వైఎస్సార్‌సీపీకి క్యాడరే బలం..బలగం ! | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీకి క్యాడరే బలం..బలగం !

Nov 28 2026 1:20 AM | Updated on Nov 28 2026 1:20 AM

● లోకల్‌ ఫైట్‌లో క్యాడర్‌ పోరాటం

చరిత్రాత్మకం

● కార్యకర్తల కోసం వైఎస్‌ జగన్‌

ఎందాకై నా వెళతారు

● వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత,

ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి

రాజంపేట: వైఎస్సార్‌సీపీకి క్షేత్రస్థాయి కార్యకర్తలు, క్యాడరే అసలైన బలం, బలగమని ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజంపేట పట్టణంలోని సీటీ కల్యాణమండపంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విజేతల (ఎంపీటీసీ, సర్పంచ్‌, కౌన్సిలర్లు) ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

కూటమి ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని మిథున్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనిస్తే తమ పరువు పోతుందనే భయంతోనే అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని, ఈ విషయం అధికారులు, పోలీసులు, ఎన్నికల సంఘానికి కూడా తెలుసునని అన్నారు. ఇన్ని దౌర్జన్యాలను తట్టుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ చేసిన పోరాటం చరిత్రాత్మకమని ప్రశంసించారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం:

పార్టీ క్యాడర్‌ కోసం మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎందాకై నా వెళతారని, ఆయన బాటలోనే తామంతా నడుస్తూ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మిథున్‌రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ప్రజాసమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటి నుంచే ప్రజల మన్ననలు పొందుతూ 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు క్యాడర్‌ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిశీలకుడు సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా,మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీ మేడా సోదరుడు మధుసూధన్‌రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, మదన్‌రెడ్డి, గోపిరెడ్డి, రాజారెడ్డి ,భూమనశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement