– కేజీబీవీల రాష్ట్ర సెక్రటరీ దేవానందరెడ్డి
కడప ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయల్లో ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్‌పీ) వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పరిపాలన ప్రక్రియలో పారదర్శకత, వేగం, పెరుగుతాయని కేజీబీవీ రాష్ట్ర సెక్రటరీ దేవానందరెడ్డి పేర్కొన్నారు. కేజీవీబీల్లో ఈఆర్‌పీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శనివారం ఆలంఖాన్‌పల్లిలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన జీసీడీఓలు, కేజీబీవీ సిబ్బందికి నిర్వహించిన జిల్లా స్థాయి ఈఆర్‌పీ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌జిల్లా సమగ్రశిక్ష ఏపీసీ అనుఽరాధ పలు సూచనలు చేశారు. జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్యమేరీ, తిరుపతి జీసీడీఓ పుష్ప, చిత్తూరు జీసీడీఓ కృష్ణవేణి, అలెస్కో వెంకటరామయ్య పాల్గొన్నారు.


