వేంపల్లె: వేంపల్లె సర్పంచ్ ఎన్నికల పోలింగ్ రోజున బూత్‌లను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లెలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి నివాసంలో స్థానిక నాయకులు, కార్యర్తలతో ఆయన ఎన్నికలపై సమీక్షించారు. పోలింగ్ రోజున కూటమి నాయకులు అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తారని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అక్రమాలను అడ్డుకోవాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడాలని సూచించారు. పార్టీ మద్దతుదారుడు షబ్బీర్ వలిని సర్పంచ్‌గా గెలిపించుకునేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రాచినేని శ్రీనివాసులు, విష్ణువర్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ గోగుల కొండయ్య, సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలి, సల్మా, భారతిలతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి


