ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నగరంలోని తుకివాకంలో బయోగ్రీన్ సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. గరుఢవారధి పనులను పరిశీలించామని అన్నారు. రూ. 9 కోట్లతో ప్రకాశం పార్క్‌ని అభివృత్ధి చేస్తున్నామని అన్నారు. తిరుపతిలో డ్రైనేజీ వ్యవస్థ , రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. తిరుపతి అర్బన్ డెవెలప్‌మెంట్ పెరిధిని పెంచాలని నిర్ణయించామని దానిలో భాగంగానే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. శ్రీకాళహస్తి పట్టణాబివృద్ధికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని అన్నారు.