య కోసం బొమ్మల క్వార్టర్స్ వద్ద లోకేశ్వర్ కాపు కాశాడు. బస్సు కోసం బొమ్మల క్వార్టర్స్ వద్దకు వచి్చన ఉషపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. దీంతో ఘటనా స్థలంలోనే ఉష ప్రాణాలు విడిచింది. ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సీఐ సునీల్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. లోకేశ్వర్ కోసం అతని ఇంటికి వెళ్లగా.. అప్పటికే ఇంట్లో లోకేశ్వర్ ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్ తెలిపారు.
- 
      
                   
                                                       ఆ మృగాడికి బెయిల్ ఇవ్వలేం..సాక్షి, అమరావతి: కామవాంఛతో యజమాని భార్యను కిరాతకంగా చంపడమే కాకుండా, ఆ తరువాత ఆమె మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మృతురాలిపట్ల పిటిషనర్ పాశవికంగా, మృగంలా ప్రవర్తించాడని హైకోర్టు తెలిపింది. ఇలాంటి వారికి బెయిల్ మంజూరుచేస్తే అది సమాజంపై దు్రష్పభావం చూపుతుందని స్పష్టంచేసింది. ‘యజమాని భార్యను హత్యచేయడం ద్వారా అతని నమ్మకాన్ని పిటిషనర్ దారుణంగా వమ్ముచేశాడు. కాంపౌండర్‌గా తన ఇంట్లోనే ఉండేందుకు యజమాని స్థానం కల్పించాడు. విశ్వాసంగా ఉంటూ ఇంట్లో ఒకరిగా నమ్మకం కలిగించి పిటిషనర్ ఈ నేరానికి ఒడిగట్టాడు. కామవాంఛతో రగిలిపోయి మృతురాలిపట్ల ఓ మృగంలా ప్రవర్తించాడు. తన వాంఛను తిరస్కరించడంతో ఆమె తలపై అతిదారుణంగా, విచక్షణారహితంగా కొట్టి చంపాడు. హత్య అనంతరం కూడా అతని క్రూరత్వం ఏమాత్రం ఆగలేదు. మృతదేహంతో లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఇంతటి తీవ్రమైన చర్యలకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సాధ్యంకాదు. చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన ఆరోపణల తీవ్రత ఎంతమాత్రం తగ్గదు’.. అని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల తీర్పు వెలువరించారు. బంధువని ఆశ్రయమిస్తే.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ తన తండ్రితో కలిసి గత 16 ఏళ్లుగా ఫిస్టులా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ తన భార్య అర్పితా బిశ్వాస్, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఉంటున్నారు. తన దూరపు బంధువైన నయన్ బిశ్వాస్కు శ్రీకాంత్ తన ఆసుపత్రిలో కాంపౌండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. 2024 డిసెంబరు 31న న్యూఇయర్ వేడుకల్లో భాగంగా శ్రీకాంత్, నయన్, మరో బంధువు కలిసి మద్యం తాగారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రపోయారు. నయన్ బిస్వాస్ హాలులో నిద్రపోయాడు. తెల్లవారి శ్రీకాంత్ లేచి చూసేసరికి అర్పిత ఇంట్లో లేదు. ఆమె గది నిండా రక్తం ఉంది. ఆమె కోసం వెతకగా, ఇంటికి సమీపంలో మురికికాలువలో తలపై తీవ్రగాయాలతో చనిపోయి నగ్నంగా కనిపించింది. దీంతో కావలి పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి అర్పితపట్ల నయన్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమె ఎదురుతిరగడంతో ఎక్కడ నిజం బయటకు చెప్పేస్తుందోనన్న కారణంతో ఆమెను చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.బెయిల్ పిటిషన్లు కొట్టివేత.. నిందితుడు నయన్ బిశ్వాస్ నెల్లూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టేసింది. ఆ తర్వాత అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు ఇటీవల విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నయన్ బిశ్వాస్కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ అతని పిటిషన్‌ను కొట్టేశారు.
- 
      
                   
                                                       ఎమ్మెల్యే వేధింపులు తాళలేను.. ఆత్మహత్య చేసుకుంటున్నాతిరువూరు: సీనియారిటీ, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పచ్చనాయకుల సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన బదిలీలకు ఉద్యోగులు బలైపోతున్నారు. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిన చందంగా.. ఉద్యోగుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు దళిత ఉద్యోగినైన తనను వేధింపులకు గురి చేశారని, భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దళితుడైన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని మైనర్ ఇరిగేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.కిషోర్ శుక్రవారం సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖ రాశారు. తనను తిరువూరు నుంచి గౌరవరం ఎన్ఎస్సీ సెక్షన్‌కు బదిలీ చేసిన అధికారులు రిలీవ్ చేయలేదని, దీనిపై ఎమ్మెల్యేను పలుమార్లు కోరినా ఫలితం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయవాడ స్పెషల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంగయ్య, కంచికచర్ల స్పెషల్ సబ్ డివిజన్ డీఈఈ ఉమాశంకర్ కలిసి తనకు రాజకీయ రంగు పులిమి ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్యాంప్రసాద్‌కు తిరువూరు ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి తన బదిలీని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రిలీవ్ చేయవద్దన్నారని స్వయంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అధికారులు, తిరువూరు ఎమ్మెల్యే కలిసి ఆడిన రాజకీయ నాటకంలో తాను బలైపోయానని, తన చావుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఏ ఉద్యోగీ తనలా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూడాలని లేఖలో కోరారు. ఇరిగేషన్ అధికారుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు.
- 
      
                   
                                                       కోనసీమలో దారుణం.. వ్యభిచారానికి ప్రియురాలు అంగీకరించలేదని..సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కోనసీమలో కలకలం రేపుతోంది. రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.ప్రియురాలు పుష్పను వ్యభిచారం చేయడానికి తన వెంట రావాలంటూ ప్రియుడు బలవంతం చేశాడు. నిరాకరించిన పుష్పను షేక్ షమ్మ దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడినీ కూడా గాయపరిచి నిందితుడు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- 
      
                   
                                                       కోడలి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్..!తాడేపల్లి రూరల్: తన చావుకు భార్య కారణమని పేర్కొంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన బ్రహ్మయ్య (30) సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళగిరి టిడ్కో నివాసాల్లో ఉంటున్న యువతితో వివాహం జరిగింది. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని పుట్టింటికి పంపించేశాడు. అందరూ బ్రహ్మయ్యను బతిమిలాడితే ఆమెను కాపురానికి తీసుకొచ్చినట్లు బంధువులు తెలిపారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా బ్రహ్మయ్య సొంత ఇంటి నుంచి ఉండవల్లి అమరావతి రోడ్‌లోని ఒక ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ మళ్లీ ఆమె ఫోనులో ఎక్కువగా మాట్లాడుతుండటంతో గొడవలు జరిగాయి. ఈలోగా ఆషాఢ మాసం రావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన చావుకు భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని బ్రహ్మయ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోయిన ఏడాదికే ఇలా కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో బ్రహ్మయ్య తల్లి కన్నీరుమున్నీరైంది. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుందామని చెప్పినా ఎందుకు ఇలా చేశావని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి చావుకు కారణమైన కోడలు, ఆమె ప్రియుడిని శిక్షించాలని డిమాండ్ చేసింది.
- 
      
                   
                                                       విశాఖ: బాయ్స్ హాస్టల్ పక్కనే లాడ్జి.. ఛీ ఛీ ఇదేం పాడుపని..సాక్షి, విశాఖపట్నం: న్యూడ్ వీడియోలను చిత్రీకరించారనే ఆరోపణతో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.బాయ్స్ హాస్టల్, ఓ లాడ్జి పక్క పక్కనే ఉండటంతో హాస్టల్లో నుంచి లాడ్జి బాత్రూంలో సెల్ఫోన్లతో వీడియోలు తీశారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు నుంచి తన వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ బాధిత మహిళ తెలిపింది. యువకులకు దేహశుద్ధి చేసిన యువతులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకులు సెల్ ఫోన్లు ద్వారక పోలీసులు పరిశీలిస్తున్నారు.
- 
      
                   
                                                       కూతురి గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులుఒంగోలు టౌన్: క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు కుమార్తె గొంతు నులిమి చంపేయడం సంచలనం సృష్టించింది. ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముంగమూరు రోడ్డులోని విలేకరుల కాలనీ 1వ లైనులో నివశించే పల్నాటి రమేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కుమార్తె తనూష (23) డిగ్రీ చదివి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసింది. కొద్దిరోజులుగా ఒంగోలులోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనూష ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనూషకు, తల్లిదండ్రులు రమేష్, లక్ష్మికి మధ్య మంగళవారం రాత్రి వివాదం జరిగింది. క్షణికావేశానికి గురైన రమేష్, లక్ష్మి తనూష గొంతును బలంగా నులిమారు. ఊపిరాడని తనూష ప్రాణం వదిలింది. కాసేపటికి తేరుకున్న రమేష్, లక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు.రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని, కరెంటు లేకపోవడంతో సకాలంలో తాము గమనించలేదంటూ సీన్ క్రియేట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు తనూష మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. తల్లిదండ్రుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. సీఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- 
      
                   
                                                       బెజవాడలో జంట హత్యలుగాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ నగరంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను ఓ రౌడీషీటర్ హత్య చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడి.. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. విజయవాడ గవర్నర్‌పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో రౌడీషీటర్ జమ్ము కిశోర్, ఎం.రాజు(37), గాదె వెంకట్(25) మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు కాగా.. గాదె వెంకట్ విజయనగరానికి చెందిన వ్యక్తి. బుధవారం మధ్యాహ్నం ముగ్గురూ తమ గదిలో ఫుల్‌గా మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బుల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాజు, వెంకట్‌ను కిశోర్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజు, వెంకట్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కిశోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిశోర్‌పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన కిశోర్‌పై అదే ఏడాది రౌడీషీట్ తెరిచినట్లు తెలిపారు.
- 
      
                   
                                                       గండికోట బాలిక కేసులో మరో కొత్త మలుపుసాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లితన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు.
- 
      
                   
                                                       గండికోట: వైష్ణవిది హత్యా? పరువు హత్యా?సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న వైష్ణవి(17) సోమవారం కాలేజీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి విగతజీవిగా కనిపిచింది. ఇప్పటిదాకా తేలిన వివరాల ప్రకారం.. ఉదయం 8గంటలకు తన ప్రియుడు లోకేశ్‌తో బైక్‌పై గండికోటకు బయలుదేరింది. వీరు మధ్యలో పాలకోవ సెంటర్ వద్ద ఆగి కోవా తీసుకుని గండికోట టోల్ గేట్‌కు చేరుకున్నట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. అక్కడ 2 గంటల పాటు తిరిగి 10:47 నిమిషాలకు బైక్‌పై లోకేశ్ ఒక్కడే బయలుదేరినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది.వైష్ణవి కాలేజీకి రాలేదని యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని, తాము కాలేజీకి వెళ్లి ఆరా తీస్తే వైష్ణవి గండికోటకు వెళుతున్నానని తన స్నేహితులకు చెప్పినట్లు తెలిసిందని మృతురాలి సోదరుడు సురేంద్ర పోలీసులకు చెప్పాడు. దీంతో తాము గండికోటకు వెళ్లి గాలించగా.. మంగళవారం ఉదయం తన సోదరి మృతదేహం కనిపించిందని పేర్కొన్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు లోకేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు.హత్యా? పరువు హత్యా.?సోమవారం ఉదయం 10:28 నిమిషాల వరకు వైష్ణవి, లోకేశ్ కలిసే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సోమవారం ఉదయమే వైష్టవిని హత్య చేసి ఉంటే శరీరం డీకంపోజ్ అయ్యేదని, మృతదేహం చూస్తే రాత్రి చంపినట్లు ఉందని పోలీసులు గుర్తించారు. నిర్జన ప్రాంతంలో బాలిక బంధువులు మృతదేహం ఉందని గుర్తించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీంతో నిజంగా ఇది హత్యా లేక పరువు హత్యా అనే కోణంలో విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- 
      
                   
                                                       గండికోటలో దారుణంసాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడి.. హత్య చేశాడు. బాలికను బైక్‌పై గండికోట తీసుకొచ్చిన ఎర్రగుంట్లకి చెందిన లోకేష్.. గండికోటలోని ధాన్యాగారం వద్ద దారుణానికి ఒడిగట్టాడు. బాలికను వివస్త్రగా విడిచిపెట్టి వెళ్లాడు.బాలిక ప్రొద్దుటూరులోని ఓ ఇంటర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అశోక్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.
- 
      
                   
                                                       పదేళ్ల బాలికపై 80 ఏళ్ల వృద్ధుడి లైంగిక దాడిఏలూరు టౌన్: ఏలూరు నగరంలో పదేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. చిన్నారికి మాయమాటలు చెబుతూ వారం రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. బాధిత బాలిక అనారోగ్యంగా ఉండటంతో తల్లి ఆరా తీయగా ఈ దారుణం బయటపడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన తెర్రి సత్యనారాయణ (80) భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. సమీప ప్రాంతానికి చెందిన పదేళ్ల బాలిక అమ్మమ్మ ఇల్లు వృద్ధుడి ఇంటికి సమీపంలోనే ఉంది. దీంతో బాలిక పాఠశాలకు వెళుతూ తన అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో వృద్ధుడు ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ నిందితుడు సత్యనారాయణపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
- 
      
                   
                                                       అన్నమయ్య జిల్లా: లారీ బోల్తా.. తొమ్మిది మంది దుర్మరణంఓబులవారిపల్లె/పుల్లంపేట: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తాపడి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు. ఈ దుర్ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట ఇసుకపల్లి గ్రామానికి మామిడి కాయల్ని కోసి, లారీలో లోడ్ చేసేందుకు వెళ్లారు. మామిడి కాయల్ని లోడ్ చేసిన అనంతరం అదే లారీపై రైల్వేకోడూరు మామిడి మార్కెట్ యార్డుకు బయలుదేరారు. లారీ రెడ్డిపల్లి చెరువుకట్టపైకి రాగా మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గజ్జల దుర్గయ్య, గజ్జల వెంకటేశు, గజ్జల శ్రీను, గజ్జల రమణ, సుబ్బరత్నమ్మ, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి, రాధా, వెంకట సుబ్బమ్మ మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 13 మంది కూలీలను 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారీ కూలీలే. ఘటనా స్థలాన్ని ఎస్పీ రామ్‌నాథ్ కార్గే పరిశీలించారు. లారీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలిసాక్షి, అమరావతి: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై ఆదివారం రాత్రి మామిడి కాయల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన తొమ్మిది మంది చనిపోవడం, 13 మంది తీవ్రంగా గాయ పడటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరంతా నిరుపేదలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు వారిని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
- 
      
                   
                                                       డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్‌చుప్!సాక్షి టాస్క్‌ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.
- 
      
                   
                                                       పోలీసులు చంపేసి.. చెరువులో వేశారుసాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి పోలీసుల రెడ్‌బుక్ రాజ్యాంగంలో మాతంగి భరత్ అనే యువకుడి ప్రాణం పోయింది. కోర్టు వాయిదాకు హాజరు కాకపోవడంతో ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అతడిని పొట్టన పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువుగట్టు వద్ద నివాసం ఉంటున్న భరత్ ఇంటికి బుధవారం రాత్రి త్రీ టౌన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ, మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో భరత్, అతడి తమ్ముడు నవీన్, మరో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆటోలోంచి దిగిన ముగ్గురు పోలీసులు.. భరత్ అనుకుని మరొకరిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో భరత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకాడు. పోలీసులు కూడా చెరువులోకి దిగి వెంబడించారు. భరత్ ఈదుకుంటూ మరోవైపు వెళ్లగా అక్కడ మాటువేసిన మరికొందరు పోలీసులు పట్టుకుని బైక్ మీద తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు.ప్యాంట్ లేకుండా.. తీవ్ర గాయాలతో విగతజీవిగా రెండు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం భరత్ అదే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అయితే, అతడు చెరువులో దూకే సమయంలో నల్ల ప్యాంట్, టి షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహంపైన మాత్రం ప్యాంట్ లేదు. కట్ డ్రాయర్, టి షర్ట్ మాత్రమే ఉన్నాయి. భరత్ తొడలు వాచిపోయాయి. తల, ముఖంపై తీవ్రంగా, శరీరంపై గాయాలున్నాయి. దీంతో పోలీసులే కొట్టి చంపి, చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తీవ్రస్థాయిలో బెదిరింపుల మధ్య అంత్యక్రియలు భరత్ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు 5 పోలీస్ జీప్‌లు, ఒక స్పెషల్ పార్టీ బస్సు అనుసరించాయి. గతంలో తెనాలిలో పనిచేసి, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు వచ్చి.. భరత్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం. పోలీసుల తప్పు లేకపోతే ఎందుకు ఈ తతంగం నడుపుతున్నారన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వచ్చాయి. అంతేకాదు.. ‘‘ఎలాంటి హడావుడి చేయకుండా అంత్యక్రియలు జరిపించండి. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలిసింది. భరత్ శరీరంపై లాఠీదెబ్బలుంటే విచారించి న్యాయం చేస్తామని ఎలాంటి ఆందోళనలు చేయొద్దని కూడా కోరినట్లు సమాచారం. » భరత్‌పై గత నవంబరులో త్రీ టౌన్ స్టేషనులో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ నెల 14న వాయిదా కోసం తెనాలిలోని పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పొద్దుపోయాక పోలీసులు భరత్ ఇంటికి వెళ్లారు. కాగా, భరత్ తో పాటు ఇద్దరు పోలీసులు చెరువులో దూకినా కొంతసేపటి తర్వాత అతడు దొరకలేదంటూ తిరిగివెళ్లారని చెబుతున్నారు. అయితే, భరత్ విగతజీవిగా తేలేవరకు పోలీసులు చెరువు వైపు చూడకపోవడం అనుమానాలను మరింత తీవ్రం చేస్తోంది. భరత్ వారి వద్ద ఉన్నందునే పోలీసులు చెరువు వద్దకు మళ్లీ రాలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ అయ్యారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్‌లో తెనాలి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెనాలిలో వరుస ఘటనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని డీఎస్పీపైనా నిప్పులు చెరిగినట్లు సమాచారం.పోలీసులు చిత్రహింసలు పెట్టి నా బిడ్డను చంపేశారు మావాడు ఎంతసేపైనా ఈదగలడు. అలాంటివాడు చెరువులో మునిగి ఎలా చనిపోతాడు? పోలీసులే పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులను ఏమార్చి పారిపోయి ఉంటాడని అనుకున్నాం. శవమై తేలతాడని ఊహించలేదు. భరత్‌పై పోక్సో కేసు కూడా బూటకమే. పోలీసులకు ఎప్పుడేది అనిపిస్తే ఆ కేసు పెట్టడం, లోపల వేయడం అలవాటైంది. అబ్బాయిని తీసుకుని స్టేషన్‌కు రమ్మంటే తీసుకెళ్లేదాన్ని. చంపేయడం ఎందుకు? –భరత్ తల్లి సుశీల బీర్జాల మీద కొట్టారు.. ఒంటిపైన లాఠీదెబ్బలు ఉన్నాయి మా అన్నను ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ మరో పదిమంది కానిస్టేబుళ్లు కలిసి పట్టుకుని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అతడి ఒంటిపై లాఠీ దెబ్బలు ఉన్నాయి. బీర్జాల మీద కొట్టడంతోనే మరణించాడు. తర్వాత తెచ్చి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులు వెళ్లాక రాత్రంతా చెరువు చుట్టూ వెదికాం. కానీ, విగతజీవిగా కనిపించాడు. ఇది పోలీసులు చేసిన హత్యే. ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. తెనాలిలో పనిచేసిన నరసింహారావు అనే పోలీసు వచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. –భరత్ తమ్ముడు నవీన్ పోలీసులు చేసిన హత్యగా కనిపిస్తోంది భరత్ మృతి పోలీసులు చేసిన హత్య అని స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు బలమైనవే. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చాలి. పోలీసుల ప్రమేయం ఉన్నందున, స్థానిక అధికారులు విచారిస్తే న్యాయం జరగదు. బయటి పోలీసులు లేదా సీఐడీతో విచారణ చేయించాలి. –జి.శాంతకుమార్, అధ్యక్షుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్
- 
      
                   
                                                       వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యశ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్‌హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు. ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్‌పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ వారే చంపారు...ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్‌నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్‌పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్‌ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు
- 
      
                   
                                                       ఎన్టీఆర్ జిల్లా: పోస్టాఫీసులో రూ.50 లక్షల గోల్మాల్సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు పోస్టాఫీసు పరిస్థితి. గ్రామానికి చెందిన పలువురు ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము, డిపాజిట్లను పోస్టుమాస్టరే కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పోస్టల్ శాఖలో పని చేస్తున్న క్రమంలో తన అకౌంట్ స్టేటస్‌ని చెక్ చేసుకోగా ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము లేకపోవడంతో అనుమానం వచ్చి పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఉన్నతాధికారులు గురువారం సున్నంపాడు వచ్చి విచారణ చేపట్టగా.. ఇప్పటి వరకు రూ.22లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైనట్లు తేలినట్లు తెలిసింది. మొత్తం రూ.50 లక్షలకు పైగానే సొమ్మును పోస్టుమాస్టర్ విత్‌డ్రా చేసినట్లు తెలుస్తోంది. పోస్టాఫీసులో ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండడంతో ఇవాళ లేదా రేపు (శుక్ర,శని) అధికారులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. నగదు గోల్‌మాల్‌పై డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు.
- 
      
                   
                                                       Ongole: పాపం పసివాడుచిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
- 
      
                   
                                                       విజయవాడలో దారుణం.. ఇంటి ఓనర్‌ను పని మనిషే..సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆర్అండ్బి రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందారు. రామారావు ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేస్తున్న మహిళే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషాతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో అనుషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. అనూషతో పాటు మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.నగరంలోని మాచవరం పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్‌గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే.. అదే ఇంట్లో నివాసం ఉంటోంది.శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి.. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచంపై కారం కూడా చల్లి ఉంది. కళ్లల్లో కారం కొట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు, బీరువా కూడా పగులగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి.. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది.వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తు మందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్థారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


