స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

● వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

● ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వరాదు

● రీజనల్‌ కో–ఆర్డినేటర్‌

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కడప కార్పొరేషన్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, అసెంబ్లీ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందన్నారు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా మనవైపు నిలబడే వారినే అభ్యర్థులుగా నిలపాలన్నారు. ప్రతి చోటా పోటీ చేయాలని, ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వరాదని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులు, అధికార యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని, అయినా ఎక్కడా రాజీపడకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాజంపేట మినహా సుమారు 67వేల మందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. 2 వేల మందికి ఫోటోలు సరిగా లేవని, వారి ఫోటోలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పరిశీలకులు కూడా కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమశిక్షణ కమిటీ ఛైర్మెన్‌ శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, డాక్టర్‌ దాసరి సుధ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, సీఈసీ సభ్యులు కె. సురేష్‌ బాబు, ఏ. మల్లికార్జునరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌. గురుమోహన్‌, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, పార్టీ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, ఆదిత్యరెడ్డి, పులిసునీల్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement