వాట్సాప్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు : యువతి అరెస్ట్ | Girl arrested for Whatsapp message in Adilabad | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు : యువతి అరెస్ట్

Dec 29 2017 7:59 PM | Updated on Oct 22 2018 6:10 PM

Girl arrested for Whatsapp message in Adilabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆదిలాబాద్‌: సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియోలో వ్యాఖ్యలు చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో ఆదివాసీల నిరసనల్లో చెలరేగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని వనపర్తి జిల్లా కొత్తపేట గ్రామానికి చెందిన ముదావత్‌ సోను(22) ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసిందని వన్‌టౌన్‌ సీఐ సురేష్‌ తెలిపారు. సెక‌్షన్‌ 66(ఏ) ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2008 ప్రకారం నేరమవుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని రాంనగర్‌ కాలనీకి చెందిన యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేశామని, మహిళా పోలీసు సిబ్బందితో కలిసి మహబూబ్‌నగర్‌ లోని ముర్లా కాలనీలో సోనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement