
సాక్షి, నూజివీడు(కృష్ణా జిల్లా) : ఇంజినీరింగ్ విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద జగన్నాధ పండు అనే పాత నేరస్తుడు ఇంజినీరింగ్ విద్యార్థులతో గంజాయి విక్రయానికి బేరసారాలు చేస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అతని దగ్గర నుంచి 359 గ్రాముల ముడి గంజాయితో పాటు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయిని కొనుగోలు చేస్తున్న విద్యార్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రుల సమక్షంలో సీఐ రామచంద్రరావు, డీఎస్‌పీ శ్రీనివాస్‌లు కౌన్సిలింగ్ నిర్వహించారు.