తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి తిరుగుబాటు చేశారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి తనను తప్పించినా, దాన్ని ఒప్పుకోవడం లేదు. తనను తప్పించడం పార్టీ నిబంధనల ప్రకారం అక్రమమని, అందువల్ల తన అనుమతి లేకుండా ఎవరూ అన్నాడీఎంకే ఖాతాలలో ఉన్న డబ్బులు తీసుకోడానికి అనుమతించొద్దని బ్యాంకులకు లేఖలు రాశారు.