చదువుల సరస్వతులు.. ఆ ముగ్గురు ఆదర్శ కుమార్తెలు! | - | Sakshi
Sakshi News home page

చదువుల సరస్వతులు.. ఆ ముగ్గురు ఆదర్శ కుమార్తెలు!

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

రాజంపేట: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నందలూరు మండలం టంగుటూరుకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్‌ కండక్టరు కంభాలకుంట సుబ్బరాయుడు, సరస్వతి దంపతులు తమ ముగ్గురు కుమార్తెలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఆడపిల్లలకు ఇంట్లో ఎలాంటి పనులూ చెప్పకుండా, కేవలం చదువుపైనే దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. కన్నవారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ ముగ్గురూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

పెద్దమ్మాయి లావణ్యలక్ష్మీ: 2009లో గ్రూప్‌–1 విజేతగా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్‌ చేపట్టారు. విజయవాడ సెంట్రల్‌ ఏసీపీగా, మార్కాపురం ఓఎస్డీగా పనిచేసిన ఈమెకు 14 ఏళ్ల సర్వీసు ఉంది. ప్రస్తుతం తిరుపతిలో ఏపీ ట్రాన్స్‌కో ఛీప్‌ విజిలెన్స్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చెల్లెలు లక్ష్మీప్రసన్నకుమారి: అక్కను ఆదర్శంగా తీసుకున్న లక్ష్మీ 2023 గ్రూప్‌–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే 3వ ర్యాంక్‌ సాధించి, ప్రస్తుతం నెల్లూరు ఆర్డీవోగా పనిచేస్తున్నారు.

మరో సోదరి మాధవి: అక్కల బాటలోనే వైష్ణవీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. గ్రూప్‌–2 విజేతగా నిలిచేందుకు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈమె భర్త కిరణ్‌కుమార్‌ కడపలో వ్యాపారి.

‘మా కలలను నిజం చేశారు’ – తల్లి సరస్వతి

‘మేము పెద్దగా చదువుకోకపోయినా బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వారికి ఇంట్లో పను లు చెప్పకుండా నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. ఆ చదువే మా ముగ్గురు బిడ్డల జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చింది.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement