అధికారపీఠమెక్కిన క్షణం నుంచి అధికారమదమెక్కి అరాచకాలు సాగిస్తున్న ‘నారా’ద్వయంపై యువత కన్నెర్ర చేసింది. కొలువే లక్ష్యంగా..
పుస్తకాలే లోకంగా డీఎస్సీ అభ్యర్థులు చేసిన ‘ ఉద్యోగ యజ్ఞాన్ని’ భగ్నం చేసిన పాలకుల కుటిల నీతిని ఎండగట్టింది. ‘డీఎస్సీ’లో అవినీతికి ద్వారాలు తెరిచి...అక్రమార్కులకు పట్టం కట్టిన తండ్రీ కొడుకుల తీరును తూర్పారబట్టింది. యువత ఆశల రెక్కల్ని నిలువునా విరిచిన సర్కారు తీరుపై ఉద్యమించింది. నారా లోకేష్ రాజీనామా చేయాలని నినదించింది.. కాదూ..కూడదంటే తొక్కి పట్టి ‘నార’ తీస్తామంటూ హెచ్చరించింది.


