వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్ | ysrcp leaders arrested in east godavari district | Sakshi
Sakshi News home page

Nov 16 2016 4:12 PM | Updated on Mar 21 2024 5:16 PM

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు హైవేపై బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు కిర్లంపూడి వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, రౌతు సూర్యప్రకాశ్, జక్కంపూడి రాజా, తోట సుబ్బారావు నాయుడు, సుంకర చిన్నిలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రాజమండ్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement